అన్వేషించండి

BYD SEAL: బీవైడీ కొత్త ఎలక్ట్రిక్ కారు మార్చి 5న లాంచ్ - ధర ఎంత ఉండనుంది?

BYD New Car: ప్రముఖ కార్ల బ్రాండ్ బీవైడీ మనదేశంలో కొత్త ఎలక్ట్రిక్ కారును మార్చి 5వ తేదీన లాంచ్ చేయనుంది.

BYD SEAL Launch in India: బీవైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్స్) భారతదేశంలో తన మూడో కారును మార్చి 5వ తేదీన లాంచ్ చేయనుంది. ఈ రాబోయే సీల్ ఈవీ గురించిన కీలక వివరాలు బయటకు వచ్చాయి. బీవైడీ సీల్ సీబీయూ యూనిట్‌గా భారతదేశానికి వస్తుంది. అంటే పూర్తిగా బయట దేశంలో తయారై ఇంపోర్ట్ ద్వారా మనదేశానికి రానుందన్న మాట. ఈ కారుకు సంబంధించి డీలర్లు ఇప్పటికే అనధికారిక బుకింగ్‌లు తీసుకోవడం ప్రారంభించారు. సీల్ భారతదేశంలో మొదటిసారిగా ఒక సంవత్సరం క్రితం 2023 ఆటో ఎక్స్‌పోలో లాంచ్ అయింది.

భారతదేశంలో బీవైడీ సీల్ 82.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో అందించనున్నారు. ఇది వెనుక చక్రాల డ్రైవ్ కాన్ఫిగరేషన్‌తో 570 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనున్నారు. వెనుక వైపు యాక్సిల్‌పై ఉన్న పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ 230 హెచ్‌పీ పవర్‌ని, 360 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేయగలదు. 2055 కిలోల బరువున్న ఈ కారు కేవలం 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది.

ఇతర బీవైడీ కార్ల మాదిరిగానే దీని బ్యాటరీ బీవైడీ పేటెంట్ బ్లేడ్ సెల్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇది 150 కేడబ్ల్యూ వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. దీని కారణంగా ఈ కారు 37 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయనున్నారు. సాధారణ 11 కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్‌ని ఉపయోగిస్తే 0 నుంచి 100 శాతం ఛార్జ్ అవ్వడానికి 8.6 గంటలు పడుతుంది. ఈ స్పెక్స్ ఎంట్రీ-లెవల్ ఆర్‌డబ్ల్యూడీ వేరియంట్ కోసం అయినప్పటికీ డ్యూయల్ మోటార్ వేరియంట్ 530 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేయనుంది. 520 కిలోమీటర్ల రేంజ్‌తో ఏడబ్ల్యూడీ సిస్టంను కూడా అందించే అవకాశం ఉంది.

బీవైడీ సీల్ ఫీచర్లు ఇలా...
డిజైన్ గురించి చెప్పాలంటే ఈ కారు బీవైడీ "ఓషన్ ఈస్తటిక్స్" డిజైన్ లాంగ్వేజ్‌తో వస్తుంది. సీల్ కూపే లాంటి ఆల్ గ్లాస్ రూఫ్, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, నాలుగు బూమరాంగ్ ఆకారపు ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్, వెనుకవైపు పూర్తి వెడల్పు ఎల్ఈడీ లైట్ బార్ వంటి డిటైల్స్‌ను కూడా పొందుతుంది.

లోపలి భాగంలో బీవైడీ సీల్ సెంటర్ కన్సోల్ తిరిగే 15.6 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేను పొందుతుంది. ఇందులో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్రైవర్ కోసం హెడ్ అప్ డిస్‌ప్లే ఉంది. ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ చుట్టూ సెంట్రల్ ఏసీ వెంట్ ఉంది. దాని క్రింద డ్రైవ్ సెలెక్టర్, విభిన్న డ్రైవ్ మోడ్‌లను ఎంచుకోవడానికి స్క్రోల్ వీల్ ఉంటుంది. సెంటర్ కన్సోల్‌లో హీటెడ్ విండ్‌స్క్రీన్, ఆడియో సిస్టమ్ కోసం వాల్యూమ్ కంట్రోల్స్, రెండు వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ల వంటి బేసిక్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి.

బీవైడీ సీల్ ధర ఎంత ఉండవచ్చు?
బీవైడీ సీల్ ఎక్స్ షోరూమ్ ధర దాదాపు రూ. 50 లక్షలుగా ఉండవచ్చని అంచనా. అంటే ఈ కారు రూ. 45.95 లక్షల ధర కలిగిన హ్యుందాయ్ అయోనిక్ 5తో పోటీపడుతుంది. అయోనిక్ 5 అనేది 217 హెచ్‌పీ పవర్ అవుట్‌పుట్‌ అందించే ఆర్‌డబ్ల్యూడీ మోటార్‌తో రానుంది. ఈ కారులో 72.6 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ అందించనున్నారట. ఏకంగా 630 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనున్నట్లు సమాచారం.

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

టాప్ హెడ్ లైన్స్

ఫుల్ ఛార్జ్‌పై 421 కి.మీ రేంజ్.. Tata Punch EVపై రూ.1.45 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్
ఫుల్ ఛార్జ్‌పై 421 కి.మీ రేంజ్.. Tata Punch EVపై రూ.1.45 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్
Tata Curvv EVలో ప్లస్‌ పాయింట్లతో పాటు కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయి! కొనే ముందు ఓసారి ఆలోచించండి
Tata Curvv EV కొనడం తెలివైన పనేనా? ఈ కారులో ప్లస్‌లు, మైనస్‌లు ఏంటి?
రికార్డు సృష్టించిన TVS - వెనుకబడిన Ola.. ఎలక్ట్రిక్‌ స్కూటర్ల అమ్మకాల్లో టాప్ 10 కంపెనీలు ఇవే!
గత నెల రోజుల్లో మిడిల్‌క్లాస్‌ వాళ్లు ఎక్కువగా కొన్న ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే
కొత్త ఎలక్ట్రిక్‌ కారు కొనబోతున్నారా? Tata EVల్లో చాలా మోడళ్లపై కచ్చితమైన బెనిఫిట్స్‌!, ఈ నెల మాత్రమే
గుడ్‌న్యూస్‌ బాసూ! టాటా EVలపై భారీ ఆఫర్లు.. కర్వ్‌ కొంటే ఏకంగా రూ.3.35 లక్షల బెనిఫిట్!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Embed widget