అన్వేషించండి

2026లో వస్తున్న 5 కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్లు - Yamaha Aerox E నుంచి Ather EL వరకు భారీ ఎంట్రీలు

2026లో Yamaha, Bajaj, Simple Energy, Ather నుంచి ఐదు కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్లు మన మార్కెట్లోకి రానున్నాయి. వాటి ముఖ్య ఫీచర్లు, రేంజ్‌, డిజైన్‌ వివరాలు ఇవిగో.

Upcoming Electric Scooter India 2026: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎలక్ట్రిక్‌ స్కూటర్ల డిమాండ్‌ రోజు రోజుకూ పెరుగుతోంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో EV అమ్మకాలు గట్టిగా పెరుగుతున్నాయి. రెండు చక్రాల రంగంలో వచ్చే ఏడాది పెద్ద ఎత్తున కొత్త ఇ-స్కూటర్లు ఎంట్రీ ఇవ్వబోతుండటంతో యూజర్లలో ఇప్పటికే మంచి ఆసక్తి కనిపిస్తోంది. Yamaha, Bajaj వంటి పెద్ద కంపెనీల నుంచి Simple Energy, Ather వంటి ప్రముఖ EV బ్రాండ్ల వరకు తమ కొత్త మోడళ్లతో మార్కెట్లోకి రానున్నాయి. 

2026లో భారత్‌లో రిలీజ్ కావాల్సిన ఐదు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు

1. Yamaha Aerox-E - యమహా తొలి ఇ-స్కూటర్ ఎంట్రీ
యమహా, ఇటీవల, భారత్‌లో Aerox-Eని అధికారికంగా రివీల్‌ చేసింది. 2026 ప్రారంభంలో విక్రయాలు మొదలయ్యే అవకాశం ఉంది. ఇది 3 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. 9.4 kW ఇంజిన్‌ పవర్‌ను అందిస్తుంది, పీక్‌ టార్క్‌ 48 Nm. ఒకసారి చార్జ్‌ చేస్తే 106 కిలోమీటర్ల వరకూ రేంజ్‌ ఇస్తారని కంపెనీ చెబుతోంది. డిజైన్‌ విషయానికి వస్తే, ICE Aerox మాదిరిగానే స్పోర్టీ లుక్‌తో పాటు కొన్ని ఎలక్ట్రిక్‌ స్పెసిఫిక్‌ మార్పులు కనిపిస్తాయి. Eco, Standard, Power అనే మూడు రైడింగ్‌ మోడ్‌లు, రివర్స్‌ మోడ్‌, స్మార్ట్‌ కీ సిస్టమ్‌, 5-అంగుళాల TFT క్లస్టర్‌, బ్లూటూత్‌, ట్రాక్షన్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు అందిస్తారు.

2. Yamaha EC-06 - ఫ్యామిలీ యూజర్ల కోసం కొత్త మాక్సీ స్కూటర్
Aerox-Eతో పాటు Yamaha EC-06ను కూడా అధికారికంగా చూపించింది. ఇది 2026 మొదటి త్రైమాసికంలో లాంచ్‌ అవుతుంది. River Mobilityతో కలిసి యమహా ఈ మోడల్‌ను తయారు చేయనుంది. 4 kWh హై-కెపాసిటీ బ్యాటరీ, సింగిల్‌ చార్జ్‌పై 160 కిలోమీటర్ల రేంజ్‌ వంటి ఫీచర్లు ఈ స్కూటర్‌ను ఫ్యామిలీ యూజర్లకు మంచి ఆప్షన్‌గా మారుస్తాయి. 4.5 kW మోటార్‌ పీక్‌ పవర్‌ 6.7 kW ఇస్తుంది. LCD క్లస్టర్‌, ఇంటిగ్రేటెడ్‌ టెలిమాటిక్స్‌, మూడు రైడింగ్‌ మోడ్‌లు, రివర్స్‌ మోడ్‌ వంటి ఫీచర్లు ఉంటాయి.

3. New-Gen Bajaj Chetak - మరింత అప్‌డేటెడ్‌ వెర్షన్
భారత మార్కెట్లో టాప్‌ సెల్లింగ్ ఇ-స్కూటర్లలో Chetak ఒకటి. ఇప్పుడు కొత్త తరం మోడల్‌ని బజాజ్‌ టెస్ట్‌ చేస్తోంది. స్పై ఇమేజెస్‌లో... కొత్త టెయిల్‌ ల్యాంప్‌, కొత్త రియర్‌ టైర్‌ హగ్గర్‌, ఫ్లాట్‌ సీటు, మార్పులు చేసిన స్విచ్‌ గియర్‌ వంటి అప్‌డేట్స్‌ కనిపించాయి. ప్రస్తుత మోడల్‌లో ఉన్న 3.5 kWh బ్యాటరీనే కొత్త మోడల్‌లో కూడా ఉపయోగించే అవకాశం ఉంది. ఫుల్‌ చార్జ్‌పై సుమారు 150 కిలోమీటర్ల రేంజ్‌ ఇవ్వవచ్చని అంచనాలు ఉన్నాయి.

4. Simple Energy Family-Oriented E-Scooter - పక్కా ఫ్యామిలీ స్కూటర్
సింపుల్‌ ఎనర్జీ ప్రస్తుతం స్పోర్టీ ఇ-స్కూటర్లతో మార్కెట్లో ఉంది. కొత్తగా, ఫ్యామిలీ యూజర్ల కోసం కొత్త ఇ-స్కూటర్‌ను రూపొందిస్తోంది. డిజైన్‌ పేటెంట్‌ ఆధారంగా చూస్తే, లాంగ్‌ ఫ్లాట్‌ సీటు, LED హెడ్‌ల్యాంప్‌, మందంగా ఉన్న సైడ్‌ ప్యానెల్స్‌, ఫ్లాట్‌ ఫ్లోర్‌బోర్డ్‌ వంటివి కనిపిస్తున్నాయి. టెక్నికల్‌ వివరాలు ఇప్పటి వరకు వెల్లడి కాలేదు, కానీ మొత్తం ఫ్యామిలీ యూజర్లను దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్‌ను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2026లో ఈ ఇ-స్కూటర్‌ లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది.

5. Ather EL Platform - 2026లో భారీ అప్‌గ్రేడ్
Ather Energy తన కొత్త EL ప్లాట్‌ఫామ్‌ను ఇటీవల చూపించింది. ఇది, భవిష్యత్‌లో వచ్చే అన్ని నూతన Ather ఇ-స్కూటర్లకు మెయిన్‌ బేస్‌ అవుతుంది. AEBS (Advanced Electronic Braking System), కొత్త ఛార్జ్‌ డ్రైవ్‌ కంట్రోలర్‌ (Charge Drive Controller) వంటి ఆధునిక టెక్నాలజీలు ఇందులో భాగం. EL01 Concept స్కూటర్‌ను కంపెనీ ఇప్పటికే ప్రజలకు పరిచయం చేసింది. దీనిని ఫ్యామిలీ స్కూటర్‌గా రూపొందిస్తున్నారు. 2026 దసరా సమయంలో మొదటి EL సిరీస్‌ స్కూటర్‌ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Maruti Dzireకు ప్రత్యామ్నాయంగా Honda Amaze కొనబోతున్నారా? ముందు ఈ నిజాలు కచ్చితంగా తెలుసుకోండి
కొత్త Honda Amaze కొనేవాళ్లకు అలెర్ట్‌! ఈ సెడాన్‌లో మీకు తెలియాల్సిన 3 ప్లస్‌లు, 3 మైనస్‌లు!
Ethanol: పెట్రోల్ తర్వాత డీజిల్‌పైనా ప్రయోగం.. ఇథనాల్‌పై కేంద్రం ఎందుకు వెనక్కి తగ్గింది?
డీజిల్‌లో ఇథనాల్ కలపడం కుదరదు.. అసలు కారణం ఇదే!
బాబర్ బైక్ సెగ్మెంట్‌లో కొత్త పోరు.. గోవాన్ క్లాసిక్ 350తో హోండా రెబెల్ 300 పోటీ!
హోండా రెబెల్ 300 vs రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గోవాన్ క్లాసిక్ 350 - ఏది స్పెషల్‌ బైక్‌?
ఎలక్ట్రిక్‌ బైక్‌ లేదా స్కూటర్‌ కొనేవాళ్లకు పెద్ద శుభవార్త.. రాయితీ గడువు పొడిగించిన కేంద్రం
ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ కొనేవాళ్ల కోసం బిగ్‌ న్యూస్‌.. సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Embed widget