Premsagar Rao: నా హత్యకు కుట్ర పన్నారు, ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు- ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్
Mancherial MLA Premsagar Rao | మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. నిబంధనల ప్రకారమే కూల్చివేతలు జరిగాయని తెలిపారు.
Mancherial News Updates | మంచిర్యాల: కొందరు నన్ను హత్య చేసేందుకు కుట్ర పన్నారు, తప్పు చేసేది ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ (Premsagar Rao) హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ కలెక్టర్ కార్యాలయం సమీపంలోని టీబీజీకేఎస్ నేత ఢీకొండ అన్నయ్య భవనం అక్రమ నిర్మాణమన్న కారణంగా నిబంధనల ప్రకారం కూల్చివేశారని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ తెలిపారు.
మాజీ ఎమ్మెల్యేది అసత్య ప్రచారమే
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సోమవారం తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు విశ్వసించరని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే భవనం ప్రభుత్వ భూమి పరిధిలో ఉందని అప్పటి తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. అయితే అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల అక్రమాలకు దివాకర్ రావు కొమ్ముకాశారని ఆరోపించారు. మున్సిపాలిటీలో, మున్సిపల్ ఆఫీసులో ఉద్యోగాలు ఇప్పిస్తానని కౌన్సిలర్ హరికృష్ణ డబ్బులు తీసుకుని పని ఇప్పించకపోగా, డబ్బులు తిరిగి ఇవ్వలేదని బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దానిపై పోలీసులు చర్యలు తీసుకున్నారని తెలిపారు.
బేర సత్యనారాయణపై అనేక ఫిర్యాదులు ఉండగా బాధితుల పక్షాన నిలవకపోగా దివాకర్ రావు రోడ్లపై ఆందోళన చేయడం శోచనీయమని అన్నారు. లక్సెట్టిపేటలో ముత్తె సత్తయ్య, దండేపల్లిలో అజ్మీర హరినాయక్ అనే బిఆర్ఏస్,బీజేపీ నాయకులు భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపించారు. తప్పు ఎవరు చేసినా చట్టపరమైన చర్యలు ఉంటాయని కాంగ్రెస్ నేత ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. తాను ప్రజల పక్షాన ఉంటాను తప్ప తప్పులు చేసే వారికి మద్దతు ఇవ్వనన్నారు. మంచిర్యాలలో ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల సౌకర్యం కోసం కొంత కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పడం లేదని అన్నారు.
గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం
మంచిర్యాలలో గంజాయి అమ్మకం, సేవించడాన్ని తాను తీవ్రంగా పరిగనిస్థానని అన్నారు. గంజాయి ఆనవాళ్లు మంచిర్యాలలో కనిపించవచ్చ వద్దని పోలీస్ లను ఇప్పటికే ఆదేశించడం జరిగిందన్నారు. స్వపక్షం, విపక్షం అనే భేదం లేదని గంజాయి కేసులో ఎవరు పట్టుబడిన చట్ట పరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. రాత్రి యువకులు బయట తిరగవద్దని సూచించారు.
మాతా, శిశు ఆసుపత్రికి అనుమతి
మంచిర్యాల ఐబీ స్థలంలో మాతా శిశు ఆసుపత్రి నిర్మాణంకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. కొద్దీ రోజుల్లో నిర్మాణం పనులు చేపడుతామని ఆయన పేర్కొన్నారు.