Royal Enfield Classic 350: రూ.11 వేలుకే ఎన్‌ఫీల్డ్ బైక్, ఈ దీపావళి ఆఫర్ భలే ఉంది - అదేలా సాధ్యం?
దీపావళి సందర్భంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ అదిరిపోయే ఆఫర్ ఇస్తోంది. కేవలం రూ. 11 వేలతో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైకును ఇంటికి తీసుకెళ్లే అవకాశం కల్పిస్తోంది.
భారత టూ వీలర్ మార్కెట్లో మంచి ప్రజాదరణ దక్కించుకున్న బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350. రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ నుంచి జరుగుతున్న అమ్మకాల్లో ఎక్కువ శాతం వీటి వాటానే ఉంది. గత నెల(సెప్టెంబర్)లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ ఏకంగా 82,097 యూనిట్ల అమ్మకాలతో 145 శాతం వృద్ధిని సాధించింది. అందులో, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైకులే 27,571 యూనిట్లు ఉండటం విశేషం. క్లాసిక్ బైక్ కు వస్తున్న ఆదరణను క్యాష్ చేసుకునే పనిలో పడింది కంపెనీ. మరిన్ని అమ్మకాలు జరిగేలా సరికొత్త ఆఫర్ ప్రకటించింది. దీపావళి సందర్భంగా అదిరిపోయే అవకాశాన్ని కల్పిస్తోంది. క్లాసిక్ 350 కొనాలని ఎదురుచూస్తున్న కొనుగోలుదారులు రూ. 11,000 డౌన్ పేమెంట్‌తో కొత్త బైక్‌ను ఇంటికి తీసుకోపోవచ్చని ప్రకటించింది. బైక్‌పై ఉన్న ఫైనాన్స్ ఆప్షన్ ల కారణంగా ఈ మోటార్ సైకిల్ ను తక్కువ ధరకు కొనుగోలు చేసే వీలు కలుగుతుందని రాయల్ ఎన్‌ఫీల్డ్ వెల్లడించింది.
EMI ఎంత చెల్లించాలంటే?
తాజాగా కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో 60 నెలలు, 48 నెలలు, 68 నెలల EMIలను పొందే అవకాశాన్ని కంపెనీ అందిస్తోంది. 60 నెలల కోసం కొనుగోలుదారు నెలకు రూ.4,557 చెల్లించాల్సి ఉంటుంది. 48 నెలల ఎంపిక కోసం కొనుగోలుదారులు నెలకు రూ. 5,341,36 నెలవారీ ఎంపిక కోసం నెలకు రూ.6,666 చెల్లించాల్సి ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ తాజా ఆఫర్ తో వినియోగదారులు ఈ బైకును కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు.
Read Also: టీవీఎస్ బాటలో హోండా కంపెనీ - 2024 వరకు సరికొత్త ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్ విడుదల!
గతేడాదే సరికొత్తగా మార్కెట్లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 గత ఏడాది సరికొత్తగా అప్‌గ్రేడ్ అయ్యింది. 20.2 హార్స్ పవర్, 27 Nm పవర్ అవుట్ పుట్‌తో కొత్త 349 cc J-సిరీస్ ఇంజన్ తో రూపొందింది. అదనంగా, చాసిసి ట్విన్-డౌన్‌ట్యూబ్ కాన్ఫిగరేషన్ తో పాటు కర్బ్ బరువు 195 కిలోలుగా ఉంటుంది. గత మోడల్ తో పోల్చితే పలు మార్పులతో ఈ లేటెస్ట్ మోటార్ సైకిల్ అప్ గ్రేడ్ చేసిన బెటర్ హ్యాండ్లింగ్స్ తో పాటు, NVH స్థాయిలను కలిగి ఉంది. అదనంగా, అప్‌గ్రేడ్ చేసిన అవతార్‌లో మెరుగైన ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, స్విచ్ గేర్ ఉన్నాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ధర ఎంతంటే?
ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ధర విషయానికి వస్తే రూ.1.90 లక్షల నుండి రూ. 2.21 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు అందుబాటులో ఉంది. దీని ప్రత్యర్థులుగా ఉన్న జావా స్టాండర్డ్, హోండా హెనెస్ CB350 తో పాటు బెనెల్లీ ఇంపీరియాల్ వంటి బైక్‌లతో పోటీ పడుతుంది.
Read Also: మన ఆటోలు వాడుతున్న యూకే పోలీసులు, ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు!