అన్వేషించండి

Hero Vida Electric Scooter: కొనాలని ఉందా? హీరో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చేది రేపే!

హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలకు రెడీ అయ్యింది. తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రేపు(అక్టోబర్ 7న) విడా బ్రాండ్ పేరుతో రిలీజ్ చేయనుంది. ఈ స్కూటర్ ధర సుమారు రూ. 1 లక్ష ఉంటుందని అంచనా.

మార్కెట్ లో రోజు రోజుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో.. వాహన తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే పలు టూ వీలర్ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకురాగా.. తాజాగా ఈ విభాగంలోకి అడుగు పెడుతున్నది హీరో మోటోకార్ప్.  ఈ కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని రేపు(అక్టోబర్ 7న) విడుదల చేయనుంది. హీరో కంపెనీ తన సబ్ బ్రాండ్ అయిన విడా నుంచి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాబోతుంది. 

గతేడాది ఆగస్టులో ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రదర్శన

హీరో మోటోకార్ప్ గత ఏడాది ఆగస్టులో టీజర్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రదర్శించింది. ఈ ఎలక్ట్రిక్ వాహనం మాస్ మార్కెట్‌ ను  భర్తీ చేసే అవకాశం ఉంది. బ్రాండ్ తో పాటు ధరను దాని సామాన్యులకు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ భద్రత, రేంజ్‌పై స్పెషల్ ఫోక్ పెడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న ఇ-స్కూటర్లతో పోల్చితే అన్ని అంశాల్లో ఈ ద్విచక్ర వాహనం మెరుగైన లక్షణాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది.  

ధర రూ.1 లక్ష ఉండే అవకాశం!

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ చమత్కారమైన  బాడీ వర్క్‌తో బాక్సీగా కనిపించనుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన ఇతర వివరాలతో పాటు స్పెసిఫికేషన్లను కంపెనీ బయటకు వెల్లడించలేదు. ఈ స్కూటర్ చక్కటి బ్యాటరీ ప్యాక్ తో రాబోతున్నట్లు తెలుస్తోంద. మంచి పరిధిని కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇక హీరో విడా స్కూటర్ ధర విషయానికి వస్తే.. దాదాపు రూ. 1 లక్ష ఉండనున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ధరతో మాస్ మార్కెట్ ఉత్పత్తిగా ప్లేస్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.  హీరో కంపెనీకి ఉన్న భారీ డీలర్ నెట్‌వర్క్.. ఈ స్కూటర్ కు కలిసి వచ్చే అవకాశం ఉంది. కస్టమర్ల స్పందనతో పాటు అభిప్రాయాలను తెలుసుకునేందుకు  ఎలక్ట్రిక్ స్కూటర్ ను తొలుత పరిమిత నగరాల్లో అందుబాటులో ఉంచనుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ TVS iQube, Bajaj Chetak, ఏథర్ 450X, Ola S1 వంటి టూవీలర్స్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

భారత్ పెట్రోలియంతో జతకట్టిన హీరో మోటోకార్ప్  

హీరో కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు దేశ వ్యాప్తంగా ఫాస్ట్ ఛార్జింగ్, బ్యాటరీ మార్పిడి స్టేషన్లను ఏర్పాటు చేయబోతోంది. ఇందుకు భారత్ పెట్రోలియంతో హీరో మోటోకార్ప్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. త్వరలోనే ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణాన్ని మొదలుపెట్టబోతున్నది.

టాప్ హెడ్ లైన్స్

ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
LED vs HID Headlights: రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే.. కారు హెడ్‌లైట్లలో LED, HID మధ్య తేడాలు తెలుసుకోండి!
కారుకు LED హెడ్‌లైట్లు మంచిదా? HID హెడ్‌లైట్లు మంచిదా? వెలుతురు, ధర, క్వాలిటీలో ఏది బెస్ట్?
MG Windsor EVతో 17,500 కి.మీ. ప్రయాణం.. లాంగ్ జర్నీ సమయంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు!
MG Windsor EV రివ్యూ.. 17,500 కి.మీ. ప్రయాణించాక ఈ ఎలక్ట్రిక్ కారులో కనిపించిన ప్లస్‌లు, మైనస్‌లు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
BJP Candidates List: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
AP Elections: నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Embed widget