అన్వేషించండి

Maruti Brezza Discount: మారుతి బ్రెజ్జా కొంటే బంపర్‌ డిస్కౌంట్‌, పరిమితకాల ఆఫర్‌ - మిడిల్‌ క్లాస్‌కు మంచి ఛాన్స్‌!

Discount On Maruti Suzuki Brezza: ఈ నెల (జులై 2025)లో మారుతి సుజుకి బ్రెజ్జా కొనేవాళ్లకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ కారు మునుపటి కంటే చవకగా మారింది.

Maruti Suzuki Brezza Price And Discount Details: మీ కుటుంబానికి స్టైలిష్, సేఫ్టీ SUVని గిఫ్ట్‌గా ఇవ్వడంతోపాటు, ఆ కారుకు ఇంధన సామర్థ్యం కూడా ఉండాలని మీరు కోరుకుంటే, మారుతి సుజుకి బ్రెజ్జా గురించి ఓసారి ఆలోచించవచ్చు. మారుతి సుజుకీ, ఈ నెల (జులై 2025)లో, ఈ SUVపై రూ. 45,000 వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది, ఇది దాని ధరను మరింత తగ్గించింది. మారుతి బ్రాండ్‌ నుంచి వచ్చిన ఈ ఫోర్‌వీలర్‌ మంచి మైలేజీని ఇవ్వడమే కాకుండా, ఫీచర్లు & భద్రత పరంగానూ బెటర్‌గా నిలిచింది. స్కార్పియో, నెక్సాన్ & పంచ్ వంటి కార్ల కంటే మెరుగ్గా ఉందని కస్టమర్లు చెబుతున్నారు.

ధర & ఆఫర్ వివరాలు 
మారుతి సుజుకి బ్రెజ్జా ఎక్స్-షోరూమ్ ధర (Maruti Brezza ex-showroom price) రూ. 8.69 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్‌కు రూ. 14.14 లక్షల వరకు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో ఈ SUV ఆన్-రోడ్ ధర (Maruti Brezza on-road price) రూ. 10.31 లక్షల నుంచి ప్రారంభమై రూ. 17.19 లక్షల మధ్య ఉంటుంది. CNG వెర్షన్ ధర రూ. 10.70 లక్షలు (ఎక్స్-షోరూమ్). 

ఈ నెలలో, ఈ SUV కొంటే మీరు రూ. 45,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ డిస్కౌంట్ వివిధ వేరియంట్‌లు & డీలర్‌షిప్‌లలో కొద్దిగా మారవచ్చు. ఈ డీల్ మధ్య తరగతి ప్రజలకు మంచి అవకాశం అవుతుంది.

మారుతి బ్రెజ్జాలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
మారుతి బ్రెజ్జాలోని గొప్ప ఫీచర్ల కారణంగా కస్టమర్లలో మంచి పేరు తెచ్చుకుంది. డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌ ఈ కారును కొనవచ్చు. 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ క్యాబిన్‌లో ఉంది, ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇస్తుంది. ఇంకా.. 6-స్పీకర్ ఆడియో సిస్టమ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్ & వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను కూడా మారుతి అందించింది. ఈ SUVలో రియర్‌ AC వెంట్స్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, ఫాస్ట్-ఛార్జింగ్ USB పోర్ట్స్‌, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ & కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

మారుతి బ్రెజ్జా భద్రత పరంగా కూడా చాలా బలమైన ఎంపిక. ఆరు ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీల కెమెరా, ఆటో-డిమ్మింగ్ IRVM, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్ & ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్‌ వంటి అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో ఈ కారు సేఫ్టీ ఫీచర్‌-రిచ్‌గా ఉంటుంది. వీటితో పాటు, EBDతో కూడిన ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్, హై-స్పీడ్ వార్నింగ్ సిస్టమ్ & ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్ వంటి భద్రతలు కూడా ఇందులో ఉన్నాయి. 

ఇంజిన్ & పనితీరు
మారుతి బ్రెజ్జా 1.5-లీటర్ K-సిరీస్ డ్యూయల్-జెట్ పెట్రోల్ ఇంజిన్‌తో పవర్‌ పొందుతుంది, ఇది 101.6 bhp శక్తిని & 136.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ & 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలు ఉన్నాయి. అదే ఇంజిన్ CNG వేరియంట్‌లో కూడా ఉంటుంది, దానిలోని పవర్ అవుట్‌పుట్ 86.6 bhp & 121.5 Nm వరకు ఉంటుంది.

ఈ SUVలో స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ, రీజెనరేటివ్ బ్రేకింగ్ & ఇంజిన్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్ వంటి సాంకేతికతలు అమర్చారు, ఇది కారు ఇంధన సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి.

మారుతి బ్రెజ్జా, తన విభాగంలో అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన SUV లలో ఒకటి. కంపెనీ డేటా ప్రకారం... దీని పెట్రోల్ మాన్యువల్ వెర్షన్ 19.89 నుంచి 20.15 kmpl మైలేజీని ఇస్తుంది, పెట్రోల్ ఆటోమేటిక్ వెర్షన్ 19.80 kmpl మైలేజీని ఇస్తుంది & CNG వెర్షన్ 25.51 km/kg వరకు మైలేజీని ఇవ్వగలదు. 

టాప్ హెడ్ లైన్స్

BMW X1 LWB Petrol Review: BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
Ferrari First EV:ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. కొత్త గ్రీన్‌ కలర్‌తో అదిరిపోయే లుక్‌! ధర ఎంతో తెలుసా?
ఆర్మీ స్ఫూర్తితో RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. ఎంత బాగుందో!
కియా సిరోస్‌ EVకి అదిరిపోయే డిమాండ్‌.. 650కి పైగా బుకింగ్స్‌, ఒక్కరోజులోనే 150 డెలివరీలు
ఈ EV డిమాండ్‌ మామూలుగా లేదుగా! ఒక్కరోజులో 150.. ఇది నేషనల్‌ రికార్డ్‌

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Embed widget