Citroen C3: కొత్త బడ్జెట్ కారు వచ్చేస్తుంది - రూ.ఆరు లక్షల్లోపే - లగ్జరీ కారు తరహా లుక్, ఫీచర్లు!
సిట్రియోన్ సీ3 బడ్జెట్ కారు మనదేశంలో త్వరలో లాంచ్ కానుందని తెలుస్తోంది. దీని ఫీచర్లను కంపెనీ రివీల్ చేసింది.
సిట్రియోన్ సీ3 మనదేశంలో వచ్చే నెలలో లాంచ్ కానుంది. ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ విభాగంలో ఈ కారు ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విభాగంలోని మిగతా కార్లలా కాకుండా సిట్రియోన్ సీ3 చాలా స్టైలిష్‌గా ఉండనుంది. సీ5 లగ్జరీ ఎస్‌యూవీ తరహాలో దీని డిజైన్ ఉండనుంది.
గతంలో సీ5 ప్లస్‌ను లాంచ్ చేసిన సిట్రియోన్ ఇప్పుడు బడ్జెట్ విభాగంలో సీ3ని లాంచ్ చేయనుంది. తక్కువ ధరలో లాంచ్ చేయడానికి ఈ కారును భారీగా లోకలైజ్ చేశారు. ఈ కారు పొడవు నాలుగు మీటర్లలోపే ఉన్నప్పటికీ గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంది.
ఈ కారులో ప్రత్యేకత ఏంటంటే దీని స్టైలింగ్ అని చెప్పవచ్చు. ఇందులో టిపికల్ సిట్రియోన్ గ్రిల్, వినూత్నమైన స్టైలింగ్ ఉండనుంది. మనదేశంలో దీనికి ఎటువంటి ఇంటీరియర్ అందించారో ఇంకా తెలియాల్సి ఉంది. అయితే గ్లోబల్ వేరియంట్ తరహాలోనే ఉండనుందని వార్తలు వస్తున్నాయి.
ఇందులో మరిన్ని ఫీచర్లు ఉండనున్నాయి. పెద్ద టచ్ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. సీ3లో పెద్ద వీల్ బేస్ ఉండనుంది. 1.2 లీటర్ టర్బో, నాన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లు ఇందులో ఉండనున్నాయి. మాన్యువల్, ఆటోమేటిక్ ఆప్షన్లు కూడా అందించనున్నారు.
అయితే ఈ కారు విజయం సాధించాలంటే ధర చాలా ముఖ్యం. బాగా లోకలైజ్ చేశారు ధర విషయంలో కంపెనీ అగ్రెసివ్‌గా వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం దీని ధర రూ.ఐదు లక్షల రేంజ్‌లోనే ఉండనుంది. ఎంత ఉండనుందో కచ్చితంగా తెలియాలంటే లాంచ్ వరకు ఆగాల్సిందే!
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
View this post on Instagram