Best 5 Seater Cars in India: రూ.10 లక్షల్లోపు బెస్ట్ 5 సీటర్ కార్లు ఇవే - టాప్-3లో ఏ కార్లు ఉన్నాయి?
Best 5 Seater Cars: మనదేశంలో 5 సీటర్ కార్లకు ఎక్కువగా డిమాండ్ పెరుగుతోంది. రూ.10 లక్షల్లోపు ధరలో టాటా కర్వ్, మారుతి సుజుకి ఫ్రాంక్స్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో మంచి కార్లు అనుకోవచ్చు.
Budget Friendly 5 Seater Cars: దేశంలో కార్లకు డిమాండ్ కాలక్రమేణా పెరుగుతోంది. భారతదేశంలో ప్రజలు ఎక్కువగా 5 సీటర్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. సామాన్యుల బడ్జెట్‌లో ఈ సెగ్మెంట్‌లో అనేక శక్తివంతమైన కార్లు అందుబాటులో ఉన్నాయి. భారతీయ మార్కెట్లో ఈ జాబితాలో టాటా మోటార్స్, మారుతి సుజుకి, మహీంద్రా కార్లు ఉన్నాయి. ఈ కంపెనీల 5 సీటర్ వాహనాల ధర కూడా రూ.10 లక్షల రేంజ్‌లో ఉంది.
టాటా కర్వ్ (Tata Curvv)
టాటా కర్వ్ రూ. 10 లక్షల రేంజ్‌లో సరికొత్త మోడళ్లలో ఒకటి. టాటా మోటార్స్ లాంచ్ చేసిన ఈ కారు పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కారు ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. టాటా కర్వ్ ఎక్స్ షోరూమ్ ధర రూ.9.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఈ కారు ఏకంగా 34 వేరియంట్లలో భారత మార్కెట్లోకి ప్రవేశించింది.
టాటా కర్వ్ లాంచ్ చేసిన ఈ మోడల్ డిజిటల్ స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉంది. ఈ కారు మల్టీ కలర్ మూడ్ లైటింగ్ ఫీచర్‌తో వస్తుంది. టాటా కారులో సెక్యూరిటీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఈ కారులో క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ కూడా అందించారు.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే
మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx)
మారుతి సుజుకి ఫ్రాంక్స్ 10 కలర్ వేరియంట్లలో మార్కెట్లో లభ్యమవుతోంది. ఈ కారు లోపలి భాగంలో డ్యూయల్ టోన్ థీమ్ ఉంది. ఈ కారులో 360 డిగ్రీ వ్యూ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, హెడ్ అప్ డిస్‌ప్లే కూడా ఉన్నాయి. ఈ కారులో తొమ్మిది అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ సిస్టమ్ ఉంది.
ఈ మారుతి కారులో 1.0 లీటర్ టర్బో బూస్టర్ జెట్ ఇంజన్ కలదు. దీంతో పాటు అధునాతన 1.2 లీటర్ కే సిరీస్ డ్యూయల్ జెట్ ఇంజన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీని కూడా కారులో ఉపయోగించారు. మారుతి ఫ్రాంక్స్ ఎక్స్ షోరూమ్ ధర రూ.8,37,500 నుంచి ప్రారంభమవుతుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో (Mahindra XUV 3XO)
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో కూడా మంచి 5 సీటర్ కారు. మహీంద్రా ఈ సంవత్సరమే ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వోను మన దేశ మార్కెట్లోకి విడుదల చేసింది. లాంచ్ అయిన సమయం నుంచి ఈ కారుకు మార్కెట్లో మంచి హైప్ వచ్చింది. మొదటి నెలలోనే ఈ కారుకు సంబంధించి ఏకంగా 10 వేల మోడల్స్ బుక్ అయిపోవడం విశేషం. ఈ కారులో స్కైరూఫ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో 16 కలర్ వేరియంట్లలో మార్కెట్లో లభ్యమవుతోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి