BMW F 450 GS అడ్వెంచర్ బైక్స్ లైనప్‌లోకి స్పోర్ట్ వేరియంట్.. టాప్ మోడల్ ఫీచర్లు, కొత్త ధరలివే!
బీఎండబ్ల్యూ F 450 GS స్పోర్ట్ వేరియంట్ భారత్‌లో విడుదలైంది. రేసింగ్ రెడ్ రంగు, ప్రత్యేక ఫీచర్లు, నాలుగు వేరియంట్ల కొత్త ధరల వివరాలు తెలుసుకోండి.

BMW F 450 GS Sport Variant: బీఎండబ్ల్యూ మోటరాడ్, భారత్‌లో తన F 450 GS మోడల్ సిరీస్‌ను మరింత విస్తరించింది. ఈ అడ్వెంచర్ బైక్‌లో కొత్తగా స్పోర్ట్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. ప్రత్యేకమైన రేసింగ్ రెడ్ రంగులో అందుబాటులోకి వచ్చిన ఈ మోడల్‌కు స్పోర్టీ లుక్ అందించారు. ఇప్పటికే బేస్, ఎక్స్‌క్లూజివ్, జీఎస్ ట్రోఫీ వేరియంట్లలో లభిస్తున్న F 450 GS సిరీస్‌లోకి ఇప్పుడు నాలుగో ఆప్షన్‌గా స్పోర్ట్ చేరింది.
BMW F 450 GS స్పోర్ట్ వేరియంట్ ధర ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ.5.90 లక్షలు. ఇది టాప్-స్పెక్ జీఎస్ ట్రోఫీ వేరియంట్ కంటే దిగువన ఉంటుంది. అయితే, ఇందులో అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఈజీ రైడ్ క్లచ్ (ERC) వద్దనుకునే రైడర్లకు ఇది మరో ఎంపికగా నిలుస్తుంది.
స్పోర్ట్ వేరియంట్‌లో ప్రత్యేక ఫీచర్లు
F 450 GS స్పోర్ట్ వేరియంట్‌లో స్పోర్ట్ సస్పెన్షన్‌ను అందించారు. గేర్ షిఫ్ట్ అసిస్టెంట్ ప్రో, రైడింగ్ మోడ్స్ ప్రో వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవి రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడంలో సహాయపడతాయి.
అడ్వెంచర్ రైడింగ్‌కు ఉపయోగపడేలా కొన్ని ప్రత్యేక పరికరాలను కూడా ఇందులో ఇచ్చారు. ఆఫ్-రోడ్ ఫుట్‌రెస్టులు, పారదర్శకమైన ర్యాలీ విండ్‌స్క్రీన్, నలుపు రంగు హ్యాండ్ ప్రొటెక్టర్లు ఇందులో ఉన్నాయి. ఇంజిన్ కింద రక్షణ కల్పించేందుకు ప్లాస్టిక్ ఇంజిన్ గార్డ్‌ను కూడా అమర్చారు.
ఈ ఫీచర్లతో స్పోర్ట్ వేరియంట్ రోడ్లపై ప్రయాణంతో పాటు ఆఫ్-రోడ్ రైడింగ్‌కు కూడా అనువుగా ఉండేలా రూపొందించారు. జీఎస్ ట్రోఫీ వేరియంట్‌లో ఉన్న చాలా ఫీచర్లు ఇందులోనూ ఉన్నాయి. అయితే, ఈజీ రైడ్ క్లచ్ (ERC) మాత్రం ఇందులో అందుబాటులో లేదు. ఈ ఫీచర్ అవసరం లేని వారు ఇప్పుడు స్పోర్ట్ వేరియంట్‌ను ఎంచుకోవచ్చు.
ఇది కూడా చదవండి: E20 పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం.. ఎక్కువ ఇథనాల్ కలుపుతున్నారని, రిపేర్లు పెరిగాయని ఆరోపణ
బీఎండబ్ల్యూ F 450 GS కొత్త ధరలు ఇవే
బీఎండబ్ల్యూ F 450 GSను భారత్‌లో ఏప్రిల్‌లో లాంచ్ చేసినప్పుడు బేస్ వేరియంట్ ధర రూ.4.70 లక్షలుగా ఉండేది. ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ ధర రూ.4.90 లక్షలు కాగా, జీఎస్ ట్రోఫీ ధర రూ.5.30 లక్షలుగా నిర్ణయించారు. అయితే, ప్రస్తుతం ఈ మోడల్ ధరలు పెరిగాయి. బేస్ వేరియంట్ ధర ఇప్పుడు రూ.5.35 లక్షల నుంచి ప్రారంభమవుతోంది.
బేస్ వేరియంట్ కొత్త ధర ----- రూ.5.35 లక్షలు
ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ కొత్త ధర ----- రూ.5.55 లక్షలు
స్పోర్ట్ వేరియంట్ కొత్త ధర ----- రూ.5.90 లక్షలు
జీఎస్ ట్రోఫీ వేరియంట్ కొత్త ధర ----- రూ.6.15 లక్షలు
కొత్త ధరల ప్రకారం జీఎస్ ట్రోఫీ టాప్ వేరియంట్‌గా కొనసాగుతోంది. దాని కంటే రూ.25,000 తక్కువ ధరకు స్పోర్ట్ వేరియంట్ అందుబాటులో ఉంది. అయితే, ఈ రెండు మోడళ్ల మధ్య ప్రధాన తేడా 'ఈజీ రైడ్ క్లచ్' (ERC) ఫీచర్.
ఇది కూడా చదవండి: 204cc ఇంజిన్, 26hp పవర్‌తో Yamaha R2.. యూత్ స్పీడ్‌కు తగ్గ యాక్సిలరేషన్, బ్రేకింగ్ ఉన్నట్లేనా?
కొనుగోలుదారులకు మరో ఎంపిక
F 450 GS శ్రేణిలో స్పోర్ట్ వేరియంట్ రాకతో కొనుగోలుదారులకు మరిన్ని ఎంపికలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా.. జీఎస్ ట్రోఫీ తరహా ఫీచర్లు కావాలి, ERC మాత్రం వద్దనుకునే వారికి ఈ మోడల్ ఉపయోగపడుతుంది. రేసింగ్ రెడ్ రంగు, స్పోర్ట్ సస్పెన్షన్, ఆఫ్-రోడ్ పరికరాలు దీని ప్రత్యేకతలుగా నిలుస్తాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















