అన్వేషించండి

Citroen eC3X Launched:సిట్రోయెన్ కొత్త ఎలక్ట్రిక్ కారు సంచలనం - BaaS ప్లాన్‌తో eC3X ధర భారీగా తగ్గింపు!

Citroen eC3X Launched:సిట్రోయెన్ eC3X ఎలక్ట్రిక్ కారును భారత్‌లో రూ.6.89 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. బ్యాటరీ యాజ్‌ ఏ సర్వీస్‌ (BaaS) మోడల్, 320 కి.మీ. రేంజ్, ఫీచర్లు, ధర వివరాలు తెలుసుకోండి.

Citroen eC3X Launched: భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, ఫ్రెంచ్ ఆటోమొబైల్ తయారీ సంస్థ సిట్రోయెన్ (Citroen) వినూత్న ఆఫర్‌తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ముందుకొచ్చింది. కంపెనీ తన కొత్త Citroen eC3X ఎలక్ట్రిక్ కారును భారత్‌లో అధికారికంగా లాంచ్‌ చేసింది. ఈ కారులో ప్రధాన ఆకర్షణ దాని ధరే. ఎందుకంటే, కేవలం రూ. 6.89 లక్షల (ఎక్స్‌ షోరూమ్) ప్రారంభ ధరతో ఈ ఎలక్ట్రిక్ కారు కామన్‌మ్యాన్‌కు కూడా అందుబాటులోకి వచ్చింది.

అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఈ ఎక్స్‌ షోరూమ్ ధరలో బ్యాటరీ ఖర్చు ఉండదు. కంపెనీ బ్యాటరీ యాజ్‌ ఏ సర్వీస్‌ (Battery-as-a-Service (BaaS)) మోడల్‌ను అందిస్తోంది. అంటే, కస్టమర్లు ఈ కారును బ్యాటరీ లేకుండా తక్కువ ధరకే కొనుగోలు చేస్తారు, బ్యాటరీని కంపెనీ నుంచి అద్దెకు తీసుకుంటారు. కారు నడిచిన దూరాన్ని బట్టి బ్యాటరీకి అద్దె చెల్లించాలి. ప్రస్తుతం సిట్రోయెన్ ప్రతి కిలోమీటర్‌కు రూ. 2.26 చొప్పున బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ఛార్జ్‌ను నిర్ణయించింది.

బ్యాటరీతో కొనాలంటే ఎంత?

బ్యాటరీతో సహా పూర్తి కారును కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు రూ. 10.25 లక్షల (ఎక్స్‌ షోరూమ్) ధర చెల్లించాలి. అంటే, అవసరాలకు అనుగుణంగా రెండు ఆప్షన్లలో ఒకదానిని ఎంచుకునే అవకాశం కస్టమర్లకు లభిస్తోంది.

డిజైన్‌లో కొత్తదనం ఏంటి?

కొత్త eC3X డిజైన్ పరంగా సిట్రోయెన్ సీ3ఎక్స్ ICE మోడల్‌ను పోలి ఉంటుంది. ముందు భాగంలో LED DRLs, ఫాగ్ ల్యాంప్స్, సిగ్నేచర్ గ్రిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. 15 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో పాటు బాడీ క్లాడింగ్ కూడా అందించారు.

ఈ కారు మొత్తం ఆరు రంగుల్లో లభిస్తోంది. అవి:

* పోలార్ వైట్
* స్టీల్ గ్రే
* కాస్మో బ్లూ
* పెర్లా నెరా బ్లాక్
* గార్నెట్ రెడ్
* డీప్ ఫారెస్ట్ గ్రీన్

ఇంటీరియర్‌లో హైటెక్ ఫీచర్లు

క్యాబిన్‌లో ఎలక్ట్రిక్ బ్లూ థీమ్‌ను ఉపయోగించారు. టోన్ లామా లెదరెట్ సీట్లు ప్రీమియం ఫీలింగ్‌ను అందిస్తాయి. ఫీచర్ల విషయానికి వస్తే:

* 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
* వైర్‌లెస్ Apple CarPlay
* వైర్‌లెస్ Android Auto
* వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్
* కనెక్టెడ్ కార్ టెక్నాలజీ 2.0
* రిమోట్ యాక్సెస్ ఫీచర్లు
* ఎలక్ట్రోక్రోమిక్ IRVM

అదనంగా JBL ఆడియో సిస్టమ్, ఫ్రంట్ & రియర్ డ్యాష్‌క్యామ్ ప్యాకేజీ ఆప్షనల్‌గా అందుబాటులో ఉన్నాయి.

భద్రతకు పెద్దపీట

భద్రత విషయంలో కూడా సిట్రోయెన్ రాజీపడలేదు. ఈ కారులో:

* 6 ఎయిర్‌బ్యాగ్స్
* ABS with EBD
* ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్
* లేన్ డిపార్చర్ వార్నింగ్
* హై స్పీడ్ అలర్ట్
* రివర్స్ సేఫ్టీ ఫీచర్లు

వంటి అడ్వాన్స్‌డ్‌ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

బ్యాటరీ, రేంజ్ వివరాలు

Citroen eC3Xలో 29.2 kWh బ్యాటరీ ప్యాక్ అందించారు. ఒక్కసారి పూర్తి చార్జ్ చేస్తే గరిష్టంగా 320 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ఈ బ్యాటరీతో పనిచేసే ఎలక్ట్రిక్ మోటార్ 57 hp పవర్ & 143 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

DC ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగిస్తే బ్యాటరీని 10 శాతం నుంచి 80 శాతం వరకు కేవలం 57 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు.

ఎవరికి బెస్ట్ ఆప్షన్?

ఎలక్ట్రిక్ కారును తక్కువ ప్రారంభ పెట్టుబడితో కొనాలనుకునే వారికి Citroen eC3X BaaS మోడల్ మంచి ఎంపికగా కనిపిస్తోంది. ముఖ్యంగా నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు EVను ఉపయోగించే వినియోగదారులకు ఈ ధర ఆకర్షణీయంగా ఉండొచ్చు. అయితే బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ఖర్చును కూడా లెక్కలోకి తీసుకుని కొనుగోలు నిర్ణయం తీసుకోవడం మంచిది.

భారత EV మార్కెట్లో తక్కువ ధరతో ప్రవేశించిన Citroen eC3X, రాబోయే రోజుల్లో టాటా, MG వంటి కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Engine Layout: మీ కారు ఇంజిన్ ఎక్కడుంది? ముందు, వెనుక లేదా మధ్యలో.. ప్లేస్‌మెంట్‌ను బట్టి మారనున్న డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌!
మీ కారు ఇంజిన్‌ ముందు వైపు ఉందా, మధ్యలో ఉందా.. డ్రైవింగ్‌లో వచ్చే తేడా ఏంటి?
Car Tyre Pressure: కారు టైర్లలో గాలి ఎంత ఉండాలి? ఈ చిన్న తప్పు వల్ల మైలేజీ తగ్గడమే కాదు, ప్రమాదం పెరుగుతుంది!
టైర్ ప్రెజర్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారా? మైలేజీ, బ్రేకింగ్, టైర్ లైఫ్‌ మీద ఎంత ప్రభావమో తెలుసా?
Moto Guzzi The Trip: 457cc ఇంజిన్‌, 47.6hp పవర్‌తో కొత్త రెట్రో రెట్రో రోడ్‌స్టర్.. ఫీచర్లు, కలర్ ఆప్షన్లు
బైక్‌ పేరు Moto Guzzi The Trip.. 457cc ఇంజిన్‌తో వస్తున్న కొత్త ఇటలీ మోటార్‌సైకిల్‌
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget