అన్వేషించండి

Hyundai Venue 2025: Creta, Alcazar నుంచి అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు కాపీ, బిగ్‌ SUV తరహా లాంచ్‌!

2025 Hyundai Venue నవంబర్‌ 4న లాంచ్‌ అవుతుంది. ఈసారి కొత్త డిజైన్‌తో పాటు Creta, Alcazar నుంచి లెవల్‌-2 ADAS, 12.3 ఇంచ్‌ డిస్‌ప్లే, పానోరమిక్‌ సన్‌రూఫ్‌ వంటి ఫీచర్లు కూడా రానున్నాయి.

2025 Hyundai Venue Launch Date Price: హ్యుందాయ్‌ కంపెనీ ఈ ఏడాది నవంబర్‌ 4న తన కొత్త 2025 Hyundai Venue ని భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. ఇది పూర్తిగా కొత్త తరం సబ్‌-4 మీటర్‌ SUV. ఈసారి డిజైన్‌తో పాటు టెక్నాలజీ, ఫీచర్ల పరంగా కూడా భారీ అప్‌డేట్లు రాబోతున్నాయి. ముఖ్యంగా Creta, Alcazar వంటి పెద్ద SUVలలో ఉన్న టాప్‌ ఫీచర్లలో చాలా ఇప్పుడు కొత్త వెన్యూలో కూడా అందుబాటులోకి వస్తున్నాయి.

1. లెవల్‌-2 ADAS (Confirmed!)
కొత్త వెన్యూ లెవల్‌-2 ADASతో వస్తుందని హ్యుందాయ్‌ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత మోడల్‌లో లెవల్‌-1 మాత్రమే ఉండగా, కొత్త టెక్‌తో ఇది మరింత సేఫ్‌గా, స్మార్ట్‌గా మారనుంది. తద్వారా ఆటోమేటిక్‌ బ్రేకింగ్‌, లేన్‌ కీప్‌ అసిస్ట్‌, ఫార్వర్డ్‌ కొలిజన్‌ వార్నింగ్‌ వంటి ఫీచర్లు అందుతాయి.

2. పెద్ద 12.3 ఇంచ్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌ (Confirmed!)
Creta, Alcazar రెండింట్లో 10.25 ఇంచ్‌ స్క్రీన్లు ఉన్నా, కొత్త వెన్యూ 12.3 ఇంచ్‌ టచ్‌స్క్రీన్‌తో రానుంది. ఇది ఈ సెగ్మెంట్‌లోనే అతిపెద్ద డిస్‌ప్లే అవుతుంది. యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ కూడా కొత్తగా డిజైన్‌ చేశారు.

3. పానోరమిక్‌ సన్‌రూఫ్‌
ప్రస్తుత వెన్యూ సింగిల్‌ ప్యానెల్‌ సన్‌రూఫ్‌తో మాత్రమే వచ్చింది. 2025 వెర్షన్‌లో పానోరమిక్‌ సన్‌రూఫ్‌ రానుంది - ఇది ఈ సైజ్‌ SUVల్లో అరుదుగా లభించే ఫీచర్‌. Tata Nexon, Kia Syros, XUV 3XO లాంటి కాంపిటీటర్లతో పోటీగా ఇది హ్యుందాయ్‌ వెన్యూని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది.

4. డ్యూయల్‌-జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌
కొత్త వెన్యూ ఇప్పుడు డ్యూయల్‌-జోన్‌ ఆటోమేటిక్‌ ACతో వస్తుందనే అంచనాలు ఉన్నాయి. అంటే డ్రైవర్‌, కో-డ్రైవర్‌ ఇద్దరూ తమకు కావలసిన ఉష్ణోగ్రతను వేర్వేరుగా సెట్‌ చేసుకోవచ్చు. ఇది కంఫర్ట్‌ లెవల్‌ను మరింత పెంచుతుంది.

5. వెంటిలేటెడ్‌ సీట్లు
Creta, Alcazar మాదిరిగా కొత్త వెన్యూ కూడా ఫ్రంట్‌, రియర్‌ వెంటిలేటెడ్‌ సీట్లతో రావొచ్చు. వేడిగా ఉన్న వాతావరణంలో ఇవి చాలా ఉపయోగపడతాయి.

6. కో-డ్రైవర్‌ పవర్‌ సీటు
ఇప్పటి వెన్యూలో డ్రైవర్‌ సీటు మాత్రమే పవర్‌ అడ్జస్టబుల్‌గా ఉంటుంది. కానీ కొత్త వెర్షన్‌లో కో-డ్రైవర్‌ పవర్‌ సీటు కూడా ఇలాగే వచ్చే అవకాశం ఉంది. ఇది ఇప్పటివరకు కేవలం ప్రీమియం SUVల్లో మాత్రమే ఉంది.

7. 8 స్పీకర్‌ బోస్‌ ఆడియో సిస్టమ్‌
మ్యూజిక్‌ లవర్స్‌ కోసం పెద్ద అప్‌డేట్‌ ఇదే!. కొత్త వెన్యూ ఇప్పుడు బోస్‌ 8-స్పీకర్‌ సౌండ్‌ సిస్టమ్‌తో రానుంది. ఇది సౌండ్‌ క్వాలిటీని మరో లెవల్‌కి తీసుకెళ్తుంది.

8. 360-డిగ్రీ కెమెరా
పార్కింగ్‌ లేదా సిటీ డ్రైవింగ్‌లో సేఫ్టీ కోసం కొత్త వెన్యూ 360-డిగ్రీ కెమెరా సపోర్ట్‌ పొందబోతోంది. టైట్‌ స్పేస్‌లలో కూడా సులభంగా మలుపులు తీసుకోవచ్చు.

9. ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌
ఈ ఫీచర్‌ ఇప్పటికే XUV 3XO, Kia Syros లాంటివి అందిస్తున్నాయి. ఇప్పుడు వెన్యూ కూడా ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌తో రానుంది.

10. ఫ్రంట్‌ పార్కింగ్‌ సెన్సర్లు
కొరియా టెస్టింగ్‌ ఫోటోల్లో ఇప్పటికే ఈ ఫీచర్‌ కనిపించింది. అంటే కొత్త వెన్యూ ఫ్రంట్‌ పార్కింగ్‌ సెన్సర్లు కూడా కలిగి ఉంటుంది.

2025 Hyundai Venue డిజైన్‌ మాత్రమే కాదు, ఫీచర్ల పరంగా కూడా పెద్ద SUVలతో సమానంగా మారబోతోంది. ఈ అప్‌డేట్స్‌ వల్ల వెన్యూ ఇప్పుడు మరింత లగ్జరీ, టెక్‌-ఫ్రెండ్లీ, యూత్‌ఫుల్‌ SUVగా మారుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - ABP దేశం ఆటో సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget