అన్వేషించండి

సిటీలో రోజూ 20km డ్రైవ్‌ చేసే 40+ ఏజ్‌ వాళ్లకు రూ.30-40 లక్షల్లో Jeep Meridian ఎందుకు బెస్ట్‌?

రోజూ 20 km డ్రైవ్‌ చేసేందుకు, ఏడాదిలో ఒకటి-రెండు సార్లు 1000 km లాంగ్ ట్రిప్స్‌ వేసే ప్రొఫెషనల్స్‌కి రూ.30-40 లక్షల బడ్జెట్‌లో Jeep Meridian ఎందుకు బెస్ట్‌ ఎంపికో ఇక్కడ వివరిస్తున్నాం.

Jeep Meridian Review 2025: కారు కొనేప్పుడు... ప్రతిరోజూ ఉపయోగం ఎంత, ఏడాదిలో ఎంతదూరం లాంగ్ ట్రిప్స్‌కి వెళ్లాలి, బడ్జెట్‌ ఎంత, కారులో లగ్జరీ ఫీలింగ్‌ ఉండాలి వంటి విషయాలను ప్రతి ఒక్కరూ చూసుకుంటారు. మీరు రోజూ సుమారు 20 కిలోమీటర్లు డ్రైవ్‌ చేస్తూ, సంవత్సరంలో ఒకటి-రెండు సార్లు 1000 కిలోమీటర్ల లాంగ్ డ్రైవ్‌ ప్లాన్‌ చేస్తే, రూ.30-40 లక్షల బడ్జెట్‌లో మీకు పర్ఫెక్ట్‌గా సరిపడే SUVల్లో జీప్ మెరిడియన్ ముందు వరుసలో నిలుస్తుంది.

జీప్ మెరిడియన్ ఎందుకు?
మొదటి మాట - జీప్‌ అనే బ్రాండ్‌కే ఒక ప్రత్యేకమైన విలువ ఉంది. రోడ్డుపై నడిపినప్పుడు లగ్జరీ & ప్రీమియం ఫీలింగ్‌ ఇస్తుంది. పైగా మెరిడియన్‌ 5-సీటర్‌, 7-సీటర్‌ రెండు వేరియంట్లలో దొరుకుతుండటం మంచి లాభం. చిన్న కుటుంబం అయినా, పెద్ద కుటుంబం అయినా, మీ అవసరానికి సరిపోయే కాన్ఫిగరేషన్‌ తీసుకోవచ్చు.

శక్తిమంతమైన 2.0 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్
మెరిడియన్‌ హార్ట్‌ 2.0 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌. ఇది ప్రశాంతంగా, సాఫ్ట్‌గా నడుస్తూనే శక్తిమంతమైన పెర్ఫార్మెన్స్‌ ఇస్తుంది. సిటీ డ్రైవింగ్‌లో జంప్‌ కావాలన్నా, హైవేపై 120 కి.మీ. స్పీడ్‌తో కూడా స్మూత్‌ క్రూయిజ్‌ కావాలన్నా ఈ ఇంజిన్‌ నచ్చక మానదు. రోజూ 20 కి.మీ. డ్రైవ్‌ చేసేవాళ్లను ఇది అస్సలు ఇబ్బంది పెట్టదు. స్టార్ట్‌–స్టాప్‌ ట్రాఫిక్‌లో కూడా ఇంజిన్ రెస్పాన్స్‌ బాగా విభిన్నంగా ఉంటుంది.

9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ - ఈ క్లాస్‌లో బెస్ట్‌
మెరిడియన్‌లో ఉన్న 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ చాలా స్మూత్‌గా పని చేస్తుంది. గేర్‌ మార్పులు ఆలస్యం లేకుండా, సైలెంట్‌గా జరుగుతాయి. ఇది సిటీ డ్రైవింగ్‌లో పెద్ద ప్రయోజనం. పైగా లాంగ్‌ ట్రిప్‌లో గంటల తరబడి డ్రైవ్‌ చేస్తూ ఉన్నా డ్రైవర్‌కి అలసట రాకుండా సాఫ్ట్‌ డ్రైవింగ్ అనుభవం ఇస్తుంది.

సిటీ డ్రైవింగ్‌లో ఈజీ
ఎత్తైన SUV అయినప్పటికీ, మెరిడియన్‌ స్టీరింగ్‌ చాలా లైట్‌. యూ-టర్న్‌లు, ట్రాఫిక్‌లో లేన్లు మార్చడం, పార్కింగ్‌ వంటివన్నీ ఆశ్చర్యకరంగా ఈజీగా జరిగిపోతాయి. రోజూ దాదాపు 20 కి.మీ. డ్రైవ్‌ చేసే డాక్టర్లు, ఇంజినీర్లు, టెకీలు, ఇతర ప్రొఫెషనల్స్‌ తమ పని ప్రదేశాలకు త్వరగా వెళ్లేందుకు ఈ కారు చాలా సౌకర్యంగా అనిపిస్తుంది.

హైవేలో కంఫర్ట్‌ + స్టెబిలిటీ అద్భుతం
1000 కి.మీ. లాంగ్ డ్రైవ్‌కి వెళ్లినప్పుడు కారు రోడ్డుపై స్థిరంగా ఉండాలి. బాడీ రోల్‌ తక్కువగా ఉండాలి. క్యాబిన్‌ నాయిస్‌ ఇబ్బంది పెట్టకూడదు. మెరిడియన్‌ ఈ మూడు విషయాల్లోనూ టాప్‌ క్లాస్‌. హైవేలో 100+ కి.మీ. వేగంలో కూడా ఈ కారు చాలా స్టేబుల్‌గా ఉంటుంది. సస్పెన్షన్‌ ట్యూనింగ్‌ అద్భుతంగా ఉండటం వల్ల రోడ్‌ బంప్స్‌ పెద్దగా అనిపించవు.

ఇంటీరియర్‌ - ప్రీమియం, లగ్జరీ
లగ్జరీ అనిపించే కారు కావాలంటే, ఇంటీరియర్‌ క్వాలిటీ చాలా ముఖ్యం. మెరిడియన్‌ క్యాబిన్‌ నిజంగా ప్రీమియం రేంజ్‌లో ఉంటుంది. సీట్లు సపోర్టివ్‌గా, లెదర్‌ క్వాలిటీ బెస్ట్‌గా, డాష్‌బోర్డ్‌ లేఅవుట్‌ మోడర్న్‌గా ఉంటుంది. లాంగ్‌ జర్నీల్లో సీటింగ్‌ కంఫర్ట్‌ కూడా చాలా బాగుంది.

ఫీచర్లు కూడా ఫుల్‌
వెంటిలేటెడ్‌ సీట్లు, 10.1-ఇంచ్ టచ్‌స్క్రీన్‌, 360° కెమెరా, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్‌, అడ్వాన్స్‌డ్‌ సేఫ్టీ ఫీచర్లు - ఇవన్నీ ఈ SUVలో అందుబాటులో ఉంటాయి.

మీరు మధ్యవయసులో (40+ ఏజ్‌) ఉన్న ప్రొఫెషనల్ అయితే... రోజూ సిటీ డ్రైవ్‌లో ఈజీగా నడిచే, లాంగ్ ట్రిప్‌లో స్థిరంగా, కంఫర్ట్‌గా అనిపించే, బ్రాండ్ విలువ ఉన్న లగ్జరీ SUV కావాలంటే Jeep Meridian మీ బడ్జెట్‌లో స్మార్ట్‌ ఎంపిక అని చెప్పొచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
మారుతి బలెనో కొనేవాళ్లు కొన్ని రోజులు ఆగండి, సెప్టెంబర్‌ 5న వచ్చే కొత్త మోడల్‌లో కీలక మార్పులు!
మారుతి బలెనోకు కొత్త లుక్‌ - సన్‌రూఫ్‌, యాంబియంట్‌ లైటింగ్‌ సహా చాలా కొత్త ఫీచర్లు
ఒకే ఛాసిస్‌.. కానీ లుక్‌, ఇంటీరియర్‌, ఫీచర్లలో భారీ తేడాలు.. మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌!
మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌ మధ్య ఇంత తేడానా? కొత్త పికప్‌ ట్రక్‌లో మారినవేంటో తెలుసా?
BE 6 రేసింగ్‌ లుక్‌ను పక్కన పెట్టిన మహీంద్రా.. త్రివర్ణాలు, 540 డిగ్రీల కెమెరాతో కొత్త 'ఫ్రీడమ్‌ ఎడిషన్‌'
ఆగస్టు 15 సందర్భంగా మహీంద్రా BE 6కు కొత్త లుక్‌.. ఫార్ములా ఈ ఫ్రీడమ్‌ ఎడిషన్‌లో ప్రత్యేక మార్పులు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget