Best Big SUV: ₹25-28 లక్షల బడ్జెట్‌లో కంఫర్ట్, బాస్ లుక్ ఇచ్చే భారీ SUV - మీ కోసం ఆల్-ఇన్-వన్ ఆప్షన్ ఇదే
₹25–28 లక్షల బడ్జెట్‌లో పెద్ద, ఆకర్షణీయమైన, రగ్గ్డ్ SUV కావాలనుకునే వారికి Mahindra Scorpio N Carbon Edition ఉత్తమ ఎంపిక. శక్తిమంతమైన ఇంజిన్, సాఫ్ట్ రైడ్, నిజమైన రోడ్ ప్రెజెన్స్ అందిస్తుంది.

Best Big SUV India 2025: ₹25-28 లక్షల బడ్జెట్‌లో ఒక పెద్ద, ఆకర్షణీయమైన, రగ్డ్ SUV కొనాలని అనుకునే వారికి Mahindra Scorpio-N 2WD Diesel Automatic, ముఖ్యంగా Carbon Edition, నిజంగా సరైన ఎంపిక. రోడ్డుపైకి ఎక్కితే చాలు... ఈ SUV ఇచ్చే రోడ్ ప్రెజెన్స్ మిగతా వాహనాల కంటే స్పష్టంగా బలంగా ఉంటుంది. బిజినెస్ ఓనర్స్, ప్రొఫెషనల్స్ సహా... రెస్పెక్ట్ కమాండ్ చేసే కారు కావాలనుకునే ఎవరికైనా ఇది పర్ఫెక్ట్ మ్యాచ్.
ముందుగా సైజ్ గురించి చెప్పుకుంటే... ఈ SUV పూర్తి పొడవు, వెడల్పు, బలమైన బాడీతో నిజంగా పెద్ద సైజ్ కారు అనిపిస్తుంది. క్యాబిన్‌లోకి ఎక్కగానే మీరు చూసే రోడ్డు లుక్ మారిపోతుంది. చక్కగా ఉపయోగించగలిగే థర్డ్ రో ఉండటం దీని మరో ప్రత్యేకత. సిటీ ట్రావెల్స్ అయినా, దీర్ఘ ప్రయాణాలు అయినా - ఒక పెద్ద ఫ్యామిలీ మొత్తం కంఫర్ట్‌గా ప్రయాణించగలరు.
ఇంజిన్ విషయానికి వస్తే, స్కార్పియో-ఎన్‌లో ఇచ్చిన 2.2L టర్బో డీజిల్ Mahindra బ్రాండ్‌లోనే అత్యంత రిఫైన్ చేసిన ఇంజిన్‌లలో ఒకటి. పవర్ కూడా శక్తిమంతమైనది, అయినా దానిని అగ్రెసివ్‌గా ఫీలవ్వాల్సిన అవసరం ఉండదు. మీరు రిలాక్స్‌డ్‌గా, ఈజీగా డ్రైవ్ చేయాలనుకుంటే… ఈ ఇంజిన్, ఈ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మీకు కావాల్సిందే. గేర్ షిఫ్ట్స్ స్మూత్‌గా జరిగే విధంగా ట్యూన్ చేశారు. స్పీడ్ హఠాత్తుగా పీక్‌కు చేరకపోయినా.. స్థిరమైన, నమ్మకమైన పెర్ఫార్మెన్స్ ఇస్తుంది.
రైడ్ కంఫర్ట్ విషయానికి వస్తే… స్కార్పియో-N గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. పడవలాగా ఊగకుండా, కఠినంగా ఉండకుండా... మధ్యస్థంగా, బలమైన సస్పెన్షన్‌తో నడుస్తుంది. చెడ్డ రోడ్లు, మట్టి మార్గాలు, గుంటలు ఏవి ఉన్నా ఈ SUV తేలికగా ఎదుర్కొంటుంది. ఆఫ్ రోడ్ మోడ్ లేకపోయినా, ఆఫ్ రోడ్-ఫ్రెండ్లీ SUVగా తన పని బాగా చేస్తుంది. ఈ సస్పెన్షన్ ట్యూన్ కారణంగానే ఎక్కువ మంది స్కార్పియో-Nను లాంగ్ రైడ్స్ కోసం సెలెక్ట్ చేస్తున్నారు.
స్కార్పియో-N ఫీచర్లలో కార్బన్ ఎడిషన్ ప్రత్యేకంగా నిలుస్తుంది. డార్క్ థీమ్, గ్లాస్ బ్లాక్ ట్రీట్‌మెంట్, ప్రీమియం ఫినిష్, మోడర్న్ ఫీచర్లు అన్నీ గట్టి అట్రాక్షన్. ఇన్ఫోటైన్‌మెంట్, కనెక్టివిటీ, కంఫర్ట్ వంటివన్నీ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి.
రిలాక్సింగ్ డ్రైవ్ ఉండాలి, కానీ రోడ్డుపై ప్రెజెన్స్ కూడా గట్టిగా కనిపించాలి అనుకునే వారికి ఈ SUV కంటే బెస్ట్ లేదు. 5 సంవత్సరాలు ఉపయోగించి అమ్మినా, మహీంద్రా SUVలకు వచ్చే రీసేల్ విలువ బలంగానే ఉంటుంది.
మొత్తానికి, ₹25-28 లక్షల బడ్జెట్, డ్రైవింగ్ స్టైల్ అన్నీ చూసుకుంటే Mahindra Scorpio-N 2WD Diesel Automatic Carbon Edition ఒక ఆల్-రౌండ్ పెద్ద SUV.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.






















