Car Loan: మిడిల్-క్లాస్ కస్టమర్లకు బెస్ట్ ఆప్షన్ - Toyota Taisor కొనడానికి బ్యాంక్ ఎంత లోన్ ఇస్తుంది, ఎంత EMI చెల్లించాలి?
Toyota Taisor Finance Plan: టయోటా టైజర్ కొనడానికి బ్యాంక్ మీకు కార్ లోన్ ఇస్తుంది. ఆ రుణంపై కొంత వడ్డీని వసూలు చేస్తుంది. ఈ లోన్ చెల్లించడానికి ఈజీ EMI ఆప్షన్స్ కూడా ఉన్నాయి.

Toyota Taisor Price, Down Payment, Loan and EMI Details: టయోటా ఫ్యాక్టరీలో తయారైన స్టైలిష్ కాంపాక్ట్ SUV టైసర్‌ను ఇంటికి తీసుకురావాలని ప్లాన్ చేస్తుంటే, మీరు ఏమాత్రం తగ్గొద్దు. మీ దగ్గర ఉన్న తక్కువ మొత్తాన్నే డౌన్‌పేమెంట్ చేసి, ఈ మోడర్న్ కారుకు మీరు ఓనర్ కావచ్చు. రేటు కూడా మీకు అందుబాటులోనే ఉంటుంది. టయోటా టైసర్ బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర (Toyota Taisor ex-showroom price) రూ. 7.77 లక్షలు.
తెలుగు రాష్ట్రాల్లో ఆన్-రోడ్ ధర
ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో మీరు టయోటా టైజర్ కొనాలంటే, దాని ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 9.33 లక్షలు. ఈ ధరలో ఎక్స్-షోరూమ్ ధర, దాదాపు 1.14 లక్షల రిజిస్ట్రేషన్ ఫీజ్, దాదాపు రూ. 41,000 బీమా, ఇతర ఖర్చులు కలిసి ఉంటాయి.
మీ దగ్గర రూ. 2 లక్షల ఉన్నా చాలు, ఆ డబ్బు తీసుకుని టయోటా షోరూమ్‌కు వెళ్లండి. రూ. 2 లక్షలు డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన రూ. 7.33 లక్షలను కార్ లోన్ రూపంలో బ్యాంక్ ఇస్తుంది. ఈ లోన్ మీద బ్యాంక్ 9 శాతం వడ్డీ రేటు నిర్ణయించిందని అనుకుందాం. ఇప్పుడు, EMI లెక్క చూద్దాం.
7 సంవత్సరాల కోసం కార్ లోన్ తీసుకుంటే, నెలకు రూ. 11,793 EMI చెల్లించాలి. ఈ కాలంలో, మొత్తం రూ. 2.57 లక్షల వడ్డీ చెల్లిస్తారు, ఇది మీ కారు మొత్తం ధరను దాదాపు రూ. 9.90 లక్షలకు తీసుకువెళ్తుంది.
6 సంవత్సరాల్లో రుణం పూర్తిగా చెల్లించాలనుకుంటే, నెలకు రూ. 13,213 EMI చెల్లించాలి. ఈ ఆరేళ్లలో మొత్తం రూ. 2.18 లక్షల వడ్డీ చెల్లిస్తారు, కారు మొత్తం ధర రూ. 9.51 అవుతుంది.
5 సంవత్సరాల లోన్ టెన్యూర్ ఎంచుకుంటే, నెలకు రూ. 15,216 EMI చెల్లించాలి. ఐదేళ్లలో మొత్తం రూ. 1.78 లక్షల వడ్డీ చెల్లిస్తారు, మీ కారు మొత్తం ధరను రూ. 9.13 అవుతుంది.
4 సంవత్సరాల రుణ కాలపరిమితి ఎంచుకుంటే, నెలకు రూ. 18,241 EMI చెల్లించాలి. ఈ కాలంలో, మొత్తం రూ. 1.42 లక్షల వడ్డీ చెల్లిస్తారు, మీ కారు మొత్తం ధరను రూ. 8.75 లక్షలుగా లెక్క తేలుతుంది.
మీరు, రుణ కాలపరిమితిని తగ్గించుకుంటూ వస్తే, లోన్ EMI పెరిగినప్పటికీ, బ్యాంక్‌కు చెల్లించే మొత్తం వడ్డీ తగ్గుతుంది. మీరు ఎంత ఎక్కువ డౌన్‌పేమెంట్ చేయగలిగితే, వడ్డీ మొత్తం అంత తగ్గుతుంది.
కార్ లోన్ మొత్తం, వడ్డీ రేటు మీ క్రెడిట్ స్కోర్, బ్యాంక్ పాలసీపై ఆధారపడి ఉంటాయి.
టయోటా టైజర్ డిజైన్
టయోటా టైసర్‌ను మారుతి ఫ్రాంక్స్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు, అయితే దాని లుక్ & డిజైన్ పూర్తిగా టయోటా బ్రాండ్‌ను గుర్తు చేస్తాయి. ఈ SUV కొత్త హనీకోంబ్ మెష్ ఫ్రంట్ గ్రిల్, ట్విన్ LED DRLs, షార్ప్ LED టెయిల్‌లైట్లు & స్పోర్టీ బంపర్‌తో స్టైలిష్‌గా కనిపిస్తోంది. ఇవన్నీ ఈ కారుకు యూత్‌ఫుల్ & ఫ్యామిలీ-ఫ్రెండ్లీ అప్పీల్ ఇస్తున్నాయి. టయోటా లోగో ముందు భాగంలో ఠీవిగా కనిపిస్తుంది, ప్రీమియం అట్రాక్షన్‌ను మరింత పెంచుతుంది.
టయోటా టైసర్ క్యాబిన్
టయోటా టైసర్ క్యాబిన్ ప్రీమియంగా అనిపించడమే కాదు, ఈ విభాగంలో అడ్వాన్స్‌డ్ & స్మార్ట్ ఫీచర్లను కూడా కలిగి ఉంది. ఈ SUVలో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ట్విన్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ & మధ్యలో MID యూనిట్ ఉన్నాయి, ఇది కీలకమైన డ్రైవింగ్ సంబంధిత సమాచారాన్ని ప్రదర్శిస్తుంది.
ఇంకా.. హెడ్-అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్ & 360-డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి, ఇవి రైడింగ్‌ను మరింత సురక్షితంగా & సౌకర్యవంతంగా చేస్తాయి. టైసర్‌లో వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో సౌకర్యం కూడా ఉంది, మీ స్మార్ట్‌ఫోన్‌ను ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా.. ఈ కారులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, LED హెడ్‌ల్యాంప్‌లు & DRLs వంటి అధునాతన ఫీచర్లు కూడా ఉన్నాయి, ఇవి దీనిని పరిపూర్ణ కుటుంబ SUVగా నిలబెడతాయి.
ఇంజిన్ ఎంపికలు & మైలేజ్
టయోటా టైసర్‌ను రెండు పెట్రోల్ ఇంజిన్ ఎంపికలలో లభిస్తుంది. మొదటిది - 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, ఇది గొప్ప మైలేజ్ & మృదువైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. రెండోది- 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, ఇది ఎక్కువ శక్తి & బలమైన పనితీరుకు సరిపోతుంది. కంపెనీ, ఈ రెండు ఇంజిన్ వేరియంట్లలోనూ మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ అందిస్తోంది.
తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజీని కోరుకునే వారి కోసం, టయోటా టైసర్ CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. CNG వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.76 లక్షల నుంచి ప్రారంభమై రూ. 13.06 లక్షల వరకు ఉంటుంది.





















