అన్వేషించండి

Hero Vida VX2 Go Price:ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు! 50 వేలకే వస్తున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ హీరో విడా!

Hero Vida VX2 Go Price:మంచి రేంజ్ ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం భారత్ వినియోగదారులు ఎదురు చూస్తున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే హీరోలా వచ్చింది విడా VX2 గో. పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హీరో విడా VX2 గో ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ ధరకే విడుదల.
  • బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ పద్ధతితో ప్రారంభ ధర గణనీయంగా తగ్గింది.
  • ఒకసారి ఛార్జ్‌తో 92-100 కి.మీ. ప్రయాణం, గరిష్ట వేగం 70.
  • స్మార్ట్‌ స్క్రీన్, బ్లూటూత్, జియో ఫెన్సింగ్ వంటి అత్యాధునిక ఫీచర్లు.

Hero Vida VX2 Go Price:పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యుడి జేబుకు చిల్లుపెడుతున్న వేళ ఎలక్ట్రిక్ వాహనాలు ఒక మంచి ఆప్షన్‌గా కనిపిస్తున్నాయి. అయితే ఇవి కొనాలంటే భారీ ధర చెల్లించాల్సి వచ్చేది. మార్కెట్‌లో ఉన్న గ్యాప్‌ను గమనించిన హీరో కంపెనీ సరికొత్త వ్యూహంతో విడా VX2 గో విడుదల చేసింది. తక్కువ ధరకే అందుబాటులోకి వస్తున్న ఈ స్కూటర్ ఫీచర్స్, ఇతర విషయాలు గురించి ఇక్కడ చూద్దాం. 

బాస్‌ మోడల్‌తో వస్తున్న హీరో విడా VX2 గో

సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలో 40 నుంచి 50 శాతం కేవలం బ్యాటరీ ఖర్చే ఉంటుంది. దీని వల్ల మధ్యతరగతి ప్రజలు ఇవి కొనడానికి వెనకాడుతున్నారు. ఈ అడ్డంకిని తొలగించడానికి హీరో సంస్థ బ్యాటరీ యాజ్‌‌ ఏ సర్వీస్‌ అనే వినూత్న విధానాన్ని తీసుకొచ్చింది. ఈ పద్ధతిలో మీరు స్కూటర్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేసి బ్యాటరీ వినియోగానికి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా నెలకు కొంత మొత్తాన్ని చెల్లించవచ్చు. దీని వల్ల స్కూటర్ ప్రారంభ ధర గణనీయంగా తగ్గింది. 

Hero Vida VX2 Go Price:ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు! 50 వేలకే వస్తున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ హీరో విడా!

Read Also: Honda City Facelift vs Hyundai Verna Facelift: హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ - మిడ్‌సైజ్ సెడాన్ కార్ల ఫీచర్లు, ఇంజన్ ఆప్షన్లు, ప్రైస్ కంపారిజ‌న్ 

విడా VX2 గో ధర 45 వేల నుంచి ప్రారంభం

విడా VX2 గో స్కూటర్ ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర 44,990 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో టాప్ వేరియంట్‌ ధర 59,490 రూపాయలుగా ఉంది. ప్రస్తుత మార్కెట్‌లోని హై ఎండ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లతో పోలిస్తే ఇది అత్యంత సరసమైన ఎంపికగా నిలుస్తోంది. 

Hero Vida VX2 Go Price:ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు! 50 వేలకే వస్తున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ హీరో విడా!

Read Also: India Steps Up Towards E100 Fuel Adoption: ఇండియాలో ఈ100 ఇంధన విప్లవం - క్లీనర్ మొబిలిటీ దిశగా అడుగులు.. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు కొత్త బూస్ట్

ఒకసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు 

ఈ స్కూటర్‌ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రెండు రకాల బ్యాటరీ సెటప్‌లతో లభిస్తుంది. 2.2kWh, 3.4kWh ఆప్షన్లు ఉన్నాయి. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 92 నుంచి వంద కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. గంటలకు గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో నడపచ్చు. ఇది నగరాల్లో ప్రయాణించడానికి సరిగా సరిపోతుంది. 

Hero Vida VX2 Go Price:ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు! 50 వేలకే వస్తున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ హీరో విడా!

జియో ఫెన్సింగ్‌ సౌకర్యం

తక్కువ ధరకే వస్తున్నప్పటికీ ఫీచర్ల విషయంలో హీరో ఎక్కడా రాజీ పడలేదు. ఇందులో అత్యాధునిక టెక్నాలజీని జోడించింది. 4.3 అంగుళాల స్మార్ట్ ఎల్‌సీడీ స్క్రీన్ ఉంది. బ్లూటూత్‌ ద్వారా మీ స్మార్ట్ ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా నావిగేషన్, బ్యాటరీ లెక్కలు స్క్రీన్‌పై చూసుకోవచ్చు. వాహనం చోరీకి గురికాకుండా యాంటీ థెఫ్ట్‌ ట్రాకింగ్‌, ఒక నిర్ణీత పరిధి దాటి వెళ్తే అలర్ట్ చేసే జియో ఫెన్సింగ్‌ వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. 

Hero Vida VX2 Go Price:ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు! 50 వేలకే వస్తున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ హీరో విడా!

ఈ స్కూటర్‌ నిర్వహణ చాలా సులభం, అత్యంత చౌకైంది. ఇందులో బ్యాటరీ సులభంగా బయటకు తీసి, ఇంట్లోని సాధారణ ప్లగ్‌ పాయింట్ వద్ద ఛార్జ్ చేసుకోవచ్చు. పెట్రోల్‌ స్కూటర్లతో పోలిస్తే దీని రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ. ఒక కిలోమీటరు ప్రయాణానికి కేవలం రూ. 0.90 నుంచి 1.47 మాత్రమే ఖర్చు అవుతుంది. 

Hero Vida VX2 Go Price:ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు! 50 వేలకే వస్తున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ హీరో విడా!

భారత్‌లో ఎలక్ట్రిక్ విప్లవం వేగంగా పుంజుకుంటోంది. గాలి కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు, సామాన్యుడి ప్రయాణ ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా హీరో విడా VX2 గోను మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. మధ్యతరగతి కుటుంబాలకు, విద్యార్థులకు, నగరాల్లో రోజువారీ ప్రయాణాలు చేసే వారికి ఇది ఒక అద్భుతమైన వరంగా కంపెనీ చెబుతోంది.   

Hero Vida VX2 Go Price:ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు! 50 వేలకే వస్తున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ హీరో విడా!

Frequently Asked Questions

హీరో విడా VX2 గో స్కూటర్ ధర ఎంత?

ఈ స్కూటర్ ధర 45 వేల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ ధర 59,490 రూపాయలు.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం వెళ్తుంది?

ఈ స్కూటర్ 2.2kWh, 3.4kWh బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 92 నుంచి 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

విడా VX2 గోలో ఎలాంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి?

ఈ స్కూటర్ లో యాంటీ థెఫ్ట్ ట్రాకింగ్, జియో ఫెన్సింగ్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇవి దొంగతనం జరగకుండా, నిర్ణీత పరిధి దాటి వెళ్తే అలర్ట్ చేస్తాయి.

ఈ స్కూటర్ నిర్వహణ ఖర్చు ఎంత?

పెట్రోల్ స్కూటర్లతో పోలిస్తే దీని రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ. ఒక కిలోమీటర్ ప్రయాణానికి కేవలం రూ. 0.90 నుంచి 1.47 మాత్రమే ఖర్చు అవుతుంది.

టాప్ హెడ్ లైన్స్

కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
AP Cabinet Decisions: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత..! ఏ క్షణమైనా నోటిఫికేషన్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత..! ఏ క్షణమైనా నోటిఫికేషన్
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
Alias Rukmini Heroine: 'అలియాస్ రుక్మిణి'లో హీరోయిన్ ఈ అమ్మాయే... నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆఫియా సయ్యద్
'అలియాస్ రుక్మిణి'లో హీరోయిన్ ఈ అమ్మాయే... నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆఫియా సయ్యద్
Hyderabad Crime News: చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
Embed widget