అన్వేషించండి

Affordable SUVs: బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీచర్: రూ. 11 లక్షల్లో పనోరమిక్ సన్‌రూఫ్ ఇచ్చే టాప్ 5 కార్లు ఇవే

తక్కువ బడ్జెట్‌లో పనోరమిక్ సన్‌రూఫ్ కారు కొనాలనుకునే వారి కోసం మార్కెట్లో ఉన్న టాప్ 5 ఆప్షన్ల వివరాలు, వాటి ఫీచర్లు.. అలాగే ధరల పూర్తి విశ్లేషణ గురించి తెలుసుకుందాం.

Affordable SUVs in India | ఇండియాలో కార్లు కొనేవారు ఇప్పుడు పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్‌కు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకప్పుడు కేవలం లగ్జరీ కార్లకే పరిమితమైన ఈ ఫీచర్, ప్రస్తుతం బడ్జెట్ ఎస్‌యూవీల్లో కూడా అందుబాటులోకి వచ్చింది. జీఎస్టీ (GST) తగ్గింపు తర్వాత చాలా కార్ల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. దేశంలో అత్యంత తక్కువ ధరకు పనోరమిక్ సన్‌రూఫ్ అందిస్తున్న టాప్ 5 కార్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కియా సైరోస్ (Kia Syros)..
ప్రస్తుతం ఇండియాలో పనోరమిక్ సన్‌రూఫ్‌తో లభిస్తున్న అత్యంత చౌకైన కారు ఇదే. కియా తన సైరోస్ మోడల్‌లోని హెచ్‌టీకే+ (HTK+) ట్రిమ్ నుండి ఈ ఫీచర్‌ను అందిస్తోంది. జీఎస్టీ రేట్ల తగ్గింపు తర్వాత దీని ప్రారంభ ధర రూ. 10.74 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులో 12.3 ఇంచ్ హెచ్‌డీ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, వెనుక సీట్లకు విండో కర్టెన్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. 16 ఇంచ్ అలాయ్ వీల్స్‌తో ఈ కారు ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO)..
తర్వాతి స్థానంలో మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ నిలుస్తుంది. వాయిస్ అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్‌తో వచ్చే దీని 'REVX A' వేరియంట్ ధర రూ. 10.75 లక్షలు మాత్రమే. ఇది 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. సేఫ్టీ పరంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

ఎంజీ ఆస్టర్ (MG Astor)
కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో పనోరమిక్ సన్‌రూఫ్ కలిగిన అత్యంత చౌకైన కారు ఎంజీ ఆస్టర్. దీని 'షైన్' వేరియంట్ ధర రూ. 11.20 లక్షల నుండి ప్రారంభమవుతుంది. బేస్ వేరియంట్ మినహా మిగిలిన అన్ని ట్రిమ్స్‌లో ఈ సన్‌రూఫ్ ఆప్షన్ ఉంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్, రివర్స్ కెమెరా, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్స్ వంటి భద్రతా ప్రమాణాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

టాటా నెక్సాన్ (Tata Nexon)..
టాటా మోటార్స్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న నెక్సాన్ కూడా ఈ జాబితాలో ఉంది. దీని క్రియేటివ్+ పీఎస్ (Creative+ PS) వేరియంట్ ధర రూ. 11.25 లక్షలుగా ఉంది. పెట్రోల్, డీజిల్ ఆప్షన్లతో పాటు దేశంలోనే పనోరమిక్ సన్‌రూఫ్ కలిగిన మొట్టమొదటి సీఎన్జీ కారుగా కూడా నెక్సాన్ గుర్తింపు పొందింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని విశ్లేష‌కులు అంటున్నారు.

టాటా కర్వ్ (Tata Curvv)..
ఈ జాబితాలో ఐదవ స్థానంలో టాటా నుండి వచ్చిన కూపే ఎస్‌యూవీ 'కర్వ్' నిలుస్తుంది. దీని ప్యూర్+ ఎస్ (Pure+ S) వేరియంట్ ధర రూ. 11.59 లక్షలుగా నిర్ణయించారు. వాయిస్ అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్ తో పాటు ఎలక్ట్రిక్ టెయిల్ గేట్, ఆటో హెడ్ లైట్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వంటి ఫీచర్లు దీని సొంతం. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో ఇది ప్రయాణికులకు గరిష్ట భద్రతను కల్పిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

 

టాప్ హెడ్ లైన్స్

టోల్‌గేట్‌ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్స్‌!
కేవలం రూ.350 మంత్లీ పాస్‌.. ఒక నెలలో టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా ప్రయాణం!
సిటీ రైడింగ్‌ అయినా, ఆఫ్‌రోడ్ ట్రైల్స్‌ అయినా.. Decathlon కొత్త సైకిళ్ల ప్రత్యేకతలివే!
డెకాథ్లాన్ నుంచి 3 కొత్త సైకిళ్లు.. Rockrider సిరీస్‌లో అదిరిపోయే మోడల్స్!
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి, EMI ఎంత పడుతుంది?
ఎక్కువ డబ్బు అవసరం లేదు, చాలా తక్కువ డౌన్‌పేమెంట్‌తోనే RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ కొనవచ్చు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget