అన్వేషించండి

Ajay Devgn Luxury Van: అజయ్ దేవగన్ గ్యారేజీలోకి కొత్త లగ్జరీ వ్యాన్.. షారుఖ్, హార్దిక్ పాండ్యా బాటలో బాలీవుడ్ సింగం!

Mercedes Benz V Class | బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ తన కార్ కలెక్షన్‌లోకి రూ. 1.6 కోట్ల విలువైన మెర్సిడెస్-బెంజ్ వి-క్లాస్ లగ్జరీ వ్యాన్‌ను చేర్చుకున్నారు. దీని ఫీచర్లు, విశేషాలు తెలుసుకుందాం.

బాలీవుడ్ సెలబ్రిటీలు తమ లగ్జరీ లైఫ్ స్టైల్, ఖరీదైన కార్ల విషయంలో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. తాజాగా బాలీవుడ్ 'సింగం' అజయ్ దేవగన్ తన కార్ల సేకరణలో ఒక అద్భుతమైన లగ్జరీ వ్యాన్‌ను చేర్చుకున్నారు. ఇది కేవలం ఒక వాహనం మాత్రమే కాదు, చక్రాల మీద కదిలే ఒక విలాసవంతమైన హౌస్ అని చెప్పవచ్చు. ఇటీవలి కాలంలో చాలామంది సెలబ్రిటీలు ఈ వాహనాన్ని కొనుగోలు చేయడం ఒక ట్రెండ్‌గా మారింది.

ధ‌ర , ప్రత్యేకతలు..
అజయ్ దేవగన్ కొనుగోలు చేసిన మెర్సిడెస్-బెంజ్ వి-క్లాస్ (Mercedes-Benz V-Class) ధర సుమారు రూ. 1.6 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ వ్యాన్ తన భారీ సైజు, ప్రీమియం లుక్, అత్యంత విలాసవంతమైన ఇంటీరియర్‌కు పేరుగాంచింది. ప్రయాణికులకు ఇందులో లభించే స్పేస్, కంఫర్ట్ ఒక లగ్జరీ లివింగ్ రూమ్‌ను తలపిస్తుంది. లాంగ్ జర్నీలు లేదా షూటింగ్ సమయాల్లో విశ్రాంతి తీసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

హైటెక్ ఫీచర్ల అడ్డా..
ఈ లగ్జరీ వ్యాన్ నిండా అత్యాధునిక టెక్నాలజీ ఉంది. మసాజ్ సీట్లు, పెద్ద స్క్రీన్స్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా వంటి ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అజయ్ దేవగన్ కంటే ముందే షారుఖ్ ఖాన్, క్రికెటర్ హార్దిక్ పాండ్యా కూడా ఈ వ్యాన్‌ను కొనుగోలు చేశారు. హార్దిక్ పాండ్యా తన గర్ల్ ఫ్రెండ్‌కు కూడా దీనిని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ వ్యాన్ బయట కొత్త యూ-షేప్డ్ షైనీ గ్రిల్, స్టైలిష్ ఎల్‌ఈడీ హెడ్ లైట్లు, 19 ఇంచ్ అలాయ్ వీల్స్‌తో ఎంతో రాయల్‌గా కనిపిస్తుంది.

అద్భుతమైన ఇంటీరియర్..
లోపల లుగానో లేదర్ సీట్లు, 64 రంగుల యాంబియంట్ లైటింగ్ ఆకట్టుకుంటాయి. ఇన్ఫోటైన్‌మెంట్, డ్రైవర్ డిస్ప్లే కోసం రెండు పెద్ద 12.3 ఇంచ్ స్క్రీన్లు ఉన్నాయి. సంగీత ప్రియుల కోసం 15 స్పీకర్ల బర్మెస్టర్ (Burmester) సౌండ్ సిస్టమ్ ఉంది. అన్ని సీట్లకు వెంటిలేషన్, మసాజ్ సదుపాయం ఉండటం వల్ల సుదీర్ఘ ప్రయాణాలు కూడా అస్సలు అలసట అనిపించవు.

సేఫ్టీలో బెస్ట్ కారు..
టెక్నాలజీతో పాటు సేఫ్టీ విషయంలోనూ ఈ వ్యాన్ ముందుంది. ఇందులో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, యాక్టివ్ పార్కింగ్ అసిస్ట్ ఉన్నాయి. లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) డ్రైవింగ్‌ను మరింత సులభం, సురక్షితం చేస్తుంది. ఎయిర్ మ్యాటిక్ సస్పెన్షన్ వల్ల గతుకుల రోడ్లపై కూడా కుదుపులు తెలియవు. అజయ్ దేవగన్ గ్యారేజీలో ఇప్పటికే రూ. 7 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ కల్లినన్ ఎస్‌యూవీ, రూ. 3 కోట్ల మెర్సిడెస్-మేబాక్ GLS600, బీఎమ్‌డబ్ల్యూ i7 వంటి అద్భుతమైన కార్లు ఉన్నాయి. ఇప్పుడు వి-క్లాస్ చేరికతో ఆయన కలెక్షన్ మరింత రిచ్‌గా మారింది.

 

టాప్ హెడ్ లైన్స్

Hero Destini 110 Classique ఎడిషన్ లాంచ్‌.. కొత్త కలర్ ఆప్షన్లు, డ్యూయల్ టోన్ స్టైలింగ్‌తో రోడ్డుపై రచ్చే!
హీరో డెస్టినీ 110 కొనేవాళ్లకు మరో స్టైలిష్‌ ఆప్షన్‌.. రూ.76,400 ధరతో క్లాసిక్ ఎడిషన్ లాంచ్
Diwali Offers: హోండా, వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్ సెడాన్లపై దీపావళి బంపర్ ఆఫర్లు.. రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్‌
ఈ దీపావళికి హైయెస్ట్‌ ఆఫర్లు అందిస్తున్న 5 సెడాన్లు.. రూ.1.25 లక్షల వరకు ఆదా!
Best Mileage Car: అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..
అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..
Maruti Fronx కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చిన Brezza Turbo.. సిటీ ట్రాఫిక్‌లో, హైవేపై మీద ఎంత ఇచ్చిందంటే?
మారుతి బ్రెజ్జా టర్బో నిజమైన మైలేజ్ ఎంత? రియల్ వరల్డ్‌ టెస్ట్‌ ఫలితాలు ఇవిగో

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Urban Local Body Elections: 92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు
92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు: AP SEC
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Iam Game Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
iPhone 17 Pro Offer: ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
CM Chandrababu: వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
YS Sharmila Daughter Marriage: ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
Hero Destini 110 Classique ఎడిషన్ లాంచ్‌.. కొత్త కలర్ ఆప్షన్లు, డ్యూయల్ టోన్ స్టైలింగ్‌తో రోడ్డుపై రచ్చే!
హీరో డెస్టినీ 110 కొనేవాళ్లకు మరో స్టైలిష్‌ ఆప్షన్‌.. రూ.76,400 ధరతో క్లాసిక్ ఎడిషన్ లాంచ్
Embed widget