Laapataa Ladies for Oscar | లాపతా లేడీస్ మూవీ కథేంటి? | ABP Desam
లాపతా లేడీస్.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఈ సినిమా పేరు మార్మోగుతోంది. ఎందుకు? అంటే... ప్రతి ఏడాది ఆస్కార్ అవార్డులకు మన దేశం నుంచి అధికారికంగా ఓ సినిమాను పంపుతుంది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ప్రభాస్ పాన్ ఇండియా మూవీ 'కల్కి 2898 ఏడీ', రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్' సినిమాలను కాదని మరీ లాపతా లేడీస్ ను ఎంపిక చేశారు. ఈ సినిమా విశేషాలు ఏంటో తెలుసా? ఆమిర్ ఖాన్ మాజీ భార్య ఈ సినిమా తీశారు. నార్త్ ఇండియాలోని సంస్కృతీ సంప్రదాయాలు, వివాహ వ్యవస్థపై సున్నిత విమర్శ చేస్తూ తీసిన సినిమా 'లాపతా లేడీస్'. కొత్తగా పెళ్లైన జంటలు ఒక రైలులో వెళ్తుండగా వారికి ముఖం కనిపించకుండా ముసుగు వేస్తారు. వారందరి వస్త్రధారణ ఒకేలా విధంగా ఉంటుంది. గమ్యం చేసేసరికి ఒకరి భార్యకు బదులు మరొకరు ఉంటారు. కట్టుకున్న భార్యలు తప్పిపోతారు. ఇలా ఎందుకు జరిగిందనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఆస్కార్ ఎంట్రీ కోసం రేసులో 'కల్కి 2898 ఏడీ', 'యానిమల్' 'హను - మాన్', 'మంగళవారం' సినిమాలు కూడా పోటీ పడ్డాయి. తమిళం నుంచి 'తంగలాన్', 'మహారాజా', మలయాళం నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన 'ఆడు జీవితం' వంటివి కూడా ఉన్నాయి. పోటీలో వాటన్నటినీ దాటుకుని 'లాపతా లేడీస్' ఆస్కార్ ఎంట్రీకి ఎంపిక అయ్యింది.