Top 10 Two Wheelers: యాక్టివా, పల్సర్ లను వెనక్కి నెట్టిన బైక్.. మళ్లీ నెంబర్ 1గా నిలిచిన Hero Splendor
Hero Splendor Number 1 Bike | సెప్టెంబర్ 2025లో ద్విచక్ర వాహనాల మార్కెట్ బాగా పుంజుకుంది. GST రేట్ కల్, పండుగల కొనుగోళ్లు కలిపి టూవీలర్ పరిశ్రమను ముందుకు నడిపాయి.

Top 10 Two Wheelers: భారత్‌లో ద్విచక్ర వాహనాలు (Two Wheeler) మార్కెట్ సెప్టెంబర్ 2025లో ఊపందుకుంది. పండుగల సీజన్ కొత్త మోడల్స్ విడుదల, GST 2.0 రేట్ కట్ కారణంగా అమ్మకాల గణాంకాలు కొత్త మార్క్ చేరుకున్నాయి. మొత్తం 14,62,687 యూనిట్ల అమ్మకాలతో ఈ నెలలో టీవీలర్స్ విభాగంలో 6.3 శాతం వృద్ధి నమోదైంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
రేట్ కట్ అమ్మకాలు పెంచిన GST 2.0
సెప్టెంబర్ 22 నుండి అమలులోకి వచ్చిన GST 2.0 సంస్కరణలు టూవీలర్ పరిశ్రమకు మంచి ప్రోత్సాహాన్నిచ్చాయి. ఇప్పుడు 350cc వరకు ఉన్న బైక్‌లు, స్కూటర్లపై పన్ను 28 శాతం నుంచి 18 శాతంకి తగ్గించారు. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్‌సైకిళ్లు, స్కూటర్లు ఈ కేటగిరీలోనే ఉన్నాయి. పన్ను తగ్గడంతో తక్షణమే ప్రభావం కనిపించింది. షోరూమ్‌లలో కస్టమర్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. దసరా, దీపావళి పండుగల అమ్మకాలు పుంజుకున్నాయి. Hero, హోండా, TVS, సుజుకీ, Bajaj వంటి బైక్ తయారీదారులు సెప్టెంబర్ నెలలో కొత్త అమ్మకాల రికార్డులు సృష్టించే అవకాశం లభించింది.
Hero Splendor మళ్లీ నంబర్ 1 బైక్
Hero Splendor మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 3.82 లక్షల యూనిట్లు విక్రయాలు జరగడంతో 26% మార్కెట్ వాటాను సాధించింది. హీరో మోటోకార్ప్ ఇటీవల 125 మిలియన్ యూనిట్ల అమ్మకాల మార్క్ దాటింది. ఈ సందర్భంగా కంపెనీ Splendor+, Passion+ (ప్యాషన్ ప్లస్), Vida VX2 ప్రత్యేక ఎడిషన్‌లను రిలీజ్ చేసింది. తక్కువ ధర, నమ్మదగిన మైలేజ్, తక్కువ నిర్వహణ వ్యయం Splendor ఇప్పటికీ సామాన్యుల ఫస్ట్ చాయిస్‌గా ఎంపికగా నిలిచింది.
Honda Activaకు గట్టి పోటీ
స్కూటీ విభాగంలో ఎప్పటినుంచో ఆధిపత్యం చెలాయిస్తున్న Honda Activa అమ్మకాలు ఈసారి కాస్త తగ్గాయి. ఈ లోటును TVS Jupiter, Suzuki Access 125 (సుజుకీ యాక్సెస్ 125) ఉపయోగించుకున్నాయి. ఇప్పుడు కస్టమర్లు మెరుగైన మైలేజ్, స్టైలిష్ డిజైన్, బ్లూటూత్, డిజిటల్ కన్సోల్ లాంటి ఫీచర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. TVS Jupiter సైతం విక్రయాల్లో జోరు చూపింది. తాజాగా Suzuki Access కూడా అమ్మకాల్లో 2 అంకెల వృద్ధిని నమోదు చేసింది.
పెర్ఫార్మెన్స్ బైక్ విభాగంలోనూ జోరు
యువతలో స్పోర్ట్స్, పెర్ఫార్మెన్స్ బైక్‌లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఈ విభాగంలో Bajaj Pulsar, TVS Apache (టీవీఎస్ అపాచీ) వంటి బైక్‌లు మరోసారి పట్టు సాధించాయి. Bajaj తన Pulsar సిరీస్‌లో కొత్త డిజైన్, ఫీచర్లతో యువతను ఆకర్షించింది. అయితే Apache RTR సిరీస్ తన స్పోర్టీ ఇంజిన్, మోడ్రన్ రైడింగ్ మోడ్‌ల కారణంగా ప్రజాదరణ పొందింది. అమ్మకాల గణాంకాల్లో ఇవి Splendor వంటి కమ్యూటర్ బైక్‌ల కంటే వెనుకబడి ఉన్నాయి, కానీ వృద్ధి ధోరణి సానుకూలంగా ఉంది.
పండుగల సీజన్ మార్కెట్‌కు కొత్త ఉత్సాహాన్నిచ్చింది
పండుగల సీజన్ రాకతో ద్విచక్ర వాహనాల మార్కెట్ కళకళలాడింది. బ్యాంక్ ఆఫర్‌లు, ఫైనాన్స్ స్కీమ్‌లు, డిస్కౌంట్‌లు, జీఎస్టీ తగ్గింపుల కారణంగా అక్టోబర్, నవంబర్‌లో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. అనేక కంపెనీలు రాబోయే రోజుల్లో కొత్త మోడల్‌లను విడుదల చేయడానికి, ప్రత్యేక పండుగ ఎడిషన్‌లను తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. GST రేట్ కట్, పండుగ కొనుగోళ్లు కారణంగా దేశంలో టూవీలర్స్ ఇండస్ట్రీని తిరిగి ట్రాక్‌లోకి తెచ్చిందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
సెప్టెంబర్ 2025 తో ఇండస్ట్రీకి క్లారిటీ
భారతదేశంలో సెప్టెంబర్ 2025 మైలేజ్ బైక్‌లు అయినా లేదా ప్రీమియం స్కూటర్లు అయినా, టూవీలర్స్ ప్రజాదరణ ఎప్పటికీ తగ్గదని మరోసారి నిరూపించింది. Splendor నమ్మకం, మైలేజ్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. Activa స్కూటీ, Pulsar వంటి బైక్‌లు తమతమ విభాగాల్లో పట్టును నిలుపుకున్నాయి. ఈ నెల ద్విచక్ర వాహనాల పరిశ్రమకు ఒక సంకేతంలా మారింది. బైక్‌లు, టూవీలర్స్ క్రేజ్ ఎప్పటికీ తగ్గదని, రాబోయే నెలల్లో ఇది మరింత పెరుగుతుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు.























