News
News
X

Car Discounts : పండుగల సీజన్‌లో కారు కొనాలనుకుంటున్నారా ? ఇవిగో బంపర్ ఆఫర్ల డీటైల్స్

పండుగల సీజన్‌లో మార్కెట్‌ను కైవసం చేసుకునేందుకు కార్ల కంపెనీలు డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. ఏ ఏ కంపెనీ ఎంత డిస్కౌంట్ ప్రకటించిందో వివరాలు ఇవే

FOLLOW US: 

Car Discounts :   పండుగల సీజన్ వచ్చేసింది. కార్ల మార్కెట్ కూడా ఊపందుకుంటోంది. ఇప్పటి వరకూ చిప్‌ల కొరతతో మందకొడిగా ఉన్న పరిశ్రమ ఇప్పుడిప్పుడే వేగం పంజుకుంటోంది. వచ్చే పండుగల సీజన్‌లోమార్కెట్ ను కైవసం చేసుకునేందుకు పెద్ద పెద్ద కంపెనీలన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీలను ప్రయోగిస్తున్నాయి. బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి వాహ‌నాల‌పై డిస్కౌంట్లు, ఆఫ‌ర్ల‌తో   మారుతి సుజుకి, టాటా మోటార్స్‌, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా, హ్యుండాయ్ త‌దిత‌ర కార్ల త‌యారీ సంస్థ‌లు ప్రచారం ప్రారంభించాయి. 

కరోనా తర్వాత వాహనాలు ముఖ్యంగా వ్యక్తిగత కార్లు కొనాలనుకునేవారి సంఖ్య పెరిగింది. దీంతో ఎంట్రీ లెవల్ కార్ల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. అందుకే కార్ల కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్లపై డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి.  హ్యుందాయ్ కంపెనీ  సాంత్రో, ఐ10 నియోస్‌, ఔరా, ఐ20, ఎక్స్‌సెంట్‌, కొనా ఈవీ వంటి వివిధ మోడ‌ల్ కార్ల‌పై  క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బెనిఫిట్లు, అద‌న‌పు ఇన్సెంటివ్‌లు అందించ‌నున్నట్లుగా ప్రకటించారు.  మోడ‌ల్ ను బట్టి  కార్ల‌పై రూ.13 వేల నుంచి రూ.50 వేల వ‌ర‌కు రాయితీ  ఇవ్వనుంది. 

ఇక దేశీయ ఆటోమొబైల్ జెయింట్ మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా కూడా ఎక్స్‌యూవీ300, బొలెరో, బొలెరో నియో వంటి మోడ‌ల్ కార్ల‌పై ప‌లు ఇన్సెంటివ్‌లు, ఆఫ‌ర్లు అందిస్తాయి. అతిపెద్ద ఆటో మేజ‌ర్ మారుతి సుజుకిలో ఎంపిక చేసిన మోడ‌ల్ కార్లు ఎస్‌-ప్రెస్సో, ఆల్టో800, స్విఫ్ట్‌, సెలెరియో వంటి వేరియంట్ కార్ల‌పై రూ.9000-60,0000 వ‌ర‌కు డిస్కౌంట్లు అందిస్తున్న‌ది.

మ‌రో దేశీయ ఆటోమొబైల్ మేజ‌ర్ టాటా మోటార్స్ సైతం టియాగో, టైగోర్‌, నెక్సాన్‌, స‌ఫారీ వంటి మోడ‌ల్ కార్ల‌పై రూ.40 వేల వ‌ర‌కు డిస్కౌంట్లు ప్ర‌క‌టించింది. కేర‌ళ‌లో ఓనం వేడుక‌ల నుంచి డిస్కౌంట్లు అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని తెలిపింది. గ‌త రెండేండ్లుగా కార్ల‌కు చాలా ఎక్కువ‌గా డిమాండ్ ఉంది. అయినప్పటికీ రూ.20 వేల నుంచి రూ.40 వేల వ‌ర‌కు రాయితీలు క‌ల్పిస్తోంది. 

Published at : 12 Aug 2022 04:21 PM (IST) Tags: festive season Car companies car discounts

సంబంధిత కథనాలు

Jawa 42 Bobber: సింగిల్ సీటర్-అదిరిపోయే లుక్, జావా నుంచి సరికొత్త బైక్ రిలీజ్!

Jawa 42 Bobber: సింగిల్ సీటర్-అదిరిపోయే లుక్, జావా నుంచి సరికొత్త బైక్ రిలీజ్!

Project Titan Apple: పట్టాలెక్కబోతున్న ఆపిల్ ‘ప్రాజెక్ట్ టైటాన్’, శరవేగంగా ఎలక్ట్రిక్ కారు నిర్మాణ పనులు!

Project Titan Apple: పట్టాలెక్కబోతున్న ఆపిల్ ‘ప్రాజెక్ట్ టైటాన్’, శరవేగంగా ఎలక్ట్రిక్ కారు నిర్మాణ పనులు!

Tata Tiago EV: దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు - 57 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - టియాగో ఈవీ వచ్చేసింది!

Tata Tiago EV: దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు - 57 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - టియాగో ఈవీ వచ్చేసింది!

Electric Aircraft: అద్భుతం, గాల్లో చక్కర్లు కొట్టిన ఫస్ట్ ఆల్ ఎలక్ట్రిక్ ఎయిర్‌ క్రాఫ్ట్ 'ఆలిస్'

Electric Aircraft: అద్భుతం, గాల్లో చక్కర్లు కొట్టిన ఫస్ట్ ఆల్ ఎలక్ట్రిక్ ఎయిర్‌ క్రాఫ్ట్ 'ఆలిస్'

Airbags Mandatory: కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉండాల్సిందే, ఈ రూల్ వర్తించేది అప్పటి నుంచే

Airbags Mandatory: కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉండాల్సిందే, ఈ రూల్ వర్తించేది అప్పటి నుంచే

టాప్ స్టోరీస్

AP BJP : ట్రాక్ మార్చిన ఏపీ బీజేపీ - ఇక ఊపందుకుంటుందా ?

AP BJP :  ట్రాక్ మార్చిన ఏపీ బీజేపీ - ఇక ఊపందుకుంటుందా ?

Karimnagar: తెలుగు సినిమాల్లా తెలుగు పార్టీ, పాన్ ఇండియాలో దుమ్ము లేపే రోజు దగ్గర్లోనే - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Karimnagar: తెలుగు సినిమాల్లా తెలుగు పార్టీ, పాన్ ఇండియాలో దుమ్ము లేపే రోజు దగ్గర్లోనే - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

Mrunal Thakur: ఆ సమయంలో చనిపోవాలనుకున్న మృణాల్‌ - ‘సీతారామం’ సక్సెస్ వరకు ‘సీత’ పడిన కష్టాలెన్నో!

Mrunal Thakur: ఆ సమయంలో చనిపోవాలనుకున్న మృణాల్‌ - ‘సీతారామం’ సక్సెస్ వరకు ‘సీత’ పడిన కష్టాలెన్నో!