అన్వేషించండి

Ford Bronco EV: బ్యాటరీ అయిపోతే పెట్రోల్ ఇంజిన్‌తో ఛార్జ్‌ చేసుకోగల కారు - హైబ్రిడ్ టెక్నాలజీతో ఫోర్డ్ EV లాంచ్‌

Ford Bronco EV: ఫోర్డ్ తన బ్రోంకో SUVలో కొత్తగా ఎలక్ట్రిక్ వెర్షన్‌ వచ్చింది. అవసరమైతే ఈ కారు బ్యాటరీని పెట్రోల్ ఇంజిన్ నుంచి ఛార్జ్ చేయవచ్చు. పవర్‌ఫుల్‌ ఫీచర్లు ఈ కారు సొంతం.

Ford Bronco EV Price, Range And Features In Telugu: ఫోర్డ్, తన ఐకానిక్ SUV Bronco లో కొత్త ఎలక్ట్రిక్ వెర్షన్‌ లాంచ్‌ చేసింది. దీనికి ఫోర్డ్ బ్రోంకో న్యూ ఎనర్జీ (Ford Bronco New Energy) అని పేరు పెట్టింది. ఈ SUV రెండు వెర్షన్లలో వస్తుంది (ఒకటి పూర్తిగా ఎలక్ట్రిక్ & మరొకటి పెట్రోల్-చార్జ్‌డ్‌ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెర్షన్). ప్రస్తుతం ఇది చైనాలోనే లభిస్తున్నప్పటికీ, దాని ప్రత్యేక సాంకేతికత కారణంగా ప్రపంచవ్యాప్తంగా EV మార్కెట్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

EV వెర్షన్ ఎలా ఉంది? 
ఫోర్డ్ బ్రోంకో న్యూ ఎనర్జీ EV వెర్షన్ డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వచ్చింది. ఈ SUVలో ముందు మోటార్ 177 hp పవర్‌ & వెనుక మోటార్ 275 hp పవర్‌ ఇస్తుంది. అంటే, మొత్తం పవర్ 311 hp. దీని గరిష్ట వేగం గంటకు 170 కిలోమీటర్లు.

ఫోర్డ్ బ్రోంకో న్యూ ఎనర్జీ SUV... BYDలో కనిపించే 105.4 kWh LFP బ్యాటరీతో పవర్‌ తీసుకుంటుంది. ఈ బ్యాటరీని ఫుల్లుగా ఛార్జ్ చేస్తే 650 కి.మీ. వరకు డ్రైవింగ్‌ రేంజ్‌ (CLTC సైకిల్ ప్రకారం) ఇస్తుంది. ఈ కారులో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లకు అస్సలు కొదవవేదు. ADAS సిస్టమ్ & LiDAR యూనిట్ వంటి అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లను ఫోర్డ్ బ్రోంకో EVలో పొందుపరిచారు.

పెట్రోల్‌తో నడిచే ఎలక్ట్రిక్ SUV
పెట్రోల్-చార్జ్‌డ్‌ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెర్షన్, SUV ముందు మోటార్ 177 hp పవర్‌ & వెనుక మోటార్ 24 5hp పవర్‌ ఇస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఈ వెర్షన్‌ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ ఉంది. ఆసక్తిరకరంగా, ఈ ఇంజిన్‌ వాహనాన్ని నేరుగా నడపదు, బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. అంటే, కార్‌ రన్నింగ్‌లో ఉన్నప్పుడే బ్యాటరీ ఛార్జ్‌ అవుతుంది, ప్రత్యేకంగా ఇంట్లో లేదా ఛార్జింగ్‌ స్టేషన్‌లో ఛార్జ్‌ చేయాల్సిన అవసరం ఉండదు.

పెట్రోల్-చార్జ్‌డ్‌ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెర్షన్‌లో ఇచ్చిన బ్యాటరీ సైజ్‌ 43.7 kWh & ఇది ఎలక్ట్రిక్ మోడ్‌లోనే 220 కి.మీ. వరకు ప్రయాణించగలదు. దీని పెట్రోల్ & బ్యాటరీ మొత్తం డ్రైవింగ్‌ రేంజ్‌ దాదాపు 1,220 కి.మీ. ఇది లాంగ్ డ్రైవ్‌లకు సూపర్‌గా పనికొస్తుంది. ఈ SUV మొత్తం బరువు 2,510 కి.గ్రా.

ఈ SUV ఎవరి కోసం?
ఫోర్డ్ బ్రోంకో న్యూ ఎనర్జీ SUV ఒక విప్లవాత్మక సాంకేతికత కలిగిన EV. బ్యాటరీ రేంజ్‌ వల్ల టెన్షన్‌ & నిరుత్సాహపడే వారికి ఒక గొప్ప ఆఫర్‌. ఈ బండి బలమైన శక్తి, లాంగ్ రేంజ్ & అధునాతన సాంకేతికత దీనిని మార్కెట్లో EV ట్రెండ్‌సెట్టర్‌గా మార్చగలవు.

భారతదేశంలో ఎప్పుడు లాంచ్‌ అవుతుంది?
ఈ SUV ని ఫోర్డ్ & జియాంగ్లింగ్ మోటార్స్ భాగస్వామ్యంతో మొదట చైనాలో విడుదల చేశారు. కొంతకాలం తరువాత ఇది అంతర్జాతీయ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం, భారతదేశంలో ఫోర్డ్ SUV అమ్మకం లేదు. కానీ, ఈ కంపెనీ, Everest SUV ని భారత్‌లో తిరిగి లాంచ్‌ చేయాలనుకుంటోంది. Ford Endeavour పేరిట రావచ్చు. ఫోర్డ్, Ford Endeavour లాంచ్‌ను అధికారికంగా ధృవీకరించనప్పటికీ, 2025 చివరిలో లేదా 2026 ప్రారంభంలో దానిని తీసుకువచ్చే బలమైన సూచనలు కనిపిస్తున్నాయి. ఈ SUV ఒక ప్రీమియం ఆఫర్‌ & టయోటా ఫార్చ్యూనర్‌తో పోటీ పడే అవకాశం ఉంది.

మారుతి సుజుకి కూడా భారతదేశంలో EREV టెక్నాలజీపై పనిచేస్తోంది. రాబోయే కాలంలో, ఈ టెక్నాలజీని బడ్జెట్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ కార్లలో చూసే అవకాశం ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Renault Triber 7-సీటర్‌ ఫ్యామిలీ కారు.. రూ.1.16 లక్షల డౌన్‌పేమెంట్‌ చాలు, మిగిలింది EMIల్లో చూసుకోవచ్చు
ఏడు సీట్ల కారు ఇంత చౌకగానా? నెలకు కేవలం రూ.8,300 కడితే Renault Triber మీ సొంతం!
Renault Triber కొనేవాళ్ల అసలు ఛాయిస్ ఇదే.. ఈ వేరియంట్‌లో ఫీచర్లు & పవర్ రెండూ పక్కా!
రెనాల్ట్‌ ట్రైబర్‌లో ఏ వేరియంట్ కొనాలి? రూ.8.53 లక్షలకే టర్బో ఇంజిన్‌తో అదిరిపోయే ప్యాకేజీ!
2026 Bajaj Pulsar NS125 కొత్త అవతార్.. ఇక LCD డిస్‌ప్లేతో పాటు మరిన్ని ఫీచర్లు!
లాంచ్‌కు ముందే లీకైన 2026 పల్సర్ NS125 ఫొటోలు.. కొత్త రంగులు, కలర్ డిస్‌ప్లే!
First-Time Car Insurance: మీ కార్ ఇన్సూరెన్స్‌లో ఇవి ఉన్నాయా? పాలసీ తీసుకునే ముందు ఈ చెక్‌లిస్ట్ చూడండి
మొదటిసారి కార్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
Union Cabinet Decisions: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత పూర్తి వివరాలు
Vijayasai Reddy About YSRCP: ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Rajinikanth : ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఇస్లాంలో మతం మార్చడానికి కల్మాను ఉపయోగిస్తారు, మరి హిందూమతం సంగతేంటి?
ఇస్లాంలో మతం మార్చడానికి కల్మాను ఉపయోగిస్తారు, మరి హిందూమతం సంగతేంటి?
Vijayasai Reddy: ఏపీని కమ్మ, క్రిస్టియన్లు పాలిస్తున్నారు.. మేం గెలిస్తే ఆ కులాలకే సీఎం పదవి: విజయసాయిరెడ్ది
ఏపీని కమ్మ, క్రిస్టియన్లు పాలిస్తున్నారు.. మేం గెలిస్తే ఆ కులాలకే సీఎం పదవి: విజయసాయిరెడ్ది
Boyapati Srinu: బోయపాటి శ్రీను పెద్దబ్బాయ్, అమ్మాయి బర్త్ డే... ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
బోయపాటి శ్రీను పెద్దబ్బాయ్, అమ్మాయి బర్త్ డే... ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
October Rule Changes: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
Embed widget