Honda SP 125: కేవలం ₹10,000 డౌన్ పేమెంట్ తో బైక్ మీ సొంతం! EMI, మైలేజ్ వివరాలు తెలుసుకోండి!
Honda SP 125 Features: ఈ హోండా బైక్ 123.94cc సింగిల్-సిలిండర్ BS 6, OBD2 కంప్లైంట్ PGM-FI ఇంజిన్‌తో పరుగులు పెడుతుంది. ఇది 8kW పవర్ & 10.9 Nm టార్క్‌ను ఇస్తుంది.

Honda SP 125 Price, Down Payment, Loan and EMI Details: భారతీయ మార్కెట్లో, బైక్ కొనేవాళ్లలో ఎక్కువ మంది మధ్య తరగతి, పేద వర్గాల ప్రజలు. వాళ్లంతా మంచి మైలేజీ ఇచ్చే బైక్‌మే చూస్తారు. కామన్ మ్యాన్ కోరుకునే అలాంటి లక్షణాలు ఉన్న బైకుల్లో హోండా SP 125 ఒకటి. ఈ టూవీలర్ రోజువారీ అప్&డౌన్‌కు మీకు సరైన సాధనం అవుతుంది. ఆఫీస్ లేదా కాలేజీకి వెళ్లే కుర్రవాళ్ల కోసం హోండా SP 125 స్టైలిష్‌గా డిజైన్ చేశారు, పైగా ధర కూడా అందుబాటులో ఉంటుంది.
హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధర ఎంత?
హోండా SP 125ను హైదరాబాద్‌లో రూ. 93,253 ఎక్స్-షోరూమ్ ధరకు (Honda SP 125 ex-showroom price) విడుదల చేశారు. దాదాపు రూ. 13,000 TRO ఛార్జీలు, దాదాపు రూ. 7,500 ఇన్సూరెన్స్, ఆక్సెసరీస్ & ఇతర ఖర్చులు కలుపుకుని, భాగ్యనగరంలో దీని ఆన్-రోడ్ ధర (Honda SP 125 on-road price) రూ. 1.16 లక్షల వరకు ఉంటుంది.
విజయవాడలో ఆన్-రోడ్ ధర ఎంత?
విజయవాడలో, హోండా SP 125 ఎక్స్-షోరూమ్ ధర రూ. 93,835. దాదాపు రూ. 12,500 TRO ఛార్జీలు, దాదాపు రూ. 7,000 ఇన్సూరెన్స్, ఆక్సెసరీస్ & ఇతర ఖర్చులు కలుపుకుని, బెజవాడలో దీని ఆన్-రోడ్ ధర రూ. 1.21 లక్షల వరకు ఉంటుంది.
హోండా SP 125 మోటార్ సైకిల్‌ను డ్రమ్ & డిస్క్ అనే రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఈ బైక్‌లో ABS (Anti-lock Braking System) సౌకర్యం కూడా ఉంది.
మీరు ఈ స్టైలిష్ బైక్‌ను కేవలం రూ. 10,000 డౌన్ పేమెంట్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు. దీని కోసం మీరు బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలి, ప్రతి నెలా EMI చెల్లించాలి.
హైదరాబాద్‌లో, హోండా SP 125 కోసం రూ. 10,000 డౌన్ పేమెంట్ తర్వాత, మీరు రూ. 1.06 లక్షలు బైక్ లోన్ తీసుకోవలసి ఉంటుంది. 9 శాతం వడ్డీ రేటుతో ఈ లోన్ పొందాని భావిస్తే, EMI ఆప్షన్స్ ఇలా ఉంటాయి:
ప్రతి నెలా రూ. 3,297 EMI చెల్లిస్తే, 4 సంవత్సరాల్లో బైక్ లోన్ మొత్తం తీరిపోతుంది.
ప్రతి నెలా రూ. 3,297 EMI కడితే, 3 సంవత్సరాల్లో రుణం మొత్తం తీర్చేయవచ్చు.
ప్రతి నెలా రూ. 3,297 EMI బ్యాంక్‌లో జమ చేస్తే, 2 సంవత్సరాల్లోనే లోన్ నుంచి బయటకు రావచ్చు.
ప్రతి నెలా రూ. 3,297 EMI కట్టగలిగితే, 1 సంవత్సరంలో లోన్ మొత్తం క్లియర్ చేయవచ్చు.
బ్యాంక్ ఇచ్చే రుణం, వసూలు చేసే వడ్డీ రేటు మీ క్రెడిట్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ, బ్యాంక్ పాలసీపై ఆధారపడి మారతాయి.
రుణం తీసుకోవడానికి అర్హతలు
మీరు హోండా SP 125 కొనడానికి బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలంటే, మొదట, మీ క్రెడిట్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ సంతృప్తికరంగా ఉండాలి. నెలకు స్థిరంగా వచ్చే జీతం/ఆదాయం ఉండాలి. ఆదాయానికి సంబంధించిన రుజువులు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉండాలి.
మైలేజీ
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న బెస్ట్ మైలేజ్ బైకుల్లో హోండా SP 125 ఒకటి. కంపెనీ డేటా ప్రకారం, ఈ హోండా బైక్ ఒక లీటరు పెట్రోల్‌తో 65 కిలోమీటర్ల వరకు నడపగలదు. మీరు ట్యాంక్ ఫుల్ చేస్తే దాదాపు 700 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.





















