అన్వేషించండి

CNG పంప్ వద్ద పేలిన కారు సిలిండర్.. ప్రమాదాల బారిన పడకుండా ఈ విషయాలు తెలుసుకోండి

CNG Car Cylinder Blast | బరోడాలో CNG నింపుతున్న సమయంలో కారు సిలిండర్‌ పేలిపోయింది. మీరు CNG కారు నడుపుతున్నట్లయితే ప్రమాదాల బారిన పడకుండా 3 ముఖ్యమైన సేఫ్టీ టిప్స్ తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సీఎన్‌జీ వాహనాల డిమాండ్ ఉన్నా, వడోదరలో ప్రమాదం భద్రతను తెలియజేసింది.
  • ప్రతి మూడేళ్లకు హైడ్రో-టెస్టింగ్, ఆమోదిత సీఎన్‌జీ కిట్ వాడకం ముఖ్యం.
  • గ్యాస్ రీఫిల్లింగ్ సమయంలో కారు నుండి దిగి, భద్రతా జాగ్రత్తలు పాటించాలి.

భారత్‌లో CNG వాహనాలకు డిమాండ్ పెరిగింది. తక్కువ ఫ్యూయల్, మెయింటనెన్స్ ఖర్చు ఓ కారణంగా చెబుతారు. అయితే, చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటీవలే బరోడాలోని ఒక సీఎన్‌జీ పంప్‌ వద్ద ఫిల్ చేస్తుండగా హఠాత్తుగా ఒక కారు సిలిండర్ పేలిపోయింది. ఈ భారీ పేలుడుతో కారు విడిభాగాలు ముక్కలై ఎగిరిపడ్డాయి. చుట్టుపక్కల ఉన్న ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సీఎన్‌జీ పంప్ నుంచి దూరంగా పరుగులు తీశారు. 

ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు లోకల్ సిలిండర్లు వాడటం, సరైన సమయానికి సిలిండర్ టెస్ట్ చేయించకపోవడం లేదా గ్యాస్ లీకేజీని గుర్తించకపోవడం వల్లే జరుగుతుంటాయి. మీ వద్ద కూడా సీఎన్‌జీ కారు (CNG) ఉంటే గ్యాస్ రీఫిల్లింగ్ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటు ఇతర సీఎన్‌జీ ప్రమాదాల నుంచి మిమ్మల్ని, మీ కారును పూర్తిగా సురక్షితంగా ఉంచే 3 ముఖ్యమైన సేఫ్టీ చెక్స్ వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.

హైడ్రో-టెస్టింగ్ సర్టిఫికేట్‌ అప్‌డేట్‌

సీఎన్‌జీ కారు యజమానులకు అత్యంత ముఖ్యమైన విషయం.. సిలిండర్‌కు ఎప్పటికప్పుడూ హైడ్రో- టెస్టింగ్ చేయించాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి గుర్తింపు పొందిన టెస్టింగ్ సెంటర్ నుంచి సీఎన్‌జీ సిలిండర్‌ (CNG Cylinder)ను చెక్  చేయించడం తప్పనిసరి.

ఈ తనిఖీలో CNG సిలిండర్ లోపల ఏవైనా పగుళ్లు, తుప్పు పట్టడం లేదా గ్యాస్ ప్రెజర్ తట్టుకోవడంలో ఏమైనా బలహీనపడిందా అనేది చెక్ చేస్తారు. వ్యాలిడిటీ సమయం పూర్తయిన తర్వాత లేదా వ్యాలిడ్ హైడ్రో-టెస్టింగ్ సర్టిఫికేట్ లేకుండా సిలిండర్‌లో గ్యాస్ నింపడం ప్రమాదానికి దారితీయవచ్చు. కనుక ఎల్లప్పుడూ మీ కారు సిలిండర్ వ్యాలిడిటీని చెక్ చేసుకుంటూ ఉండాలి.

అప్రూవ్డ్ కిట్‌ను మాత్రమే ఉపయోగించాలి

బడ్జెట్, ఇతర ఖర్చుల కారణంగా కొందరు కొద్దిగా డబ్బు ఆదా చేయడం కోసం లోకల్ మార్కెట్లలో చౌకైన, లోకల్ సీఎన్‌జీ కిట్ లేదా పాత సిలిండర్‌ను తమ కారులో ఫిక్స్ చేయిస్తుంటారు. ఈ పెద్ద నిర్లక్ష్యం ఏ క్షణంలోనైనా భారీ ప్రమాదానికి కారణం కావచ్చు. కొన్ని సందర్బాలలో కారు డ్యామేజీతో పాటు మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చు.

అప్రూవల్ లేని సిలిండర్ల లోహం, వాల్వ్ గ్యాస్ హై ప్రెజర్‌ను తట్టుకోలేవు. కనుక రీఫిల్లింగ్ సమయంలో వాటిపై అధిక ప్రెజర్ పడగానే పేలిపోతాయి. ఎల్లప్పుడూ ఆర్‌టీఓ (RTO) అప్రూవ్డ్, కంపెనీ-ఫిట్టెడ్ సీఎన్‌జీ కిట్‌‌ (CNG KIT)ను మాత్రమే ఉపయోగించాలి. ఒకవేళ బయట కిట్ బిగించాల్సి వస్తే, ఎట్టి పరిస్థితిలోనైనా గుర్తింపు పొందిన డీలర్ వద్ద మాత్రమే సర్టిఫైడ్ కిట్‌ను ఇన్స్టాల్ చేయించుకోవాలి. 

ఆ సమయంలో కారు బయటకు రండి

సీఎన్‌జీ పంప్‌ వద్ద కారులో గ్యాస్ ఫిల్ చేస్తున్నప్పుడు కారు లోపల కూర్చోవడం చాలా ప్రమాదకరం. సీఎన్‌జీ సిలిండర్‌లో చాలా ఎక్కువ ప్రెజర్‌తో గ్యాస్ నింపుతారు. ఒకవేళ సిలిండర్ లేదా పైప్‌‌లైన్‌లో లోపం ఉంటే, ప్రెజర్ పెరగగానే సిలిండర్ బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంది.

భద్రతా కారణాల దృష్ట్యా గ్యాస్ రీఫిల్లింగ్ ప్రారంభమయ్యే ముందే కారులోని ప్రయాణికులు వాహనం నుంచి దిగిపోవాలి. ఫిల్ చేసే సమయంలో కారులో మనుషులు ఉంటే గట్టిగా ఫోన్ మాట్లాడటం, లేక ఏదైనా డివైజ్ వాడటం ప్రమాదానికి దారితీయవచ్చు. కారు ఇంజిన్‌ను సైతం పూర్తిగా బంద్ చేయాలి. సమీపంలో స్మోకింగ్ అస్సలు చేయకూడదు. అలాగే కారు డిక్కీని తెరిచి ఉంచడం ద్వారా గ్యాస్ లీక్ అయితే వెంటనే గుర్తించడానికి వీలవుతుంది.

 

Frequently Asked Questions

సీఎన్‌జీ వాహనాల్లో ప్రమాదాలు జరగడానికి ముఖ్య కారణాలు ఏమిటి?

లోకల్ సిలిండర్లు వాడటం, సరైన సమయానికి సిలిండర్ టెస్ట్ చేయించకపోవడం లేదా గ్యాస్ లీకేజీని గుర్తించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి.

సీఎన్‌జీ సిలిండర్‌కు హైడ్రో-టెస్టింగ్ ఎంత తరచుగా చేయించాలి?

ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి గుర్తింపు పొందిన టెస్టింగ్ సెంటర్ నుంచి సీఎన్‌జీ సిలిండర్‌ను చెక్‌ చేయించడం తప్పనిసరి. వ్యాలిడిటీ సమయం పూర్తయిన తర్వాత గ్యాస్ నింపడం ప్రమాదకరం.

సీఎన్‌జీ కారుకు ఎలాంటి కిట్‌ను ఉపయోగించాలి?

ఎల్లప్పుడూ ఆర్‌టీఓ (RTO) అప్రూవ్డ్, కంపెనీ-ఫిట్టెడ్ సీఎన్‌జీ కిట్‌ను మాత్రమే ఉపయోగించాలి. బయట కిట్ బిగించాల్సి వస్తే, గుర్తింపు పొందిన డీలర్ వద్ద సర్టిఫైడ్ కిట్‌ను ఇన్స్టాల్ చేయించుకోవాలి.

సీఎన్‌జీ రీఫిల్లింగ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

గ్యాస్ ఫిల్ చేస్తున్నప్పుడు కారులో కూర్చోకూడదు, ఇంజిన్ బంద్ చేయాలి. ఫోన్ మాట్లాడటం లేదా స్మోకింగ్ చేయడం చేయకూడదు. గ్యాస్ లీకేజీని గుర్తించడానికి కారు డిక్కీని తెరిచి ఉంచాలి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget