Buying Tesla Car: డైరెక్ట్‌గా రూ. 68 లక్షలు చెల్లించి టెస్లా కారు కొనవచ్చా, లేదా ముందుగా బుక్ చేసుకోవాలా?
Tesla Launches Model Y In India: భారతదేశంలో డైరెక్ట్ పేమెంట్‌తో చెల్లింపుతో టెస్లా కారును కొనుగోలు చేయవచ్చా?. టెస్లా మోడల్ Y కారు ధర & డెలివరీ వివరాల గురించి వివరంగా తెలుసుకుందాం.

Buying A Tesla Car In India: అమెరికాకు చెందిన ప్రసిద్ధ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా, ఎట్టకేలకు భారతదేశంలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ కంపెనీ నుంచి వచ్చిన పాపులర్ ఎలక్ట్రిక్ SUV "మోడల్ Y"ని (Tesla Model Y) జూలై 15, 2025న భారతదేశంలో లాంచ్ చేసింది. మోడల్ Y ధర, దాని వేరియంట్‌ను బట్టి దాదాపు రూ. 60 లక్షల నుంచి రూ. 68 లక్షల మధ్య ఉంటుంది.
డైరెక్ట్‌గా షోరూమ్‌కు వెళ్లి టెస్లా కారు కొనుగోలు చేయవచ్చా?
నిజానికి, చాలా మంది మనసుల్లో ఉన్న ప్రశ్న ఇది. నేరుగా టెస్లా షోరూమ్‌కి వెళ్లి, రూ. 68 లక్షలు చెల్లించి మోడల్ Y ఎలక్ట్రిక్ కారుతో ఇంటికి వెళ్లవచ్చా?. దీనికి సమాధానం - "కుదరదు". టెస్లా కారు కావాలంటే ముందుగా మీరు బుకింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ పనిని మీరు షోరూమ్‌కు వెళ్లి చేయవచ్చు లేదా ఆన్‌లైన్‌లోనూ కారును బుక్ చేయవచ్చు. బుకింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే తదుపరి కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుంది.
భారతదేశంలో టెస్లా కారు కొనాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి:
- ముందుగా, టెస్లా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లండి లేదా ముంబైలో ఉన్న ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌కు వెళ్లి సమాచారం పొందండి.
- టెస్లా ప్రస్తుతం భారతదేశంలో మోడల్ Y కార్లను (వీలైతే మోడల్ 3 కార్లను కూడా) అందిస్తోంది. మీ అవసరం & బడ్జెట్ ప్రకారం మోడల్‌ను ఎంచుకోండి.
- బుకింగ్ సమయంలో మీకు రిఫండ్ కాని బుకింగ్ అమౌంట్ చెల్లించాలి. ప్రస్తుతం, బుకింగ్ మొత్తం రూ. 22,000.
- బుకింగ్ తర్వాత, కంపెనీ మిమ్మల్ని పూర్తి ధర అడుగుతుంది. మీరు ఏ వేరియంట్ ఎంచుకుంటారో దాని ఆధారంగా ధరను నిర్ణయిస్తారు.
- పూర్తి డబ్బు చెల్లించిన తర్వాత, కారు డెలివరీ తేదీని టెస్లా మీకు తెలియజేస్తుంది. ఈ వాహనాలు CBU పద్ధతిలో చైనా నుంచి వస్తున్నాయి కాబట్టి డెలివరీకి కొంత సమయం పట్టవచ్చు.
టెస్లా మోడల్ Y ఎలా ఉంది?
టెస్లా మోడల్ Y ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ SUV. ప్రత్యేక లక్షణాలు & అత్యంత అధునాతన సాంకేతికతకు ఈ కారు ప్రసిద్ధి చెందింది. మోడల్ Y కారు రెండు బ్యాటరీ ఎంపికలలో వస్తుంది.
మొదటిది - RWD వేరియంట్, దీనిలో 60kWh బ్యాటరీ ఉంటుంది & పూర్తిగా ఛార్జ్ చేస్తే దాదాపు 500 కిలోమీటర్లు నడవగలదు.
రెండోది - Long Range RWD వేరియంట్, దీనిలో 75kWh బ్యాటరీ ఉంటుంది & ఫుల్ ఛార్జ్‌తో దాదాపు 622 కి.మీ. డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది.
భారతదేశంలో మోడల్ Y ఎలక్ట్రిక్ కారు ఆన్-రోడ్ ధర, వేరియంట్‌ను బట్టి రూ. 61.07 లక్షల నుంచి రూ. 69.15 లక్షల వరకు ఉంటుంది.
టెస్లా మోడల్ Y లో మీరు ఊహించలేని స్మార్ట్ & టెక్నాలజీ-రిచ్ ఫీచర్లు అందించారు. ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వల్ల కారును సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండానే అప్‌డేట్ చేయవచ్చు. టెస్లా మొబైల్ యాప్ ద్వారా ఈ కారును మీ మొబైల్ నుంచి నియంత్రించవచ్చు. టెస్లా మోడల్ Y లో ప్రీమియం సౌండ్ సిస్టమ్ ఉంది, ఇది సంగీత ప్రియులకు మరిచిపోలేని అనుభవాన్ని ఇస్తుంది. ఈ లక్షణాలన్నింటి కారణంగా, టెస్లా మోడల్ Y టెక్నాలజీ-ఫస్ట్ ఎలక్ట్రిక్ SUVగా గుర్తింపు పొందింది.





















