Auto Expo 2023 Live Updates: ఆటో ఎక్స్‌పో లైవ్ అప్‌డేట్స్ - ‘Euniq 7’ ఎంపీవిని ఆవిష్కరించిన MG మోటర్
ఇండియా ఆటో ఎక్స్ పో మార్ట్ 2023 ప్రారంభమైంది. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రారంభమైన ఈ ఆటో ఎక్స్ పోలో భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ కంపెనీలు పాల్గొంటున్నాయి
LIVE
Background
భారతదేశపు అతిపెద్ద ఆటో ఎక్స్ పో ప్రారంభమైంది. ఈ 16వ ఆటో ఎక్స్ పో నేటి నుంచి 2023 జనవరి 11 వరకు గ్రేటర్ నోయిడాలో జరగనుంది. దీనితో పాటు, ఆటో ఎక్స్ పో యొక్క కాంపోనెంట్ షో ప్రగతి మైదానంలో జరుగుతోంది. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక ఆటోమొబైల్ కంపెనీలు ఈ పెద్ద మెగా ప్రదర్శనలో పాల్గొంటున్నాయి.
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ ఎక్స్‌పోను సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. అదే సమయంలో, వారాంతాల్లో దీని సమయం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. చివరి రోజు అంటే జనవరి 18 న, సాధారణ ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సందర్శించగలరు.
రోడ్డు, మెట్రోలో ప్రయాణించి ఇండియా ఎక్స్ పో మార్ట్ 2023కి చేరుకోవచ్చు. ఒకవేళ సుదూర ప్రాంతాల నుంచి విమానంలో వచ్చిన వారైతే... ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇక్కడకు చేరుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో రైలులో వస్తున్నట్లయితే న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి సుమారు 41 కిలోమీటర్లు ప్రయాణించి ఆటో ఎక్స్ పో 2023కు చేరుకోవచ్చు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మెట్రో ద్వారా నేరుగా ఆటో ఎక్స్పోకు చేరుకోవచ్చు. నోయిడా సెక్టార్ 51కి వచ్చే ప్రజలు ఆక్వా లైన్ మెట్రో ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇతర ప్రాంతాల నుంచి రావడానికి ఢిల్లీ మెట్రో మొబైల్ యాప్ సాయం తీసుకోవచ్చు.
ప్రవేశ టిక్కెట్
మీరు ఈ మెగా ఆటో ఎక్స్ పో 2023 కు వెళ్లాలనుకుంటే టిక్కెట్లు కొనాల్సి ఉంటుంది. జనవరి 13వ తేదీకి రూ.750, జనవరి 14, 15 తేదీల్లో రూ.475గా టికెట్ ధర నిర్ణయించారు. ఈ తేదీల్లో కాకుండా 15వ తేదీ తర్వాత సందర్శించడానికి వస్తే టికెట్కు రూ.350 మాత్రమే ఖర్చు చేయాలి. అదే సమయంలో ఈ ఆటో ఎక్స్ పోలో ఐదేళ్ల వరకు పిల్లలకు టిక్కెట్లు ఉండవు. ఆటో ఎక్స్ పో 2023 టిక్కెట్లను కొనుగోలు చేయడానికి, మీరు బుక్ మై షో అధికారిక వెబ్ సైట్ లేదా యాప్ డౌన్‌లోడ్ చేసుకొని నేరుగా ఆన్ లైన్ లో టికెట్ పొందవచ్చు. ఒక టికెట్ ఒక్కసారి మాత్రమే ఉపయోగించవచ్చు.
View this post on Instagram
‘Euniq 7’ ఎంపీవిని ఆవిష్కరించిన MG మోటర్
ఆటో ఎక్స్‌పో 2023 రెండో రోజు MG మోటార్ ఇండియా 'Euniq 7' MPVని ఆవిష్కరించింది.
ఆటో ఎక్స్‌పో 2023 హైలైట్స్
⦿ హైదరాబాద్‌కు చెందిన ఆదిశ్వర్ ఆటో రైడ్ ఇండియా (AARI) ఇటాలియన్ సైకిల్ బ్రాండ్ బెనెల్లీ బైక్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఆటో ఎక్స్‌పో 2023లో సూపర్ బైక్ కీవే SR250ని కూడా విడుదల చేసింది. దీరి ధర రూ.1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ), SR250 భారత మార్కెట్లో హంగేరియన్ బ్రాండ్ నుంచి 8వ ఉత్పత్తి. సింగిల్-సిలిండర్ 4-స్ట్రోక్ 223 cc ఇంజిన్‌తో ఆధారితమైన SR250 16.08 HP గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
ఆటో ఎక్స్‌పో 2023 16వ ఎడిషన్ అధికారికంగా లాంచ్ అయింది
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్ పాండేతో కలిసి గురువారం ఆటో ఎక్స్‌పో 2023ని లాంఛనంగా ప్రారంభించారు. మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఆటో ఎక్స్‌పో ప్రారంభమైంది. జనవరి 13వ తేదీ నుంచి ఈ ఎక్స్‌పోను సందర్శించేందుకు సామాన్యులు అనుమతించబడతారు.
Addressing Inaugural Ceremony of Auto Expo - The Motor Show 2023 https://t.co/ROPPjAlxWc
— Nitin Gadkari (@nitin_gadkari) January 12, 2023
మారుతి క్రాస్ఓవర్ కారు FRONX వచ్చేసింది
మారుతి తన క్రాస్ఓవర్ కారు అయిన FRONX ను ఆటో ఎక్స్‌పో 2023లో విడుదల చేసింది. ఈ వాహనంలో శక్తివంతమైన 1.0L టర్బో బూస్టర్ జెట్ ఇంజిన్‌ను కూడా చూడవచ్చు. ఈ వాహనంలో అనేక అత్యాధునిక టెక్నాలజీలను కూడా అమర్చారు.
మారుతి ఐదు డోర్ల ఎస్‌యూవీ కారు జిమ్నీ రివీల్
మారుతి తన జిమ్నీ SUV కారును ఆటో ఎక్స్‌పో 2023లో రివీల్ చేసింది. ఈ వాహనంలో అనేక ఫీచర్లు ఉన్నాయి. అతిపెద్ద విషయం ఏమిటంటే ఇందులో ఐదు తలుపులు ఉన్నాయి.