(Source: ECI/ABP News/ABP Majha)
Pulsar N250 vs Gixxer 250: పల్సర్ ఎన్250 వర్సెస్ జిక్సర్ 250 - రెండిట్లో ఏది బెస్ట్?
Bajaj Pulsar N250 Price: మార్కెట్లో బడ్జెట్ స్పోర్ట్స్ బైక్ విభాగంలో మంచి పోటీ ఉంది. ఇటీవలే బజాజ్ పల్సర్ ఎన్250 కూడా ఈ సెగ్మెంట్‌లో లాంచ్ అయింది. సుజుకి జిక్సర్ 250తో ఇది పోటీ పడనుంది.
Bajaj Pulsar N250 vs Suzuki Gixxer 250: బజాజ్ దాని మునుపటి మోడల్‌తో పోలిస్తే ప్రస్తుత ఫ్లాగ్‌షిప్ పల్సర్ ఎన్250లో కొన్ని ప్రధాన అప్‌డేట్స్‌ను అందించింది. దాని కొత్త అవతార్‌లో క్వార్టర్ లీటర్ నేకెడ్ రోడ్‌స్టర్ అనేక ఫీచర్లతో వస్తుంది. స్పెసిఫికేషన్లు, ధర పరంగా దాని ప్రత్యక్ష పోటీదారు సుజుకి జిక్సర్ 250కి ఎన్ని తేడాలు ఉన్నాయో తెలుసుకుందాం.
ఇంజిన్ ఎలా ఉంది?
2024 పల్సర్ ఎన్250 ఇంజన్ స్పెసిఫికేషన్‌లో ఎలాంటి మార్పు లేదు. ఇది 24.1 బీహెచ్‌పీ పవర్‌ని, 21.5 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేసే 249 సీసీ ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ స్లిప్, అసిస్ట్ క్లచ్‌తో 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది. అయితే జిక్సర్ 250లో 249సీసీ ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. ఇది 24.1 బీహెచ్‌పీ పవర్‌ను, 21.5 ఎన్ఎం పీక్ టార్క్ అవుట్‌పుట్‌ను ఇస్తుంది. ట్రాన్స్‌మిషన్ కోసం ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది.
Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?
హార్డ్‌వేర్ తేడాలు ఇవే...
2024 బజాజ్ పల్సర్ ఎన్250 సాంప్రదాయ టెలిస్కోపిక్ ఫోర్క్స్‌కు బదులుగా అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ రూపంలో అప్‌డేట్‌ను పొందుతుంది. అయితే వెనుక సస్పెన్షన్ యూనిట్ రెండు మోడళ్లకు మోనో షాక్‌ను పొందుతుంది. జిక్సర్ 250 బ్రేకింగ్ కోసం 300 ఎంఎం ఫ్రంట్ డిస్క్‌ను పొందుతుంది. అయితే ఎన్250 ఇంకొంచెం పెద్ద 300 మిల్లీమీటర్ల ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌ను పొందుతుంది. రెండు బైక్‌లు డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌ని ప్రామాణికంగా పొందుతాయి. అయితే పల్సర్ ఎన్250 స్విచ్ చేయగల రియర్ ఏబీఎస్‌తో మెరుగ్గా ఉంటుంది.
ఫీచర్స్ పోలిక
ఫీచర్ల గురించి చెప్పాలంటే అప్‌డేట్ చేసిన పల్సర్ ఎన్250 ఇప్పుడు జిక్సర్‌కి గట్టి పోటీనిస్తుంది. రెండు బైక్‌లు బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, స్లిప్పర్ క్లచ్‌తో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను పొందుతాయి. జిక్సర్ 250 ఆప్షనల్ 12వీ ఛార్జింగ్ సాకెట్‌ను పొందుతుంది, క్వార్టర్-లీటర్ నేకెడ్ పల్సర్ యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌ను పొందుతుంది. అయినప్పటికీ జిక్సర్ 250లో ఏబీఎస్ మోడ్, ట్రాక్షన్ కంట్రోల్, పల్సర్ ఎన్250లో కనిపించే స్విచ్ చేయగల రియర్ ఏబీఎస్ లేదు.
దేని ధర ఎంత?
ధర గురించి మాట్లాడితే పల్సర్ ఎన్250 ధర... జిక్సర్ 250 కంటే రూ. 30,000 తక్కువ. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 1,50,829గా ఉంది. సుజుకి జిక్సర్ 250 ఎక్స్ షోరూమ్ ధర రూ. 1,81,400గా నిర్ణయించారు.
Feast your eyes on the badass, loaded with features to rule the streets!
— Bajaj Auto Ltd (@_bajaj_auto_ltd) April 17, 2024
The all new 2024 Edition Pulsar N250, Out now. Get yours at Rs.1,50,829/-* (Ex-Showroom Delhi) *T&Cs apply#Pulsar #N250 #Badass pic.twitter.com/cuGVbvhVZt