అన్వేషించండి

Pending Challans Detection: మీ కారు రోడ్డుపైకి రాగానే పెండింగ్‌ చలాన్ల చరిత్ర పోలీసులకు తెలిసిపోతుంది - AI టెక్‌ వచ్చేసింది

ట్రాఫిక్ పోలీసులు కొత్తగా AI స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు, మీ వాహనం నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేసిన వెంటనే, చలాన్లు & ట్రాఫిక్ ఉల్లంఘనల గురించి సమాచారం ఆ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

Bangalore Traffic Police Pending Challans Detection: మీ కారు, బైక్‌ లేదా ఏదైనా మోటార్‌ వెహికల్‌ను రోడ్డు మీదకు తీసుకురావడానికి ఇప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ట్రాఫిక్‌ పోలీసుల చేతిలోకి కొత్తగా హైటెక్‌ అస్త్రం వచ్చింది. మీ బండి రోడ్డు మీదకు రాగానే, అది మీ పెండింగ్‌ చలాన్ల మొత్తం చరిత్రను అందరికీ బహిర్గతం చేస్తుంది. కాబట్టి, ట్రాఫిక్‌ చలాన్లు ఉన్న వాళ్లు వెంటనే క్లియర్‌ చేసుకోవడం మంచిది. ప్రస్తుతం ఈ వ్యవస్థను బెంగళూరులో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు కాబట్టి, ఇప్పటికైతే తెలుగు ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదు.

ట్రాఫిక్ ఉల్లంఘనదారులను అప్రమత్తం చేయడానికి, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు, రోడ్డు పక్కన పెద్ద ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) స్క్రీన్‌లను ఉపయోగించడం ప్రారంభించారు. ఈ AI వ్యవస్థ, వాహనం నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేసి, పెండింగ్‌లో ఉన్న చలాన్ల సంఖ్య, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ వ్యాలిడిటీ & ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘనల సమాచారాన్ని తక్షణమే పెద్ద స్క్రీన్‌పై ప్రదర్శిస్తుంది. 

AI స్క్రీన్ ఎలా పనిచేస్తుంది?
ట్రాఫిక్ పోలీసులు, ఈ AI స్క్రీన్‌ వ్యవస్థ 100 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన కెమెరాలకు అనుసంధానించారు. ఒక వాహనం అటుగా వెళుతున్నప్పుడు, ఈ కెమెరా, వాహనం రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ప్లేట్‌ (లైసెన్స్ ప్లేట్‌) ను స్కాన్ చేస్తుంది. ఆ తర్వాత, వాహనం నంబరు సహా ఆ వెహికల్‌పై ఏవైనా ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉంటే వెంటనే ప్రదర్శిస్తుంది. ఇదంతా సెకన్లలో జరిగిపోతుంది.

డ్రైవర్లకు కూడా ప్రయోజనమే!
నిజానికి, ఈ వ్యవస్థ కారు ఓనర్లు లేదా డ్రైవర్లకు కూడా ఉపయోగమే. ఓనర్లు లేదా డ్రైవర్లు, తమకు తెలీకుండా తమ వాహనాలపై పెండింగ్‌లో ఉన్న చలాన్ల సంఖ్యను & చలాన్‌కు గల కారణం గురించి రియల్‌ టైమ్‌లో తెలుసుకుంటారు. 
దీనివల్ల, వెంటనే ఆ చలాన్/ చలాన్లను చెల్లించడానికి & భవిష్యత్తులో ఉల్లంఘనలను నివారించడానికి వీలు కలుగుతుంది.

ఈ పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభమైంది?
ప్రస్తుతం, ఈ AI స్క్రీన్‌ను బెంగళూరులోని ట్రినిటీ చౌక్‌లో ఏర్పాటు చేశారు & దీనిని పైలట్ ప్రాజెక్ట్‌గా పరిశీలిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే, భవిష్యత్తులో బెంగళూరులోని ఇతర ప్రధాన ట్రాఫిక్ పాయింట్లలో కూడా ఇలాంటి స్క్రీన్‌లను ఏర్పాటు చేయవచ్చు. కొంతమంది ఈ AI స్క్రీన్ గురించి సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ట్రాఫిక్ మెరుగుదలకు ఇది ఒక మంచి అడుగు అని కొందరు చెబుతుండగా, డ్రోన్లను ఏర్పాటు చేసి గుంతలు & ట్రాఫిక్ జామ్‌ల గురించి కూడా సమాచారాన్ని అందించగలిగితే ఇంకా బాగుంటుందని మరికొందరు వ్యాఖ్యానించారు.

బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ఈ AI-ఆధారిత స్క్రీన్ ప్రయోగం ట్రాఫిక్ నిర్వహణలో పెద్ద మార్పును తీసుకురాగలదని భావిస్తున్నారు. ఇది చలాన్ ప్రక్రియను మరింత పారదర్శకంగా చేస్తుంది & డ్రైవర్లకు తక్షణ సమాచారాన్ని అందిస్తుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, బెంగళూరులోనే కాదు, మన హైదరాబాద్‌ & విజయవాడ వంటి నగరాల్లోకీ ఇది రావొచ్చేమో.

టాప్ హెడ్ లైన్స్

యూత్ ఆల్-టైమ్ ఫేవరెట్‌ బజాజ్ పల్సర్ 150 కొనాలనుకుంటున్నారా? తక్కువ EMI ఆప్షన్లు, ఆఫర్ల వివరాలు మీకోసం!
2026 Bajaj Pulsar 150: కేవలం రూ.11,523 డౌన్‌పేమెంట్‌తో సొంతం చేసుకోండి - పూర్తి EMI ప్లాన్స్ ఇవే!
Auto Market September 2026: కారు,బండి కొనేందుకు సెప్టెంబర్‌ మంచి సమయమా? దసరా ఆఫర్ల కోసం ఆగాలా?
కారు,బండి కొనేందుకు సెప్టెంబర్‌ మంచి సమయమా? దసరా ఆఫర్ల కోసం ఆగాలా?
కొత్త ఇంజిన్, కొత్త గేర్‌బాక్స్‌తో వచ్చిన ఆల్‌-న్యూ పల్సర్ 150.. ట్రాఫిక్‌లో రైడ్ మరింత ఈజీ!
కొత్త లుక్‌తో ఫ్రెష్‌గా వచ్చిన బజాజ్ పల్సర్ 150.. ఫీచర్లు అదుర్స్, ధర మీకు అందుబాటులో!
హ్యాచ్‌బ్యాక్ నుంచి 7 సీటర్ వరకు.. రూ.10 లక్షల్లోనే వచ్చే బెస్ట్ CNG కార్లు ఇవే!
డైలీ డ్రైవ్‌ అయినా, లాంగ్‌ ట్రిప్‌ కోసమైనా.. రూ.10 లక్షల్లో కొనగలిగే 5 CNG కార్లు

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Cabinet Meeting Absence: సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?
సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?
Electoral Roll Special Revision: భారీగా ఓట్లు తొలగిస్తున్నా ఆందోళన చెందని పార్టీలు - ఓట్లు పోయాయనని ఓటర్లు ఎవరూ బయటకు రావట్లేదేంటి?
భారీగా ఓట్లు తొలగిస్తున్నా ఆందోళన చెందని పార్టీలు - ఓట్లు పోయాయనని ఓటర్లు ఎవరూ బయటకు రావట్లేదేంటి?
Irumudi Controversy: 'ఇరుముడి'పై ఏపీ టీచర్స్ ఆగ్రహం... వివాదంలో రవితేజ సినిమా - ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్
'ఇరుముడి'పై ఏపీ టీచర్స్ ఆగ్రహం... వివాదంలో రవితేజ సినిమా - ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్
How to Identify Toxic Manipulators : మీ బలహీనతలే 'సాధిక్'ల ఆయుధాలు! మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవిత పాఠంలా కాకినాడ కేసు!
మీ బలహీనతలే 'సాధిక్'ల ఆయుధాలు! మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవిత పాఠంలా కాకినాడ కేసు!
Pratibha Takadapally:
"పతకాలు సాధించినప్పుడు ఏమైపోయారు? క్రీడామంత్రిత్వ శాఖ బెదిరింపులు నిజం" ప్రతిభా తకడపల్లి హాట్‌కామెంట్స్
Irumudi Collection: వంద కోట్ల క్లబ్బులో 'ఇరుముడి'... బాహుబలి తర్వాత ఆ రికార్డు రవితేజ సినిమాదే
వంద కోట్ల క్లబ్బులో 'ఇరుముడి'... బాహుబలి తర్వాత ఆ రికార్డు రవితేజ సినిమాదే
Karumuri Remand: ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్
ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్
Konda Surekha BC Card: బీసీ కార్డ్‌తో కొండా సురేఖ ఎదురుదాడి - సీఎం రేవంత్ చర్యలు తీసుకోగలరా!?
బీసీ కార్డ్‌తో కొండా సురేఖ ఎదురుదాడి - సీఎం రేవంత్ చర్యలు తీసుకోగలరా!?
Embed widget