Apache RTR 160 vs 160 4V: ఏ బైక్ బెస్ట్? ఫీచర్లు, మైలేజ్, ధరపై ఫుల్ క్లారిటీ
TVS Apache RTR 160 ఇంజిన్, మైలేజ్, ఫీచర్లు, ABS, టూరింగ్ కెపాసిటీ, ధర వరకు అన్నీ ఈ కథనంలో తెలుసుకోండి. RTR 160 vs 160 4V పోలికతో యువతకు స్పష్టమైన క్లారిటీ ఇది.

TVS Apache RTR 160 Engine Features Price: యూత్‌కి బాగా నచ్చేలా టీవీఎస్ కంపెనీ తీసుకొచ్చిన బైక్ సిరీస్‌లో Apache RTR 160 ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దశాబ్దానికి పైగా మార్కెట్‌లో ఉన్నా, 150-160 సీసీ సెగ్మెంట్‌లో ఇంకా స్ట్రాంగ్ వాల్యూతో కొనసాగుతోంది.
TVS Apache RTR 160 గురించి యువత ఎక్కువగా అడిగే ప్రశ్నలు, వాటికి సమాధానాలు:
Apache RTR 160 vs RTR 160 4V మధ్య తేడా ఏమిటి?
Apache RTR 160లో 159.7 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్, 2 వాల్వ్స్‌తో వస్తుంది. ఇది 16 hp పవర్, 13.85 Nm టార్క్ ఇస్తుంది.
RTR 160 4V కూడా 159.7 సీసీ ఇంజిన్‌తోనే వస్తుంది. కానీ దీంట్లో ఆయిల్ కూలింగ్, 4 వాల్వ్ సెటప్ ఉంటుంది. దీంతో 17.6 hp పవర్, 14.7 Nm టార్క్ ఇస్తుంది. అదనంగా, 4Vలో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, 5-అంగుళాల TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్, USD ఫోర్క్స్ లాంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
Apache RTR 160 ఎంత మైలేజ్ ఇస్తుంది?
సిటీలో (Urban Mode) - లీటరుకు 53.1 km
హైవే మీద (Sport Mode) - లీటరుకు 46.44 km. అంటే, మైలేజ్ పరంగా ఇది టాప్ క్లాస్‌గా నిలిచే బైక్.
Apache RTR 160 లో ABS ఉందా?
అవును. టాప్-ఎండ్ వేరియంట్‌లో డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది. మిగతా వేరియంట్లలో మాత్రం సింగిల్ ఛానల్ ABS మాత్రమే ఉంది.
లాంగ్ రైడ్స్‌కు బాగుంటుందా?
Apache RTR 160 సిటీ ట్రాఫిక్‌లో, షార్ట్ ట్రిప్స్‌లో ఫాస్ట్, ఫన్ అనిపించే బైక్. కానీ దీని కాంపాక్ట్ రైడింగ్ పొజిషన్, హార్డ్ సస్పెన్షన్ కారణంగా లాంగ్ రైడ్స్, టూరింగ్‌కి అంత కంఫర్ట్ ఇవ్వదు. డైలీ కమ్యూట్‌కి (రోజువారీ తక్కువ దూరాలు తిరగడానికి) ఇది బెస్ట్.
Apache RTR 160 ధర ఎంత?
ప్రస్తుతం Apache RTR 160 లో ఐదు స్టాండర్డ్ వేరియంట్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో, ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 1.02 లక్షల నుంచి రూ. 1.21 లక్షల వరకు (Apache RTR 160 ex-showroom price, Hyderabad Vijayawada) ఉన్నాయి.
ఇటీవల, టీవీఎస్ 20వ వార్షికోత్సవ ఎడిషన్ (TVS 20th Anniversary Edition) ను కూడా లాంచ్ చేసింది. బ్లాక్ కలర్‌తో, రోజ్-గోల్డ్ హైలైట్స్, USB ఛార్జర్ ఉన్న ఈ మోడల్ ధర రూ. 1.27 లక్షలు (ఎక్స్-షోరూమ్).
TVS Apache RTR 160 యువతకు బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ స్పోర్ట్స్ బైక్‌లలో ఒకటి. శక్తిమంతమైన ఇంజిన్, మైలేజ్, సేఫ్టీ ఫీచర్లతో సిటీ రైడింగ్‌కి ఇది పర్ఫెక్ట్. లాంగ్ టూరింగ్‌కి అంత కంఫర్ట్ లేకపోయినా, రోజువారీ వాడకానికి ఇది విలువైన ఎంపిక.





















