Windsor EV Pro: విండ్‌సోర్ EV Pro కొనడానికి బ్యాంక్ ఎంత లోన్ ఇస్తుంది? - డౌన్ పేమెంట్, EMI ఎంత?
MG Windsor EV Pro On Loan EMI: ఎంజీ మోటార్ విండ్‌సోర్ ఈవీ ప్రో వెర్షన్ కొనడానికి పూర్తి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు, EMI ఆప్షన్‌లో ఈజీగా కొనుగోలు చేయవచ్చు.

MG Windsor EV Pro Price And Features: కామన్ మ్యాన్ కలులుగనే మైలేజ్‌తో MG మోటార్ ఇటీవలే "విండ్‌సోర్ EV ప్రో" వెర్షన్‌ను లాంచ్ చేసింది. కుటుంబం కోసం స్టైలిష్, సేఫ్టీ & లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్ కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ కార్ కామధేనువు అవుతుంది. MG విండ్‌సోర్ EV ప్రో వెర్షన్‌లో గతంలో ఎన్నడూలేనంత పెద్ద కెపాసిటీతో, 52.9 kWh బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీని ఒకసారి ఫుల్‌గా రీఛార్జ్ చేస్తే ఏకంగా 449 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు, దూర ప్రయాణాలకు సూపర్ ఆప్షన్ అవుతుంది.
ఎక్స్-షోరూమ్ ధర & ఆన్-రోడ్ ధర
తెలుగు రాష్ట్రాల్లో, MG విండ్‌సోర్ EV ప్రో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర (MG Windsor EV Pro Ex-showroom Price) 13,99,800 రూపాయలు. RTO, ఇన్సూరెన్స్, TCS, ఇతర ఛార్జీలు కలిపి ఆన్-రోడ్ ధర (MG Windsor EV Pro On-road Price) దాదాపు రూ. 19.85 లక్షల వరకు ఉంటుంది. ఈ ధర వాహన మోడల్, వేరియంట్ & లోకల్ టాక్స్‌లపై ఆధారపడి ఉంటుంది. కొన్ని డీలర్‌షిప్‌లలో ఆఫర్‌లు కూడా ఉండవచ్చు, ధర తగ్గవచ్చు.
డౌన్ పేమెంట్ & EMI
MG విండ్‌సోర్ EV ప్రో కొనడానికి ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టలేనివాళ్లు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు. మీ దగ్గర రూ. 5 లక్షలు ఉన్నాయనుకుందాం. ఆ మొత్తాన్ని డౌన్ పేమెంట్ చేసి, మిగిలిన మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణం తీసుకోవచ్చు. అంటే దాదాపు రూ. 14.85 లక్షల లోన్ తీసుకోవచ్చు. బ్యాంక్ 9% వడ్డీ రేటుతో ఈ రుణం మంజూరు చేసిందని భావిద్దాం.
* బ్యాంకు నుంచి 5 సంవత్సరాల (60 నెలలు) కాల పరిమితితో లోన్ తీసుకుంటే, 9% వడ్డీ రేటు చొప్పున, మీ EMI నెలకు రూ. 30,826 అవుతుంది. ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు మొత్తం రూ. 3,64,569 వడ్డీ చెల్లిస్తారు.
* 6 సంవత్సరాల (72 నెలలు) టెన్యూర్‌తో రుణం పొందితే, 9% వడ్డీ చొప్పున, మీరు నెలకు రూ. 26,768 చెల్లించాలి. ఈ 6 సంవత్సరాల కాలంలో మీరు మొత్తం రూ. 4,42,290 వడ్డీ చెల్లిస్తారు.
* 7 సంవత్సరాల (84 నెలలు) కాలానికి కార్ లోన్ తీసుకుంటే, 9% వడ్డీ రేటు చొప్పున, మీ EMI నెలకు రూ. 23,892 అవుతుంది. ఈ 7 సంవత్సరాల కాలంలో మీరు మొత్తం రూ. 5,21,952 వడ్డీ చెల్లిస్తారు.
బ్యాంక్ విధానాలు & మీ CIBIL స్కోర్ ప్రకారం వడ్డీ రేటు మారవచ్చు.
బ్యాటరీ, ఛార్జింగ్ & పరిధి
MG విండ్‌సోర్ EV ప్రోలో కనిపించే 52.9 kWh బ్యాటరీ ఈ విభాగంలోని అతి పెద్ద బ్యాటరీలలో ఒకటి. ఇది 449 కి.మీ. డ్రైవింగ్ రేంజ్ (ARAI సర్టిఫైడ్) ఇస్తుంది, ఇది మునుపటి స్టాండర్డ్ మోడల్ కంటే చాలా ఎక్కువ (ఇది 38 kWh బ్యాటరీతో 331 కి.మీ. రేంజ్ అందించింది). ఈ కారు వేగవంతమైన ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది, తద్వారా తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించడానికి సిద్ధం కావచ్చు. దీనికి V2L & V2V ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అంటే, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా కార్లను ఛార్జ్ చేయడానికి ఈ కార్ ఒక పవర్ బ్యాంక్‌గానూ మారుతుంది.
ఫీచర్లు & సేఫ్టీ
MG విండ్‌సోర్ EV ప్రో లాంగ్ రేంజ్‌తో పాటు అడ్వాన్స్‌డ్ ఫీచర్లు & సేఫ్టీ టెక్నాలజీకి కూడా నిలయంగా ఉంటుంది. ఇందులో లెవల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్)ను ఇన్-బిల్ట్ చేశారు. ఈ కారులో పనోరమిక్ గ్లాస్ రూఫ్ ఉంది, బయటి పరిసరాలను అత్యంత అందంగా ఇది చూపిస్తుంది. 15.6-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ & 8.8-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా అమర్చారు, ఇవి లాంగ్ డ్రైవ్‌లను మరింత ఇంటరాక్టివ్‌గా & ఈజీగా మారుస్తాయి. వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ & స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఈ బండిని టెక్-ఫ్రెండ్లీ అనిపిస్తాయి. భద్రత విషయానికి వస్తే... ఇందులో మల్టీ ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ (EBD) & యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో MG విండ్‌సోర్ EV ప్రోను డిజైన్ చేశారు.





















