అన్వేషించండి

Tata Punch Vs Citreon C3: పంచ్‌కు పోటీగా రానున్న సీ3 - కొండను ఢీకొట్టగలదా? - ఏ కారు బెస్ట్!

ప్రస్తుతం బడ్జెట్ కార్ల విషయంలో టాటా పంచ్ దూసుకుపోతుంది. పంచ్‌కు పోటీగా సిట్రియోన్ సీ3 కారు త్వరలో లాంచ్ కానుంది. వీటిలో ఏది బెస్ట్ అంటే?

సిట్రియోన్ సీ3 (Citreon C3) కారును ఎస్‌యూవీ (SUV) అనడం కంటే ఎస్‌యూవీలా కనిపించే హ్యాచ్‌బ్యాక్ (Hatchback) అనడం కరెక్ట్. దీనికి సంబంధించిన ప్రొడక్షన్ స్పెసిఫిక్ కార్లు ఇప్పటికే రోడ్ల మీద కనిపించాయి. ఈ కారును బాగా లోకలైజ్ చేయనున్నారని తెలుస్తోంది. అంటే దీని ధర కూడా తక్కువగా ఉండనుంది. టాటా పంచ్‌తో (Tata Punch) సిట్రియోన్ సీ3 పోటీ పడనుంది. ఈ రెండిట్లో ఏది బెస్ట్‌గా ఉండనుందో ఇప్పుడు చూద్దాం...

ఏ కారు పెద్దగా ఉండనుంది?
ఈ రెండిట్లో సిట్రియోన్ సీ3 పొడవు 3980 మిల్లీమీటర్లు కాగా... టాటా పంచ్ పొడవు 3827 మిల్లీమీటర్లుగా ఉంది. సిట్రియోన్ సీ3 కారు కొలతలు ఇంకా తెలియాల్సి ఉంది. టాటా పంచ్, సిట్రియోన్ చూడటానికి దాదాపు ఒకేలా ఉంటాయి. అయితే పంచ్ లుక్ కొంచెం ఎస్‌యూవీ తరహాలో ఉండనుంది.

ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయి?
వీటిలో పంచ్ ఫుల్లీ లోడెడ్ కారు. ఇందులో 7 అంగుళాల టచ్ స్క్రీన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, క్రూజ్ కంట్రోల్, ఆటో హెడ్‌ల్యాంప్స్, పార్ట్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెనకవైపు కెమెరా ఉన్నాయి. సిట్రియోన్ సీ3లో 10 అంగుళాల టచ్ స్క్రీన్ ఉంది. కానీ ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్‌ను ఇందులో అందించడం లేదు. సిట్రియోన్ సీ3లో ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. పంచ్ వీల్ బేస్ 2,445 మిల్లీమీటర్లు కాగా... సిట్రియోన్ సీ3 వీల్ బేస్ 2,540 మిల్లీమీటర్లుగా ఉంది.

ఇంజిన్లు ఎలా ఉన్నాయి?
సిట్రియోన్ సీ3లో 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ లేదా టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ యూనిట్ ఉండనుంది. ఇక పంచ్‌లో కేవలం 1.2 లీటర్ పెట్రోల్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఏఎంటీ, మాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్లను ఇందులో అందించారు.

మరి ధర?
టాటా పంచ్ ధర రూ.5.6 లక్షల నుంచి రూ.8.9 లక్షలుగా ఉండనుంది. ఇక సిట్రియోన్ సీ3 ధర కూడా పంచ్ రేంజ్‌లోనే ఉండే అవకాశం ఉంది. పంచ్‌కు గట్టిపోటీ ఇవ్వాలంటే మాత్రం సిట్రియోన్ దాని కంటే తక్కువ రేటుకు దించాల్సిందే. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం సిట్రియోన్ సీ3 ధర రూ.5.5 లక్షల నుంచి ప్రారంభం కానుంది.

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

టాప్ హెడ్ లైన్స్

సిటీ రైడింగ్‌ అయినా, ఆఫ్‌రోడ్ ట్రైల్స్‌ అయినా.. Decathlon కొత్త సైకిళ్ల ప్రత్యేకతలివే!
డెకాథ్లాన్ నుంచి 3 కొత్త సైకిళ్లు.. Rockrider సిరీస్‌లో అదిరిపోయే మోడల్స్!
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి, EMI ఎంత పడుతుంది?
ఎక్కువ డబ్బు అవసరం లేదు, చాలా తక్కువ డౌన్‌పేమెంట్‌తోనే RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ కొనవచ్చు!
టాటా కారు కొనే ప్లాన్‌లో ఉంటే వెంటనే కొనేయండి, రేట్లు పెరగబోతున్నాయ్‌!
మారుతి, హ్యుందాయ్‌ బాటలోనే టాటా.. సెప్టెంబర్‌ నుంచి ధరల మోత

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
Embed widget