అన్వేషించండి

2026 Kia Seltos: Creta, Sierra, Grand Vitara, Hyryderలతో ఏ SUV పవర్‌ఫుల్‌?

కొత్త Kia Seltos సైజ్‌, ఇంజిన్‌, పవర్‌లో 10 రైవల్స్‌తో పోలికలో ఏ స్థానంలో నిలిచింది?. Creta, Sierra, Grand Vitara, Hyryder వంటి మోడళ్లతో పోలిక ఈ కథనంలో.

New Kia Seltos 2026: కొత్త కియా సెల్టోస్‌ అధికారికంగా బయటకు రావడంతో, ఈసారి మిడ్‌సైజ్‌ SUV సెగ్మెంట్‌లో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. New Seltos ను K3 ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి రూపొందించారు. కొత్త బేస్‌ వల్ల ఈ SUV పొడవు, వెడల్పు, వీల్‌బేస్‌ పెరిగింది. AP, Telangana మార్కెట్లలో ఇప్పటికే Seltosకు మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి, ఈ కొత్త వెర్షన్‌ మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. కొత్త Kia Seltos ను మొత్తం 10 రైవల్స్‌తో - Creta, Sierra, Victoris, Grand Vitara, Hyryder, Elevate, Kushaq, Taigun, Aircross X, Astor - తో పోలిస్తే ఎలా ఉందో అర్ధం చేసుకుందాం.

సైజ్ పోలిక: ఏ కారు పెద్దది?
2026 Kia Seltos ఈ సెగ్మెంట్‌లో పొడవు పరంగా ముందుంది. రోడ్లపై అది మరింత ప్రీమియంగా & షార్ప్‌గా కనిపించడానికి ఇది ఒక పెద్ద కారణం. కానీ వెడల్పు, ఎత్తు & వీల్‌బేస్‌ విషయానికి వస్తే, Tata Sierra స్పష్టంగా ముందంజలో ఉంది. Sierra ప్రాక్టికాలిటీని పెంచే అంశాలు - పెద్ద బూట్‌ స్పేస్‌, పెద్ద వీల్‌ సైజ్‌ ఎంపిక.

Honda Elevate మాత్రం గ్రౌండ్‌ క్లియరెన్స్‌లో నెంబర్‌1 స్థానంలో నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ గ్రామీణ రోడ్లలో ఇది మంచి ప్రయోజనం. Citroen C3 Aircross X ఈ జాబితాలో 7-సీటర్‌ ఆప్షన్‌ ఉన్న ఏకైక SUV.

అయితే Kia Seltos గ్రౌండ్‌ క్లియరెన్స్‌ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ఇంజిన్‌, పవర్ పోలిక: శక్తిమంతమైన SUV ఏది?
ఈ సెగ్మెంట్‌లో N/A (నేచురల్లీ ఆస్పిరేటెడ్‌) పెట్రోల్‌ ఇంజిన్లలో Honda Elevate పవర్‌, టార్క్ పరంగా ముందుంది. Tata Sierra కూడా అదే టార్క్‌ను ఇస్తుంది. Skoda Kushaq, VW Taigun చిన్న 1.0-లీటర్‌ టర్బో పెట్రోల్‌తో ఉన్నా, వాటి పెర్ఫార్మెన్స్‌ మంచి స్పోర్టీ నేచర్‌ను ఇస్తుంది.

Citroen C3 Aircross X మాత్రం ప్రత్యేకంగా 1.2-లీటర్‌ టర్బో & 1.2-లీటర్‌ N/A రెండింటినీ అందిస్తోంది, వాడుక ఆధారంగా ఎంపిక చేసుకోవచ్చు.

1.5-లీటర్‌ టర్బో పెట్రోల్‌లో Kia Seltos 2026, Hyundai Creta, Tata Sierra ఈ మూడు SUVలు పవర్‌ విషయంలో సమానంగా ఉంటాయి. కానీ టార్క్‌ విషయంలో Sierra కొంచెం ముందంజలో ఉంటుంది. ఈ సెగ్మెంట్‌లో డీజిల్‌ ఆప్షన్‌ ఉన్న మూడు SUVలు కూడా ఇవే. వీటిలో డీజిల్‌ పవర్‌, టార్క్ రెండింటిలోనూ Sierra అగ్రస్థానంలో ఉంటుంది.

హైబ్రిడ్ సెగ్మెంట్‌
Maruti Grand Vitara, Victoris & Toyota Hyryder - ఈ మూడు SUVల ప్రత్యేకత... స్ట్రాంగ్‌ హైబ్రిడ్ వ్యవస్థ. ఈ మూడు మాత్రమే ఫ్యాక్టరీ CNG ఆప్షన్‌ కూడా ఇస్తున్నాయి. ఫ్యూయల్‌ ఎఫిషియెన్సీ కోసం హైబ్రిడ్ SUVలను చూసే కస్టమర్లకు ఇవి బెస్ట్‌.

ప్రతి ఇంజిన్‌కు రెండు ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లు ఇస్తూ Kia Seltos తనదైన ప్రత్యేకత నిలుపుకుంది. ఈ 10 కార్ల పోలికలో ఇది ప్రత్యేకమైన అంశం.

మొత్తంగా చూస్తే... కొత్త Kia Seltos సైజ్‌, స్టైలింగ్‌, పవర్‌ట్రెయిన్‌ ఎంపికల పరంగా మరింత శక్తిమంతంగా మారింది. అయితే Tata Sierra డైమెన్షన్‌లలో, Honda Elevate గ్రౌండ్‌ క్లియరెన్స్‌లో, Maruti & Toyota హైబ్రిడ్లు మైలేజీలో తమదైన బలం చూపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ బయ్యర్లు తమ అవసరాన్ని బట్టి ఇప్పుడు మరింత స్పష్టమైన ఆలోచనతో SUVని ఎంపిక చేసుకోవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Avatar Fire And Ash First Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ: ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్... హాలీవుడ్ రివ్యూయర్లు ఏమన్నారంటే?
'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ: ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్... హాలీవుడ్ రివ్యూయర్లు ఏమన్నారంటే?
Advertisement

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Avatar Fire And Ash First Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ: ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్... హాలీవుడ్ రివ్యూయర్లు ఏమన్నారంటే?
'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ: ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్... హాలీవుడ్ రివ్యూయర్లు ఏమన్నారంటే?
KTR Comments on Pocharam: ఇలాంటి బతుకు కంటే చనిపోవడమే మేలు - పోచారంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇలాంటి బతుకు కంటే చనిపోవడమే మేలు - పోచారంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు
Kadiyam Srihari: కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
Bengalore One Side Love: మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
Upcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
Embed widget