అన్వేషించండి

Honda Elevate: 100 రోజుల్లోపే 20 వేల కార్లు సోల్డ్ అవుట్ - ‘ఎలివేట్’ సూపర్ రికార్డు!

Honda Elevate Sales Record: హోండా ఎలివేట్ కారు లాంచ్ అయిన 100 రోజుల్లోనే 20 వేల యూనిట్లు అమ్ముడుపోయాయి.

Honda Elevate Sales: హోండా కార్స్ ఇండియా మనదేశంలో ఎలివేట్ కారుతో కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఈ కారు లాంచ్ అయిన 100 రోజుల్లోనే 20 వేల యూనిట్లకు పైగా అమ్ముడుపోయింది. ఇందులో విశేషం ఏంటంటే... కంపెనీ మొత్తం సేల్స్‌లో 50 శాతానికి పైగా ఎలివేట్ కార్లే ఉండటం విశేషం.

లాంచ్ అయిననాటి నుంచి హోండా ఎలివేట్ స్ట్రాంగ్ సేల్స్ నంబర్‌ను నమోదు చేసింది. సెప్టెంబర్‌లో 5,685, అక్టోబర్‌లో 4,957, నవంబర్‌లో 4,755 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఎస్వీ, వీ, వీఎక్స్, జెడ్ఎక్స్ ట్రిమ్‌ల్లో ఈ కారు లాంచ్ అయింది. దీని ఎక్స్ షోరూం ధర రూ.11 లక్షల నుంచి రూ.16 లక్షల మధ్య ఉంది.

ఏడు మోనోటోన్ కలర్ ఆప్షన్లలో ఎలివేట్ అందుబాటులో ఉంది. ఫీనిక్స్ ఆరెంజ్ పెర్ల్, మెటోరాయిడ్ గ్రే మెటాలిక్, రేడియంట్ రెడ్ మెటాలిక్, అబ్సిడియన్ బ్లూ పెర్ల్, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్, లూనార్ సిల్వర్ మెటాలిక్ కలర్స్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ రూఫ్‌తో రేడియంట్ రెడ్ మెటాలిక్, క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ రూఫ్‌తో ప్లాటినం వైట్ పెర్ల్, క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ రూఫ్‌తో ఫీనిక్స్ ఆరెంజ్ పెర్ల్‌... డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

హోండా ఎలివేట్‌లో ఎంట్రీ లెవల్ ఎస్వీ వేరియంట్‌లో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ టైల్‌లైట్లు, 16 అంగుళాల వీల్ కవర్లు, ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, సౌకర్యవంతమైన ఫాబ్రిక్ అప్‌హోల్స్టరీ, పీఎం2.5 ఎయిర్ ఫిల్ట్రేషన్ సహా అన్ని బేసిక్ ఫీచర్లను ఉండనున్నాయి. కారు వెనుక వైపు పార్కింగ్ సెన్సార్లు, 60:40 ఫోల్డబుల్ రియర్ సీట్లు అందించారు. ఇది డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ స్టార్ట్ అసిస్ట్‌తో సహా అనేక ఇతర సెక్యూరిటీ ఫీచర్లను కూడా ప్రామాణికంగా కలిగి ఉంది.

ఇక వీ ట్రిమ్‌లో వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీకి సపోర్ట్ చేసే 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో సహా కొన్ని అదనపు ఫీచర్లను పొందుతుంది. అలాగే ఇందులో 4 స్పీకర్ సౌండ్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, రివర్సింగ్ కెమెరా సౌకర్యం, ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.

ప్రీమియం టచ్‌ కోరుకునే వారు ఇందులో వీఎక్స్ ట్రిమ్‌ను ఎంచుకోవడం బెస్ట్. ఇందులో ఎల్ఈడీ ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, 17 అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్‌లు, ఏడు అంగుళాల సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, లేన్‌వాచ్ కెమెరా వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఆటో ఫోల్డింగ్ అవుట్‌సైడ్ రియర్‌వ్యూ మిర్రర్, ప్రీమియం 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ ఫీచర్లను కూడా అందించారు.

టాప్ ఎండ్ వేరియంట్ అయిన జెడ్ఎక్స్ ట్రిమ్‌లో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, విలాసవంతమైన లెథరెట్ అప్‌హోల్స్టరీ, 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆటో డిమ్మింగ్ ఇంటీరియర్ రియర్‌వ్యూ మిర్రర్, ఆకర్షణీయమైన క్రోమ్ డోర్ హ్యాండిల్‌ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RR vs KKR Match abandoned: వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
Harish Rao: బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
Devara Fear Song: 'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
Market Holiday: సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Anantapur New SP Gowthami Sali | అనంతపురం కొత్త ఎస్పీ ప్రెస్‌మీట్ | ABP DesamHusband Accused His Wife For Threatening | భార్య వేధింపులపై భర్త సెల్ఫీ వీడియో | ABP DesamWife Beats Her Husband: Viral Video | భార్య కొడుతోందని..రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించిన భర్తSRH vs PBKS Match Fans Reactions | పంజాబ్ తో మ్యాచ్... ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ సందడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RR vs KKR Match abandoned: వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
Harish Rao: బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
Devara Fear Song: 'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
Market Holiday: సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీకీ ఈసీ గ్రీన్ సిగ్నల్ - ఈ అంశాలపై షరతులు
తెలంగాణ కేబినెట్ భేటీకీ ఈసీ గ్రీన్ సిగ్నల్ - ఈ అంశాలపై షరతులు
Pavithra Jayaram: నటి పవిత్ర జయరామ్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన చందు భార్య శిల్ప
నటి పవిత్ర జయరామ్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన చందు భార్య శిల్ప
IPL 2024:  అదే ఊచకోత, భారీ లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్
అదే ఊచకోత, భారీ లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్
Rains In Telangana: తెలంగాణలో విషాదం- ఒకే మండలంలో రెండు పిడుగులు, ముగ్గురు మృతి
తెలంగాణలో విషాదం- ఒకే మండలంలో రెండు పిడుగులు, ముగ్గురు మృతి
Embed widget