అన్వేషించండి

2026 మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌.. టాప్ వేరియంట్‌లో లెవెల్‌ 2 ADAS ఫీచర్లు!

2026 మారుతి బలెనోలో కొత్త ఆల్ఫా (O) వేరియంట్, కొత్త పెట్రోల్ ఇంజిన్, అధునాతన భద్రతా ఫీచర్లు వచ్చాయి. వేరియంట్ల వారీగా ఫీచర్ల వివరాలు ఇవే.

2026 Maruti Baleno facelift Price And Features Telugu: మారుతి సుజుకి బలెనోకు కొత్త రూపం (facelift) వచ్చింది. 2026 ఫేస్‌లిఫ్ట్‌తో, ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో కొన్ని మార్పులు చేశారు, కొత్త ఫీచర్లను జోడించారు, భద్రతను మరింత పెంచారు. కొత్త పెట్రోల్ ఇంజిన్‌ను కూడా తీసుకొచ్చారు. ముఖ్యంగా.. కొత్త ఆల్ఫా (O) వేరియంట్‌ను టాప్ మోడల్‌గా పరిచయం చేశారు.

కొత్త బలెనో ప్రారంభ ధర రూ.6.10 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారును సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా & ఆల్ఫా (O) వేరియంట్లలో కొనుక్కోవచ్చు. అయితే, అన్ని వేరియంట్ల ధరలను మారుతి సుజుకి ఇంకా ప్రకటించలేదు.

కొత్త ఇంజిన్

2026 బలెనోలో 1.2 లీటర్, 3 సిలిండర్ NA పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజిన్ 83hp పవర్‌, 112Nm టార్క్‌ను ఇస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు 5 స్పీడ్ AMT ఎంపిక కూడా ఉంది. 

CNG వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. CNGలో ఇంజిన్ 70hp పవర్‌, 102Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ వెర్షన్‌లో 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే ఉంటుంది.

Sigma వేరియంట్

ప్రారంభ వేరియంట్ అయిన సిగ్మాలోనే భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ABSతో EBD, ESP, హిల్ హోల్డ్ కంట్రోల్ కూడా లభిస్తాయి. రియర్‌ విండో డీఫాగర్, అన్ని సీట్లకు 3 పాయింట్ సీట్‌బెల్ట్‌లు ఉన్నాయి.

కీలెస్ ఎంట్రీ, సెంట్రల్ లాకింగ్, అన్ని ప్రయాణికులకు అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లు కూడా ఉన్నాయి. 60:40 స్ప్లిట్ వెనుక సీట్లు, అన్ని విండోలకు పవర్ ఆపరేషన్, డ్రైవర్ విండోకు వన్ టచ్ ఆపరేషన్ లభిస్తాయి. 15 అంగుళాల వీల్స్‌కు వీల్ కవర్లు ఉన్నాయి. హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు & LED టెయిల్ లైట్లు కూడా ఉన్నాయి.

Delta వేరియంట్

డెల్టా వేరియంట్‌లో... సిగ్మా ఫీచర్లకు అదనంగా మరిన్ని సదుపాయాలు వస్తాయి. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది. వెనుక AC వెంట్స్, ఫాస్ట్ ఛార్జింగ్ USB Type A & Type C పోర్టులు ఉన్నాయి.

స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ అయ్యే & ఫోల్డ్ అయ్యే ORVMలు ఉన్నాయి. 7 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో వైర్‌లెస్ Android Auto & Apple CarPlay సపోర్ట్ లభిస్తుంది. నాలుగు స్పీకర్లు, ముందు సెంటర్ స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్ కూడా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: TVS Jupiter 110 డ్యూయల్ టోన్ ఎడిషన్.. కొనేముందు ఈ 8 విషయాలు తెలుసుకోండి!

Zeta వేరియంట్

జీటా వేరియంట్‌లో ఫీచర్ల జాబితా మరింత పెరుగుతుంది. ఇందులో.. డెల్టా వేరియంట్‌లో ఉన్న ఫీచర్లతో పాటు రియర్ వ్యూ కెమెరా, Suzuki Connect సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. వెనుక వైపర్, వాషర్, టెలిస్కోపిక్ స్టీరింగ్ అడ్జస్ట్‌మెంట్ లభిస్తాయి.

డ్రైవర్ సీటు ఎత్తును సర్దుబాటు చేసుకోగల సదుపాయం ఉంది. పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఉన్నాయి. ముందు వైపు కూలింగ్‌తో వైర్‌లెస్ ఛార్జర్ ఇచ్చారు.

9 అంగుళాల టచ్‌స్క్రీన్, 6 స్పీకర్ల Arkamys సౌండ్ సిస్టమ్, ఫుట్‌వెల్ లైటింగ్ ఉన్నాయి. ఆటోమేటిక్ LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, LED DRLలు & 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా లభిస్తాయి.

Alpha వేరియంట్

ఆల్ఫా వేరియంట్‌లో జీటా ఫీచర్లకు అదనంగా మరిన్ని ప్రీమియం సదుపాయాలు ఉన్నాయి. 360 డిగ్రీ కెమెరా, హెడ్ అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్ ప్రధాన ఆకర్షణలు.

ఆటో డిమ్మింగ్ IRVM, ఆటో ఫోల్డింగ్ ORVMలు, కో డ్రైవర్ వానిటీ ల్యాంప్ ఉన్నాయి. Clarion సౌండ్ సిస్టమ్, లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్, ముందు వెంటిలేటెడ్ సీట్లు లభిస్తాయి. సెమీ లెదర్ సీట్లు & ప్రెసిషన్ కట్ అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి.

Alpha (O) ప్రత్యేకత

కొత్తగా పరిచయం చేసిన ఆల్ఫా (O) వేరియంట్ బలెనోలో టాప్ మోడల్. ఇందులో ఆల్ఫా వేరియంట్‌లోని అన్ని ఫీచర్లతో పాటు Level 2 ADAS అందించారు. Level 2 ADAS సూట్‌లో భాగంగా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, అడ్వాన్స్‌డ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ & ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. దీంతో బలెనో మరింత సేఫ్టీ ఫోకస్డ్ కారుగా మారింది.

ఇది కూడా చదవండి: హైవేపై మురికి టాయిలెట్ కనిపించిందా? ఫొటో తీసి ₹1,000 FASTag క్రెడిట్ పొందండి!

రంగులు కూడా కొత్తగా..

కొత్త బలెనో మొత్తం ఏడు రంగుల్లో లభిస్తుంది, అవి - Grandeur Grey, Enigmatic Teal Green, Opulent Red, Splendid Silver, Arctic White, Bluish Black & Nexa Blue. పాత మోడల్‌లో ఉన్న Luxe Beige రంగును తొలగించారు.

టాటా ఆల్ట్రోజ్, హ్యుందాయ్ i20 & టయోటా గ్లాంజాతో కొత్త బలెనో పోటీ పడుతుంది. కొత్త ఇంజిన్, అదనపు ఫీచర్లు & Level 2 ADAS కారణంగా ఈసారి బలెనోపై అంచనాలు పెరిగాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget