కొత్త GSTతో Mahindra Scorpio Classic రేటు ఎంత తగ్గింది, ఇప్పుడు ఎంత ఆదా అవుతుంది?
Mahindra Scorpio Classic కొత్త GST రేట్ల తర్వాత సగటున 5.7% తగ్గింపును చూసింది. ఈ కారు కొనాలంటే ఇప్పుడు ఎంత ఖర్చు చేయాలి, మీకు ఎంత ఆదా అవుతుందో తెలుసుకుందాం.

Mahindra Scorpio Classic New Price After New GST 2025: పండుగ సీజన్‌కు ముందే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన GST తగ్గింపు బహుమతి, 22 సెప్టెంబర్ 2025 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. పర్యవసానంగా, చాలా మహీంద్రా కార్లు కూడా చౌకగా మారాయి. ఈ కంపెనీ, తన స్కార్పియో క్లాసిక్ ధరను గణనీయంగా తగ్గించింది. మార్కెట్లో, ఈ కారుకు ప్రస్తుతం పోటీ ఇస్తున్న కార్లు ఏవో కూడా తెలుసుకుందాం.
కొత్త GST రేటు అమలుతో, మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ధర సగటున 5.7 శాతం తగ్గింది. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ S11 డీజిల్ MT వేరియంట్ ధర అతి పెద్ద తగ్గింపును పొందుతోంది. ఈ వేరియంట్ ధరను కంపెనీ రూ. 1.01 లక్షల వరకు తగ్గించింది. ఇతర వేరియంట్లపైనా కస్టమర్లు రూ. 80,000 నుంచి రూ. 1 లక్ష వరకు ఆదా పొందుతున్నారు. తత్ఫలితంగా, మహీంద్రా స్కార్పియో కొనుగోలు చేయడం గతంలో కంటే 'డబ్బుకు విలువైనది'గా మారింది.
GST 2.0 మార్పులతో స్కార్పియో క్లాసిక్ ధరలు సుమారు రూ. 1,01,000 చొప్పున తగ్గాయి. మహీంద్రా అధికార వెబ్‌సైట్ ప్రకారం, స్కార్పియో క్లాసిక్ ప్రస్తుత ఎక్స్-షోరూమ్ రేట్లు ఇవి:
Mahindra Scorpio Classic S Diesel: ₹ 12,97,700 (ఎక్స్-షోరూమ్)
Mahindra Scorpio Classic S11 Diesel ( హై-ఎండ్ వెర్షన్): ₹ 16,70,499 (ఎక్స్-షోరూమ్)
ఈ ధర తగ్గింపు ద్వారా స్కార్పియో క్లాసిక్ మరింత ఆకర్షణీయమైన ఆప్షన్‌గా మారింది. ఉదాహరణకు, Classic S వెర్షన్ ఇప్పుడు రూ. 12,97,700 కి అందుబాటులో ఉంది, ఇంతకుముందు సుమారు రూ. 13,98,700 ఉంది. అదే విధంగా, Classic S11 వెర్షన్ ఇప్పుడు రూ. 16,70,499 కి అందుబాటులో ఉంది, ఇంతకు ముందు రూ. 17,71,499 గా ఉంది. ఈ రెండు వెర్షన్లపైనా కస్టమర్లు ఇప్పుడు సుమారు రూ. 1,01,000 తగ్గింపు పొందుతున్నారు. గతంలో, ఈ SUV ని కొనాలన్న ఆలోచనలో ఉన్నవాళ్లు ఇప్పుడు కొనుగోలు చేసేందుకు ముందడుగు వేస్తున్నారు.
మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఫీచర్లు
మహీంద్రా స్కార్పియో క్లాసిక్‌లో పెద్ద 9 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే & డ్యూయల్ - టోన్ బ్లాక్ థీమ్ ఉన్నాయి. ఆడియో కంట్రోల్స్, లెదర్‌తో చుట్టిన స్టీరింగ్ వీల్, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు & పార్షియల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉన్నాయి.
మహీంద్రా స్కార్పియో ఇంజిన్
మహీంద్రా స్కార్పియో క్లాసిక్ 132 hp పవర్ & 300 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేసే 2.2 లీటర్ల డీజిల్ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఈ కారుకు 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంది. ఈ మోడల్‌ను పూర్తిగా తేలికైనా అల్యూమినియం GEN-2 mHawk ఇంజిన్‌ను కలిగి ఉంది. భద్రతా లక్షణాలలో - డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ABS & స్పీడ్ అలర్ట్ ఉన్నాయి. ఇంకా... ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్ & LED DRL లతో ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లు వంటివి కూడా ఈ కారులో చూడవచ్చు. అదనంగా, ఈ కారు 460 లీటర్ల బూట్ స్పేస్ & పెద్ద 60 లీటర్ల ఇంధన ట్యాంక్‌ను అందిస్తుంది.
మహీంద్రా స్కార్పియోకు ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ప్రత్యర్థి కార్లు - టాటా సఫారీ , హారియర్ & హ్యుందాయ్ క్రెటా.




















