అన్వేషించండి

GST కోత తర్వాత Hero Passion Plus ఎంత మిగులుస్తుంది? - దీనికి ప్రత్యామ్నాయ బైక్‌లు ఏవి?

GST Reforms 2025: GST తగ్గింపు తర్వాత, హీరో ప్యాషన్ ప్లస్ బైక్ గతంలో కంటే మరింత అందుబాటులోకి వచ్చింది. ఈ బైక్‌కు బదులు కొనదగిన మరికొన్ని ప్రత్యామ్నాయ బైక్‌లు కూడా ఉన్నాయి.

Hero Passion Plus New Price After GST 2025 Cut: హీరో ప్యాషన్ ప్లస్ తెలుగు ప్రజలకే కాదు, యావత్‌ దేశానికి ఇష్టమైన & పాపులర్‌ కమ్యూటర్ బైకుల్లో ఒకటి. GST తగ్గింపు తర్వాత, ఈ టూవీలర్‌ గతంలో కంటే మరింత తక్కువ ధరకు లభిస్తోంది. GST తగ్గింపు తర్వాత, హైదరాబాద్‌లో హీరో ప్యాషన్ ప్లస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 75,481 కు & విజయవాడలో ఎక్స్-షోరూమ్ ధర రూ. 75,583 కు తగ్గింది. గతంలో, ఈ బైక్ ధర సుమారు రూ. 82,200 గా ఉండేది. అంటే, తెలుగు రాష్ట్రాల్లో ఈ బండిని కొనేవాళ్లకు ఇప్పుడు దాదాపు రూ. 6,600 మిగులుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌-రోడ్‌ ధరలు
హైదరాబాద్‌లో హీరో ప్యాషన్ ప్లస్ ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 92,700 (Hero Passion Plus New on-road price, Hyderabad) & విజయవాడలో ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 93,000 (Hero Passion Plus New on-road price, Vijayawada).

హీరో ప్యాషన్ ప్లస్ ఇంజిన్ & మైలేజ్
హీరో ప్యాషన్ ప్లస్ 97.2 సిసి, సింగిల్ -సిలిండర్, ఎయిర్-కూల్డ్, OBD 2B ఇంజిన్‌తో పని చేస్తుంది. ఈ ఇంజిన్‌ 7.91 bhp పవర్‌ & 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్‌ సైకిల్‌ 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో గంటకు గరిష్టంగా 85 km వేగాన్ని అందుకోగలదు. కంపెనీ డేటా ప్రకారం, హీరో ప్యాషన్ ప్లస్ లీటరు పెట్రోలుకు 70 km మైలేజీని (Hero Passion Plus Mileage) అందిస్తుంది. ఈ బండికి 11 లీటర్ల ఇంధన ట్యాంక్‌ ఉంది, ఈ ట్యాంక్‌ను ఫుల్ చేస్తే దాదాపు 770 km దూరం ప్రయాణించగలదు. ఆఫీస్‌ లేదా మరేదైనా పని మీద రోజూ తిరిగేవాళ్లకు ఇది చాలా మంచి సంఖ్య.

హీరో ప్యాషన్ ప్లస్, రోజువారీ ఉపయోగం కోసం చాలా ప్రాక్టికల్‌ & యూజ్‌ఫుల్‌ ఫీచర్లను కలిగి ఉంది. i3S టెక్నాలజీ, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, ఇంధన గేజ్, USB ఛార్జింగ్ పోర్ట్ & సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ వంటి లక్షణాలు దీనిలో ఉన్నాయి. రైడర్‌ & కో-రైడర్‌ భద్రత కోసం ముందు & వెనుక చక్రాలకు 130 mm డ్రమ్ బ్రేక్‌లు ఇచ్చారు, ఇవి ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ ( IBS ) తో వచ్చాయి. ఈ బ్రేకింగ్ సిస్టమ్, బైక్‌ రైడింగ్‌ను మరింత సురక్షితంగా చేస్తుంది, బ్రేక్‌ వేసినప్పుడు స్థిరత్వం ఇస్తుంది.

ఇది ఏ బైక్‌లతో పోటీ పడుతుంది?
హీరో ప్యాషన్ ప్లస్, ప్రధానంగా Honda Shine 100 వంటి 100cc బైక్‌లతో పోటీ పడుతుంది. TVS Radeon & Bajaj Platina వంటి బైక్‌లు కూడా Hero Passion Plus కు ప్రత్యామ్నాయ మోటార్‌ సైకిళ్లు. 

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget