అన్వేషించండి

MG Windsor EV Pro: 'టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌' కొత్త 'MG విండ్‌సోర్‌ EV ప్రో' - షాకింగ్‌ ఫీచర్లతో షేక్‌ చేస్తోందిగా!

MG Windsor EV Pro Features: MG మోటార్ ఇండియా, ఈ నెల 6న, Windsor EV Pro ను లాంచ్‌ చేసింది. ఈ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ టాప్-10 ఫీచర్లు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.

MG Windsor EV Pro Price And Features: ఎంజీ మోటర్‌ ఇండియా కొత్తగా లాంచ్‌ చేసిన Windsor EV Pro ఇప్పుడు 'టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌'గా నిలిచింది. ఈ బండి ప్రత్యేకతల గురించి తెలుసుకోవడానికి కార్‌ ప్రేమికులు బాగా ఆసక్తి చూపుతున్నారు. ఈ కారు, సొంత బ్రాండ్‌లోని మునుపటి మోడళ్ల కంటే మెరుగ్గా ఉండటమే కాకుండా, ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక ఇతర బ్రాండ్‌ ఎలక్ట్రిక్ కార్ల కంటే కూడా ఓ అడుగు ముందుంది. 

విండ్‌సోర్‌ ఈవీ ప్రో టాప్-10 ఫీచర్లు

1. పెద్ద బ్యాటరీ 
భారతదేశంలో మొట్టమొదటిసారిగా, MG విండ్‌సోర్‌ EV ప్రో 52.9 kWh పెద్ద బ్యాటరీతో లాంచ్‌ అయింది. ఈ బ్యాటరీ, ఈ కంపెనీ అంతర్జాతీయ మోడళ్ల కంటే శక్తిమంతమైనది. దీని అర్థం, ఇప్పుడు ఈ కారు ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యాన్ని పెంచుకుంది, కాబట్టి, మళ్లీ మళ్లీ ఛార్జ్ చేయడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

2. 449 km సుదూర పరిధి
52.9 kWh పెద్ద బ్యాటరీ కారణంగా, MG విండ్‌సోర్‌ EV ప్రో వెర్షన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 449 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. మునుపటి వెర్షన్‌తో పోలిస్తే దీని పరిధి 117 కిలోమీటర్లు పెరిగింది. తద్వారా.. దూర ప్రయాణాలకు & హైవే డ్రైవింగ్‌కు బెస్ట్‌ ఆప్షన్‌గా మారింది.

3. ఫాస్ట్ ఛార్జింగ్‌తో 60 నిమిషాల్లో 80% ఛార్జ్
ఈ బండి ఛార్జింగ్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. దీనిలో అందించిన 60kW DC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఈ కారు కేవలం 1 గంటలోనే 20% నుంచి 80% వరకు ఛార్జ్ అవుతుంది. పాత మోడల్‌లో 45kW ఛార్జింగ్ ఉంది, దీని కంటే ప్రస్తుత ఛార్జర్‌ సూపర్‌ ఫాస్ట్‌.

4. అధునాతన ADAS ఫీచర్లు 
MG విండ్‌సోర్‌ EV ప్రో అధునాతన ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) ఫీచర్లతో ప్యాక్‌ అయింది. ఇది డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా & టెక్నికల్‌గా మారుస్తింది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ కూడా ఉంది, ఇది ట్రాఫిక్‌ రద్దీని బట్టి వాహనం వేగాన్ని ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది, పదే పదే బ్రేక్ వేయడం & స్పీడ్‌ పెంచడం అవసరాలను తొలగిస్తుంది. లేన్ కీప్ అసిస్ట్ ఫీచర్‌ ఈ వాహనాన్ని సరైన లైన్‌లో ఉంచుతుంది, హైవేపై డ్రైవింగ్‌ను సులభంగా మారుస్తుంది. 

5. పవర్డ్ టెయిల్‌గేట్ - లగ్జరీ కారు లాంటి ఫీచర్
ఈ కారులో పవర్డ్ టెయిల్‌గేట్ సౌకర్యాన్ని కూడా MG యాడ్‌ చేసింది. ఇప్పుడు ఒకే ఒక్క బటన్‌ నొక్కి బూట్‌ను తెరవవచ్చు లేదా మూసివేయవచ్చు. తరచూ లగేజీని లోడ్ చేసుకునేవారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.

6. కొత్త స్పోర్టీ అల్లాయ్ వీల్ డిజైన్ 
విండ్‌సోర్‌ EV ప్రోను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి స్పోర్టీ అల్లాయ్ వీల్స్ కొత్త డిజైన్‌ను ప్రవేశపెట్టింది. ఈ చక్రాలు అందంగా కనిపించడమే కాకుండా, కారు ఏరోడైనమిక్స్ & రోడ్ గ్రిప్‌ను మెరుగుపరుస్తాయి.

7. V2L & V2V టెక్నాలజీ
MG విండ్‌సోర్‌ EV ప్రో V2L (వెహికల్ టు లోడ్) & V2V (వెహికల్ టు వెహికల్) టెక్నాలజీతో వచ్చింది. అంటే, కారు పవర్ స్టేషన్‌గానూ మారుతుంది. ఈ టెక్నాలజీ సహాయంతో మీ మొబైల్, గృహోపకరణాలు & ఇతర ఎలక్ట్రిక్ వాహనాలను కూడా మీ కారు బ్యాటరీ నుంచి నేరుగా ఛార్జ్ చేయవచ్చు. ఈ వ్యవస్థ 3kW వరకు విద్యుత్ అందించగలదు, ఇది అత్యవసర పరిస్థితుల్లో లేదా బహిరంగ ప్రయాణాలలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 

8. మూడు కొత్త రంగులు 
MG విండ్‌సోర్‌ EV ప్రో మూడు కొత్త & ఆకర్షణీయమైన కలర్‌ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంది. ఈ రంగులు కారును మునుపటి కంటే స్టైలిష్‌గా & ఫ్రెష్‌ లుక్‌ ఇస్తున్నాయి. కంపెనీ, పాత బీజ్‌ కలర్‌ను నిలిపేసింది, ఈ కొత్త రంగులతో ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చింది.

9. డ్యూయల్-టోన్ ఇంటీరియర్స్ 
కారు లోపలి భాగం కూడా మరింత లగ్జరీగా మారింది. బీజ్‌ & బ్లాక్‌ కలర్‌ల డ్యూయల్-టోన్ థీమ్‌తో ప్రీమియం ఫీలింగ్‌ కలుగుతోంది.

10. కొత్త టాప్ వేరియంట్ - "ఎసెన్స్ ప్రో"
MG విండ్‌సోర్‌ EV ప్రోలో టాప్-ఎండ్ వేరియంట్‌గా కొత్త Essence Pro లాంచ్‌ అయింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 17.50 లక్షలు. ఇది గత ఎసెన్స్ వేరియంట్ కంటే రూ.1.35 లక్షలు ఎక్కువ ఖరీదు.

టాప్ హెడ్ లైన్స్

టోల్‌గేట్‌ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్స్‌!
కేవలం రూ.350 మంత్లీ పాస్‌.. ఒక నెలలో టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా ప్రయాణం!
సిటీ రైడింగ్‌ అయినా, ఆఫ్‌రోడ్ ట్రైల్స్‌ అయినా.. Decathlon కొత్త సైకిళ్ల ప్రత్యేకతలివే!
డెకాథ్లాన్ నుంచి 3 కొత్త సైకిళ్లు.. Rockrider సిరీస్‌లో అదిరిపోయే మోడల్స్!
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి, EMI ఎంత పడుతుంది?
ఎక్కువ డబ్బు అవసరం లేదు, చాలా తక్కువ డౌన్‌పేమెంట్‌తోనే RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ కొనవచ్చు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Embed widget