Honda Upcoming Cars: ఆరు కొత్త ఎస్‌యూవీలు లాంచ్ చేయనున్న హోండా - పూర్తిగా ఎలక్ట్రిక్ అవ్వాలనే టార్గెట్‌తో!
హోండా మోటార్స్ త్వరలో కొత్త కార్లు లాంచ్ చేయనుంది. పూర్తిగా ఎలక్ట్రిక్‌లా మారేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
Honda Motors: హోండా మోటార్ కంపెనీ భారతదేశంలో తన మార్కెట్ వాటాను తిరిగి పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఇది కొన్ని వ్యూహాత్మక చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఈ జపనీస్ వాహన తయారీ సంస్థ భారతీయ మార్కెట్లో అమేజ్ కాంపాక్ట్ సెడాన్, సిటీ సెడాన్, ఎలివేట్ మిడ్ సైజ్ ఎస్‌యూవీ అనే మూడు మోడళ్లను మాత్రమే విక్రయిస్తోంది. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఎలివేట్‌ను ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో తమ విక్రయాలను 35 శాతం పెంచుకోవాలని హోండా లక్ష్యంగా పెట్టుకుంది.
కొత్తగా ఐదు వాహనాలు
ఇటీవల ఒక ఆన్‌లైన్ మీడియా పబ్లికేషన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసియా హోండా మోటార్ కంపెనీ ప్రెసిడెంట్, సీఈవో తోషియో కువహరా భారతదేశం కోసం హోండా విస్తరణ ప్రణాళికలను చర్చించారు. 2030 నాటికి ఐదు కొత్త ఉత్పత్తులను పరిచయం చేయడం ద్వారా తన మోడల్ లైనప్‌ను బలోపేతం చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇవన్నీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎస్‌యూవీ విభాగంలోకి వచ్చే అవకాశం ఉంది.
ఎలివేట్ ఎలక్ట్రిక్ త్వరలో...
హోండా ఎలివేట్‌పై బేస్ అయి రూపొందిన ఎలక్ట్రిక్ SUV అత్యంత ముఖ్యమైన రాబోయే మోడళ్లలో ఒకటి. ఇది ఎలక్ట్రిక్ వాహనాపై హోండా బలమైన నిబద్ధతను సూచిస్తుంది. సంస్థ మొదటి దృష్టి తన వాహనాలను విద్యుదీకరించడంపై ఉంటుందని కువహారా వెల్లడించారు.
వచ్చే మూడేళ్లలో హోండా తన మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ కారును పరిచయం చేయనుంది. 2040 నాటికి గ్లోబల్ కార్బన్ న్యూట్రలైజేషన్‌ను సాధించాలని హోండా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి కంపెనీ 2030, 2035, 2040 కోసం ప్రణాళికలను సిద్ధం చేసింది.
సాంకేతికతను అభివృద్ధి చేయడానికి, మార్కెట్‌ను బలోపేతం చేయడానికి హోండా ఇతర కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పరచుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది. పరస్పర ప్రయోజనకరమైన సంబంధాన్ని నిర్ధారించడం ప్రాముఖ్యతకు కంపెనీ గొప్ప ప్రాధాన్యతనిస్తుంది.
ముఖ్యంగా చవకైన ఈవీల అభివృద్ధి కోసం హోండా గత సంవత్సరం జనరల్ మోటార్స్‌తో చేతులు కలిపింది. కానీ ఇటీవల ఈ రెండు కంపెనీలు తమ ఐదు బిలియన్ డాలర్ల ప్రణాళికను పక్కనపెట్టారు. జనరల్ మోటార్స్ వ్యూహాత్మక మార్పు కారణంగా భాగస్వామ్యాన్ని ముగించాలనే నిర్ణయం తీసుకున్నాయి. యునైటెడ్ ఆటో వర్కర్స్ సమ్మెకు సంబంధించిన ఖర్చులు పెరగడం కూడా దీనికి కారణం కావచ్చు. అయితే హోండా మాత్రం తన భవిష్యత్ ఈవీ ప్లాన్లపై ఉన్న నిబద్ధతలో ఎటువంటి మార్పు లేదని ధృవీకరించింది.
మరోవైపు భారతదేశపు అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి సెప్టెంబర్ త్రైమాసికంలో అత్యధిక విక్రయాలు, లాభాలతో అపూర్వమైన ఫలితాలను నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే మారుతి సుజుకి ఏకంగా 80.3 శాతం వృద్ధిని నమోదు చేసింది.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial