MG Windsor Pro vs Windsor EV: విండ్‌సోర్ EV ప్రో - విండ్‌సోర్ స్టాండర్డ్ మోడల్ ఫీచర్లు, ధరల్లో ఇంత తేడా ఉందా?
MG Motor India: 'విండ్‌సోర్ ప్రో' ఎలక్ట్రిక్ కారు సూపర్ సక్సెస్ అయింది. ఈ EV కోసం రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ వస్తున్నాయి. స్టాండర్డ్ మోడల్‌కు, ప్రో మోడల్‌కు కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి.

MG Windsor Pro vs Windsor EV: ఎంజీ మోటార్ ఇండియా, విండ్‌సోర్ లైనప్‌లో కొత్త టాప్-స్పెక్ వేరియంట్‌గా "విండ్‌సోర్ EV ప్రో"ను ప్రవేశపెట్టింది. ఇది, భారతదేశంలో భారీ సక్సెస్ అందుకుంది. ప్రో వేరియంట్ పెద్ద బ్యాటరీ ప్యాక్ & కొంచెం ఎక్కువ ధరతో (గత టాప్-స్పెక్ Essence కంటే) లాంచ్ అయింది. స్టాండర్డ్ విండ్‌సోర్ EVతో పోలిస్తే విండ్‌సోర్ ప్రో వెర్షన్‌ను ప్రీమియం మోడల్‌గా చూడవచ్చు.
MG విండ్‌సోర్ Vs విండ్‌సోర్ ప్రో
ధర:
విండ్‌సోర్ EV ప్రో టాప్-స్పెక్ Essence ట్రిమ్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ ₹17.50 లక్షలు. స్టాండర్డ్ విండ్‌సోర్ EV Excite ట్రిమ్ ఎక్స్-షోరూమ్ ధర ₹13.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. Exclusive ట్రిమ్ రేటు ₹15.04 లక్షలు & Essence ట్రిమ్ ధర ₹16.14 లక్షలు. ఈ ప్రకారం, Essence (స్టాండర్డ్ EV) ఎడిషన్‌తో పోలిస్తే Windsor Pro రేటు రూ. 1.5 లక్షలు ఎక్కువ. ఈ ధరలు మొదటి 8,000 మంది కస్టమర్లకు మాత్రమేనని MG స్పష్టం చేసింది. విండ్‌సోర్ ప్రో కోసం బుకింగ్‌లు మే 8, 2025 నుంచి ప్రారంభమయ్యాయి.
BaaS ప్రైస్:
రెండు మోడళ్లలో "బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్" (BaaS) ప్రోగ్రామ్ కూడా అందుబాటులో ఉంది. BaaSతో, విండ్‌సోర్ ప్రో రేటు రూ. 12.50 లక్షల నుంచి స్టార్ అవుతుంది & కిలోమీటరుకు రూ. 4.5 బ్యాటరీ రెంట్ అవుతుంది. BaaS ప్రోగ్రామ్ కింద స్టాండర్డ్ విండ్‌సోర్ EV ధర 9.99 లక్షల రూపాయలు. దీనికి బ్యాటరీ అద్దె కిలోమీటరుకు రూ. 3.5 ఉంటుంది.
బ్యాటరీ సామర్థ్యం:
రెండు మోడళ్ల మధ్య అతి పెద్ద వ్యత్యాసం బ్యాటరీ సామర్థ్యం. విండ్‌సోర్ ప్రో 52.9 kWh బ్యాటరీ ప్యాక్‌తో పవర్ పొందుతుంది. ఇది ఫుల్ ఛార్జ్‌పై 449 కి.మీ. డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెప్పింది. స్టాండర్డ్ విండ్‌సోర్ EVలో 38 kWh బ్యాటరీ ఉంది, ఇది 331 కి.మీ. పరిధిని అందిస్తుంది. బ్యాటరీ సైజ్‌ల్లో తేడా ఉన్నప్పటికీ, రెండు వేరియంట్‌లు గరిష్టంగా 134 bhp & 200 Nm టార్క్‌ను జనరేట్ చేసే ఒకే ఫ్రంట్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌తో వచ్చాయి.
ఇంటీరియర్:
విండ్‌సోర్ ప్రో క్యాబిన్ లోపల బ్లాక్ & ఐవరీ డ్యూయల్-టోన్ ఇంటీరియర్‌తో ప్రీమియం లుక్‌లో కనిపిస్తుంది. లెవల్ 2 ADAS, వెహికల్-టు-లోడ్ (V2L) & వెహికల్-టు-వెహికల్ (V2V) ఛార్జింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. పవర్డ్ టెయిల్‌గేట్ & సిక్స్-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు అందించారు.
రెగ్యులర్ విండ్‌సోర్ EVలో కూడా 15.6-అంగుళాల పెద్ద టచ్ స్క్రీన్, కార్ వెనుక AC వెంట్స్ & పైన పనోరమిక్ గ్లాస్ రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. డ్రైవర్ కోసం సిక్స్-వే పవర్ అడ్జస్టబుల్ సీటు, మిగిలినవాళ్ల కోసం ఫోర్-వే అడ్జస్టబుల్ సీట్లు అందించారు. దీనిలో ADAS టెక్నాలజీ, V2L & V2V ఫీచర్లు లేవు.
డిజైన్:
విండ్‌సోర్ ప్రో కొత్త డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇది సెలాడాన్ బ్లూ, గ్లేజ్ రెడ్ & అరోరా సిల్వర్ కలర్స్‌లో లభిస్తుంది. కనెక్టెడ్ LED DRLs, ప్రకాశవంతమైన బ్రాండ్ లోగో, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ & LED హెడ్ & టెయిల్ లాంప్‌లతో స్టైలిష్ లుక్స్ ఇస్తుంది. రెగ్యులర్ విండ్‌సోర్ EVలో కూడా 18-అంగుళాల డైమండ్-కట్ వీల్స్ ఉన్నాయి, అయితే 'ప్రో'లో అందించిన స్పెషల్ డిజైన్ ఎలిమెంట్స్ లేవు.
బూట్ కెపాసిటీ:
స్టాండర్డ్ విండ్‌సోర్ ప్రో 604 లీటర్ల బూట్ కెపాసిటీ ఇస్తుంది. పెద్ద బ్యాటరీ ప్యాక్ కారణంగా విండ్‌సోర్ ప్రో బూట్ స్పేస్ 579 లీటర్లకు తగ్గింది. అయితే, ఈ వ్యత్యాసం పెద్ద ప్రభావమేమీ చూపదు.
ఛార్జింగ్ సమయం:
రెగ్యులర్ విండ్‌సోర్ EV DC ఫాస్ట్ ఛార్జర్‌తో 20% నుంచి 80% వరకు ఛార్జ్ చేయడానికి 55 నిమిషాలు పడుతుంది. పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉన్నప్పటికీ, విండ్‌సోర్ ప్రో తక్కువ సమయం తీసుకుంటుంది - 50 నిమిషాల్లో 20-80% ఛార్జ్ అవుతుంది.
క్రెటా EV, టాటా కర్వ్ EV వంటి ప్రత్యర్థి కార్‌లకు పోటిగా MG విండ్‌సోర్ ప్రో మార్కెట్‌లోకి వచ్చింది.





















