అన్వేషించండి

పెట్రోల్ కంటే CNG ఎందుకు చౌక? CNG వల్ల మీ కారుకు నష్టాలు ఏవైనా ఉన్నాయా?

CNG అంటే ఏమిటి? ఇది ఎలా తయారవుతుంది, ఎలా సరఫరా అవుతుంది, ఎంత సురక్షితం, పెట్రోల్‌తో పోలిస్తే లాభాలు & నష్టాలు ఏంటో తెలుసుకోండి.

CNG Advantages, Disadvantages and Safety: భారత్‌లో కార్లకు ఇంధనంగా పెట్రోల్, డీజిల్‌తో పాటు CNG కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు ఇది ప్రధానంగా ట్యాక్సీలకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఇంధన ధరలు పెరగడం దీనికి ప్రధాన కారణం. ఫ్యాక్టరీ నుంచే CNG సిస్టమ్‌తో వచ్చే కార్ల సంఖ్య కూడా పెరిగింది. దీంతో సాధారణ కార్ల కొనుగోలుదారులు కూడా CNG వైపు చూస్తున్నారు.

అసలు CNG అంటే ఏమిటి?

CNG అంటే కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (Compressed Natural Gas). ఇందులో ప్రధానంగా మీథేన్ ఉంటుంది. సాధారణంగా CNGలో 85 నుంచి 98 శాతం వరకు మీథేన్ ఉంటుంది. మిగిలిన భాగంలో ఈథేన్, బ్యూటేన్ వంటి ఇతర హైడ్రోకార్బన్లు ఉంటాయి. కొద్దిమొత్తంలో నైట్రోజన్ & కార్బన్ డయాక్సైడ్ కూడా ఉంటాయి. 

పెట్రోల్, డీజిల్‌లా CNG ద్రవ రూపంలో ఉండదు. దీనిని వాయు రూపంలోనే నిల్వ చేస్తారు.

CNGని ఎందుకు కంప్రెస్‌ చేస్తారు?

వాయు రూపంలోని సహజ వాయువుకు తక్కువ శక్తి సాంద్రత ఉంటుంది. అంటే అదే పరిమాణంలో పెట్రోల్‌తో పోలిస్తే CNG నుంచి లభించే శక్తి తక్కువ. ఎక్కువ దూరం ప్రయాణించడానికి అవసరమైన గ్యాస్‌ను సాధారణ వాయు రూపంలో నిల్వ చేస్తే చాలా పెద్ద ట్యాంక్ అవసరం అవుతుంది. అందుకే CNGని అధిక ఒత్తిడితో కుదిస్తారు (కంప్రెస్‌ చేస్తారు). సాధారణంగా 200 నుంచి 250 బార్ ఒత్తిడితో నిల్వ చేస్తారు. ఇలా చేయడం వల్ల గ్యాస్ పరిమాణం సుమారు 250 రెట్లు తగ్గుతుంది. దీంతో వాహనాల్లో సరిపోయే పరిమాణంలో సిలిండర్లను ఏర్పాటు చేయవచ్చు.

CNG ఎక్కడి నుంచి వస్తుంది?

భారత్‌లో ఉపయోగించే CNGలో కొంత భాగం దేశీయ సహజ వాయువు ఉత్పత్తి నుంచి వస్తుంది. మరికొంత భాగం దిగుమతి చేసుకునే LNG నుంచి వస్తుంది. LNG అంటే Liquefied Natural Gas. సహజ వాయువును సుమారు మైనస్ 162 డిగ్రీల సెల్సియస్‌ వరకు చల్లబరిస్తే అది ద్రవంగా మారుతుంది. దీంతో తక్కువ స్థలంలో ఎక్కువ పరిమాణంలో గ్యాస్‌ను రవాణా చేయవచ్చు.

ఆహార వ్యర్థాలు, మురుగునీరు & పశువుల పేడ వంటి సేంద్రియ పదార్థాల నుంచి కూడా మీథేన్‌ను తయారు చేస్తున్నారు. దీనిని కుదించి Bio-CNGగా ఉపయోగిస్తారు. అయితే ప్రస్తుతం దీని ఉత్పత్తి పరిమితంగానే ఉంది.

ఇది కూడా చదవండి: ఇంజిన్ ఆఫ్ చేసినా కారు టిక్‌ టిక్‌ శబ్దం ఎందుకు చేస్తుంది? ఈ విషయాలు తెలుసుకోండి!

CNG ఎలా సరఫరా చేస్తారు?

CNGని గ్యాస్ పైప్‌లైన్ల ద్వారా పంపిస్తారు. పైప్‌లైన్ నేరుగా అనుసంధానమైన ఇంధన కేంద్రాలను Online Stations అంటారు. ఇవి పెద్ద నగరాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. పైప్‌లైన్ సదుపాయం లేని ప్రాంతాల్లో CNGని ప్రత్యేక సిలిండర్ సముదాయాల్లో తరలిస్తారు. వీటిని Cascades అంటారు. మదర్ స్టేషన్‌లో నింపిన CNGని ట్రక్కుల ద్వారా ఇతర కేంద్రాలకు తీసుకెళ్తారు. ఆ స్టేషన్లను డాటర్‌ స్టేటన్స్‌ అంటారు.

CNG సురక్షితమేనా?

ఆధునిక వాహనాల్లో ఉపయోగించే CNG వ్యవస్థలు సాధారణంగా సురక్షితమైనవే. CNG సిలిండర్లను అధిక ఒత్తిడిని తట్టుకునేలా తయారు చేస్తారు. వీటిలో ప్రెజర్ రిలీఫ్ వాల్వ్‌లు & ఆటోమేటిక్ షట్ ఆఫ్ వాల్వ్‌లు ఉంటాయి. మీథేన్ గాలి కంటే తేలికగా ఉంటుంది. లీక్ ఏర్పడితే అది పైకి వచ్చి వేగంగా వ్యాపిస్తుంది. మీథేన్‌కు సహజంగా వాసన ఉండదు. అయితే లీక్‌ను సులభంగా గుర్తించేందుకు ప్రత్యేకమైన ఘాటైన వాసన కలిగించే రసాయనాన్ని కలుపుతారు.

CNG అధిక ఒత్తిడితో నిల్వ ఉంటుంది కాబట్టి, సిలిండర్‌ కంపెనీ సూచించిన టైమ్‌ పిరియడ్‌లో తనిఖీ చేయిస్తుండాలి. అవసరమైన పరీక్షలు కూడా చేయించాలి.

CNG వల్ల లాభాలు ఏంటి?

మొదటిది.. తక్కువ నిర్వహణ ఖర్చు. పెట్రోల్‌తో పోలిస్తే CNGతో కిలోమీటర్‌కు అయ్యే ఖర్చు సాధారణంగా 30 నుంచి 50 శాతం వరకు తక్కువగా ఉండొచ్చు. అందుకే CNGకి ఆదరణ పెరిగింది.

రెండోది.. తక్కువ కాలుష్యం. CNG మండినప్పుడు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తక్కువగా ఉంటాయి. పార్టిక్యులేట్ మ్యాటర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సల్ఫర్ ఆక్సైడ్లు & నైట్రోజన్ ఆక్సైడ్ల ఉద్గారాలు కూడా తగ్గుతాయి. డీజిల్‌తో పోలిస్తే పార్టిక్యులేట్ మ్యాటర్ తగ్గింపు మరింత ఎక్కువగా ఉంటుంది.

మూడోది.. ఇంజిన్ లోపలి భాగాలు కొంత శుభ్రంగా ఉంటాయి. CNG గాలితో బాగా కలుస్తుంది. దహనం తర్వాత కార్బన్ పేరుకుపోవడం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో స్పార్క్ ప్లగ్‌లు కూడా శుభ్రంగా ఉండే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: కారుకు CNG కిట్ పెట్టిస్తే ఎంత ఖర్చవుతుంది? పోలీసులు, ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి ఇబ్బందులు వస్తాయా?

CNGకి కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి.

మొదటిది.. తక్కువ రేంజ్. CNGని కుదించినప్పటికీ పెట్రోల్ లేదా డీజిల్‌తో పోలిస్తే తక్కువ శక్తిని నిల్వ చేయగలదు. అందువల్ల ఇంధన ట్యాంక్ పరిమాణంతో పోలిస్తే రేంజ్ తక్కువగా ఉంటుంది.

రెండోది.. రీఫ్యూయలింగ్ సమయం. CNG స్టేషన్లు ప్రధానంగా నగరాలు & ముఖ్యమైన రహదారుల వెంట ఉంటాయి. డిమాండ్ పెరగడంతో కొన్ని ప్రాంతాల్లో క్యూలు ఎక్కువగా ఉంటాయి. స్టేషన్‌లో వాహనాలు ఎక్కువగా ఉన్నప్పుడు నింపడానికి మరింత సమయం పట్టొచ్చు.

మూడోది.. పవర్ తగ్గడం. పెట్రోల్ సిలిండర్‌లోకి ద్రవపు చిన్న బిందువుల రూపంలో వెళ్తుంది. CNG మాత్రం వాయువు రూపంలో ఉంటుంది. దీంతో సిలిండర్‌లో గాలికి అందుబాటులో ఉండే స్థలం తగ్గుతుంది. ఫలితంగా, పెట్రోల్‌తో పోలిస్తే CNG నుంచి తక్కువ పవర్‌ ఉత్పత్తి అవుతుంది.

అయితే CNGకి ఆక్టేన్ రేటింగ్ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఇది 120 RON కంటే ఎక్కువగా ఉంటుంది. CNGతో మాత్రమే నడిచే ఇంజిన్‌లో ఎక్కువ కంప్రెషన్ రేషియో ఉపయోగించి పవర్‌ను పెంచే అవకాశం ఉంటుంది. కానీ సాధారణ కార్లు పెట్రోల్ & CNG రెండింటిపై నడిచేలా రూపొందిస్తారు. అందుకే పెట్రోల్‌కు అనుకూలమైన తక్కువ కంప్రెషన్ రేషియోను ఉపయోగిస్తారు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

350cc బైక్‌ Triumph Tracker 400 రియల్‌ మైలేజ్‌ గురించి తెలుసా? లీటర్ పెట్రోల్‌తో ఎన్ని కిలోమీటర్లు తిరిగిందంటే?
Triumph Tracker 400 నిజమైన మైలేజ్ ఎంత? సిటీ ట్రాఫిక్‌లో, హైవేపై అసలు లెక్క ఇదే!
21,000 కిలోమీటర్ల ప్రయాణం.. Hyundai Alcazar పెర్ఫార్మెన్స్‌, ఫీచర్లు, కంఫర్ట్‌ ఎలా అనిపించింది?
Hyundai Alcazar లాంగ్‌ జర్నీ రిపోర్ట్‌.. 21,000 km ప్రయాణం ఎలా అనిపించింది?
Tata Tiago సర్వీస్‌ కోసం భారీగా ఖర్చు చేయాలా? పెట్రోల్, CNG, AMT కార్ల నిర్వహణ వ్యయాల వివరణ
టాటా టియాగో కొంటే సంవత్సరానికి సర్వీస్ ఖర్చు ఎంతవుతుంది? 5 ఏళ్లకు అయ్యే మొత్తం వ్యయం ఇదే!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 1338 km ప్రయాణం.. Audi A6 e-tron సంచలనం
777 km కారు ఏకంగా 1338 km ప్రయాణించింది.. Audi A6 సరికొత్త గిన్నిస్ రికార్డు
Advertisement

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ
సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Vijayawada News: అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
Hyderabad Metro Rail Project:హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి ముహూర్తం ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి ముహూర్తం ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: బరాబర్‌ అమన్‌కి ఇచ్చే పడేసిన త్రిగుణ్, ముకేశ్! విన్నర్ డబ్బు ఎలా ఇస్తారంటూ గొడవ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: బరాబర్‌ అమన్‌కి ఇచ్చే పడేసిన త్రిగుణ్, ముకేశ్! విన్నర్ డబ్బు ఎలా ఇస్తారంటూ గొడవ!
Tiger Tension: వికారాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం.. గోశాల ఆవులపై దాడి, భయాందోళనలో స్థానిక ప్రజలు
వికారాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం.. గోశాల ఆవులపై దాడి, భయాందోళనలో స్థానిక ప్రజలు
Dementia Signs : మతిమరుపు లేదా డిమెన్షియా? ఈ 7 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త, వైద్యుల సూచనలివే
మతిమరుపు లేదా డిమెన్షియా? ఈ 7 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త, వైద్యుల సూచనలివే
NATS Charity: దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించేలా నాట్స్ సేవా కార్యక్రమాలు... 80 లక్షలతో 'సంబరంలో సేవ'
దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించేలా నాట్స్ సేవా కార్యక్రమాలు... 80 లక్షలతో 'సంబరంలో సేవ'
Free Rice To Fishermen: మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ .. ఒక్కో కుటుంబానికి 50 కిలోల ఉచిత బియ్యం
మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ .. ఒక్కో కుటుంబానికి 50 కిలోల ఉచిత బియ్యం
Embed widget