Chepaset Bikes in India: దేశంలోనే అత్యంత చవకైన బైక్‌లు ఇవే, మైలేజీలో ఖరీదైన బైక్‌లు కూడా పనికిరావు
High Mileage Bikes: భారతీయ మార్కెట్లో లీటరుకు దాదాపు 80 కి.మీ. వరకు మైలేజీని ఇచ్చే చాలా బైకులు ఉన్నాయి. మైలేజ్‌లో మేటి బైకులు అయినప్పటికీ ధర మాత్రం చాలా తక్కువ.

Top-5 Most Affordable Bikes 2025: భారతీయ మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడయ్యేవి మంచి మైలేజీ ఉన్న బైకులే. ఎంత ఎక్కువ మైలేజీ ఇస్తే, కామన్ మ్యాన్‌కు అంత ప్రియమైన బండి. ముఖ్యంగా, పట్టణ & గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి, ఎక్కువ మైలేజీ ఇచ్చేవన్నీ తక్కువ రేటు టూవీలర్లే, సామాన్యుడికి చక్కగా అందుబాటులో ఉండేవే. ఇవి, ఖరీదైన మోటారు సైకిళ్ల కంటే దాదాపు రెట్టింపు మైలేజీ కూడా ఇవ్వగలవు, వాటి రేట్లతో పోలిస్తే దాదాపు 50% తక్కువ ధరలోనే దొరుకుతాయి.
ధర తక్కువ, మైలేజీ ఎక్కువ.. టాప్-5 బైకులు
హీరో హెచ్‌ఎఫ్ 100 (Hero HF 100)
హీరో HF 100 భారతదేశంలో అత్యంత చవకైన మోటార్ సైకిల్ & ఫ్యామిలీ బండి. ఈ బైక్ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్-సిలిండర్, OHC ఇంజిన్‌తో తయారైంది. ఈ బండి ఇంజిన్ 8,000 rpm వద్ద 5.9 kW పవర్‌ను & 6,000 rpm వద్ద 8.05 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ మోటార్ సైకిల్ లీటరు పెట్రోలుకు 70 km మైలేజీ ఇస్తుందని హీరో కంపెనీ తెలిపింది. హీరో HF 100 ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 59,018 నుంచి ప్రారంభం అవుతుంది.
టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport)
యువత మెచ్చిన టీవీఎస్ స్పోర్ట్ బైక్ 109.7 cc, సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్ ఇంజిన్‌తో దూకుడుగా ఉంటుంది. ఈ ఇంజిన్ 6,350 rpm వద్ద 6.03 కిలోవాట్ల (kW) పవర్‌ను & 4,500 rpm వద్ద 8.7 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ బైక్ గరిష్టంగా గంటకు 90 కి.మీ. వేగాన్ని అందిస్తుంది. కంపెనీ గణాంకాల ప్రకారం, టీవీఎస్ స్పోర్ట్ మైలేజ్ లీటర్‌కు 80 కి.మీ. ఈ టీవీఎస్ మోటార్ సైకిల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 59,881 నుంచి ప్రారంభం అవుతుంది.
హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe)
హీరో HF డీలక్స్ కూడా అఫర్డబుల్ & కామన్ మ్యాన్ బైక్. ఈ మోటార్ సైకిల్ 97.2 cc, సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్ ఇంజిన్‌తో పవర్ తీసుకుంటుంది. ఈ ఇంజిన్ 5.9 kW పవర్ & 8.05 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ మోటార్ సైకిల్‌లో అడ్వాన్స్‌డ్ ప్రోగ్రామింగ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ వ్యవస్థ ఉంది. ఈ హీరో బైక్‌లో లీటరు పెట్రోలు పోస్తే 75 km వరకు ఆగకుండా దూసుకెళ్లగలదు. హీరో HF డీలక్స్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 59,998 నుంచి స్టార్ట్ అవుతుంది.
హోండా షైన్ 100 (Honda Shine 100)
హోండా షైన్ 100 కూడా మెరుగైన మైలేజీకి ప్రసిద్ధి చెందిన టూవీలర్. ఈ మోటార్ సైకిల్ 4-స్ట్రోక్, SI ఇంజిన్‌తో దూకుడుగా ఉంటుంది. ఈ ఇంజిన్ 7,500 rpm వద్ద 5.43 kW పవర్‌ను & 5,000 rpm వద్ద 8.05 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ మోటార్ సైకిల్ 65 kmpl మైలేజీ ఇవ్వగలదని కంపెనీ తెలిపింది. హోండా షైన్ 100 ఎక్స్-షోరూమ్ ధర రూ. 66,900.
టీవీఎస్ రేడియన్ (TVS Radeon)
టీవీఎస్ రేడియన్ 109.7 cc, 4-స్ట్రోక్ BS-VI ఇంజిన్‌తో డిజైన్ అయింది. ఈ ఇంజిన్ 7,350 rpm వద్ద 6.03 kW పవర్‌ను & 4,500 rpm వద్ద 8.7 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ మోటార్‌సైకిల్ ఒక లీటరు పెట్రోల్‌తో 63 కి.మీ. దూరాన్ని కవర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. టీవీఎస్ రేడియన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 70,720 నుంచి ప్రారంభం అవుతుంది.





















