Budget CNG Cars: బైక్స్ కంటే ఎక్కువ మైలేజీ ఇచ్చే సీఎన్‌జీ కార్లు- రోజువారి పనుల కోసం ది బెస్ట్!
Best CNG Cars: మార్కెట్‌లో తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ అందించే కార్లు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో మారుతి ఆల్టో K10, మారుతి సెలెరియో, టాటా ఐసీఎన్‌జీ కార్లు ఉన్నాయి. ఇవి 34 కి.మీ మైలేజీని అందిస్తాయి.
Top CNG Cars for Daily Use: దేశంలో సీఎన్‌జీ కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. దీంతో కంపెనీలు సైతం తమ లైనప్స్‌లోని ఫేమస్ కార్లను సీఎన్‌జీ వెర్షన్‌లో ప్రవేశపెడుతున్నాయి. ఎందుకంటే ఇవి ఎక్కువ మైలేజీని అందించడం వల్ల జనాలు ఈ వెర్షన్స్‌కి షిఫ్ట్ అవుతున్నారు. తక్కువ ధరలో రోజువారీ వినియోగం కోసం కిలో సీఎన్‌జీతో దాదాపు 30 కిలోమీటర్లకు పైగా కచ్చితమైన మైలేజీని అందిస్తాయి. అంతే కాకుండా పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్లతో పోల్చితే వీటి మెయింటైనెన్స్ కూడా చాలా తక్కువ. మీరు కూడా బడ్జెట్‌లో సీఎన్‌జీలోకి మారాలనుకుంటే మేము మీకు కొన్ని బెస్ట్ కార్లను ఇక్కడ అందిస్తున్నాం.
మారుతి సుజుకి ఆల్టో K10 సీఎన్‌జీ
ఈ జాబితాలోని తొలి కారుగా మారుతి సుజుకి ఆల్టో K10 సీఎన్‌జీ ఉంది. ఈ ఆల్టో K10 ప్రస్తుతం భారతదేశంలో అత్యంత చౌకైన సీఎన్‌జీ. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 5 లక్షల 96 వేలుగా ఉంది. ఈ కారు సిటీ డ్రైవింగ్‌కి అనువుగా ఉంటుంది. డిజైన్‌లో చిన్నగా ఉండటంతో ట్రాఫిక్‌లలోనూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభంగా ప్రయాణిస్తుంది. ఇది ముఖ్యంగా చిన్న కుటుంబాలకు సరిపోతుంది. ఈ పొట్టి కారులో నలుగురు హాయిగా కూర్చోని ప్రయాణించవచ్చు.
ఈ మారుతి సుజుకి ఆల్టోలో ఏసీ, ఫ్రంట్ పవర్ విండోస్, పార్కింగ్ సెన్సార్స్, సెంట్రల్ కన్సోల్ ఆర్మ్‌రెస్ట్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, అడ్జస్టబుల్ హెడ్‌ల్యాంప్స్, హాలోజెన్ హెడ్ ల్యాంప్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్స్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వంటి ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
మారుతి సుజుకి సెలెరియో సీఎన్‌జీ
ఈ జాబితాలోని రెండో కారుగా ఉన్న మారుతి సుజుకి సెలెరియో కిలోకు సీఎన్‌జీకి 34.43 కిలోమీటర్ల మైలేజ్‌ని అందిస్తుంది. ఈ లైనప్స్‌లోనే అత్యంత ఎక్కువ మైలేజీని అందించే కారుగా ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.6.69 లక్షలుగా ఉంది. దీని రన్నింగ్ కాస్ట్ మోటార్ సైకిల్ నడపడానికి అయ్యే ఖర్చు కంటే తక్కువగా ఉండటం గమనార్హం. కావున ఇంధన ఖర్చులను తగ్గించుకోవాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్‌గా ఉంటుంది. ఈ కారులో ఐదుగురు సులభంగా కూర్చోని ప్రయాణించవచ్చు. ఇది తక్కువ బడ్జెట్‌లో భారీ లుక్‌ని కలిగి ఉంటుంది. ఇక సేఫ్టీ కోసం కారులో EBD, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో ఇది మంచి సేఫ్టీని అందిస్తుంది.
టాటా టియాగో సీఎన్‌జీ
టాటా టియాగో ఐసీఎన్‌జీ కిలోకు 27 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ కారులో మీరు ఐదుగురు కూర్చునేలా సీటింగ్ అరేంజ్‌మెంట్ ఉంది. ఇది 1.2 లీటర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది సీఎన్‌జీ మోడ్‌లో 73 bhp పవర్ 95 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ని అందించారు. టాటా కంపెనీ నుంచి అత్యంత చౌకైన సీఎన్‌జీ కారుగా టియాగో ఉంది. ఇది పెట్రోల్, ఎలక్ట్రిక్ వెర్షన్‌లోనూ అందుబాటులో ఉంది. అయితే దీని సీఎన్‌జీ వెర్షన్ ధర రూ. 8 లక్షలుగా ఉంది.
Also Read: రూ.10 లక్షల్లోపు బెస్ట్ 5 సీటర్ కార్లు ఇవే - టాప్-3లో ఏ కార్లు ఉన్నాయి?