Toyota Glanza 2022 First review: రూ.6.4 లక్షల్లోనే కొత్త గ్లాంజా - ఎలా ఉందో చూసేయండి!
టొయోటా తన కొత్త కారును మార్కెట్లో లాంచ్ చేసింది. అదే 2022 టొయోటా గ్లాంజా. దీని ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
గతంలో లాంచ్ అయిన టొయోటా గ్లాంజా (Toyota Glanza) కేవలం బలెనో తరహాలోనే ఉండేది. దీంతోపాటు ఇందులో కొన్ని వేరియంట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే టొయోటా గ్లాంజా కొత్త వేరియంట్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఇప్పుడు వచ్చిన గ్లాంజా దీనికి ముందు వెర్షన్ల కంటే స్టైలిష్ లుక్‌తో ప్రీమియం ఫీచర్లతో లాంచ్ అయింది. ఈ కారు ముందువైపు లుక్ పూర్తిగా మారిపోయింది. కామ్రీ ప్లస్ తరహాలో కొత్త లుక్ ఉన్న బంపర్‌ను టొయోటా గ్లాంజాలో అందించారు. గ్లాంజా డీఆర్ఎల్ సిగ్నేచర్ కూడా ఇంతకుముందు వెర్షన్ కంటే కొత్తగా ఉంది.
బలెనోతో (Maruti Baleno) పోలిస్తే ఇందులో కొన్ని మార్పులు కూడా ఉన్నాయి. దీని లోపల కూడా డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్‌నే కంపెనీ అందించడం విశేషం. స్పోర్టింగ్ రెడ్, గేమింగ్ గ్రే, ఎంటైసింగ్ సిల్వర్, ఇన్‌స్టా బ్లూ, కేఫ్ వైట్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీని లుక్ కూడా మరింత అగ్రెసివ్‌గా ఉంది. ఇందులో కొత్త డ్యాష్ బోర్డును అందంచారు. ఇంతకుముందు వచ్చిన గ్లాంజా కంటే పెద్ద టచ్ స్క్రీన్ కూడా ఇందులో ఉంది. కొత్త ఫీచర్లు కూడా ఇందులో అందించారు.
గ్లాంజా మరిన్ని వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. ఈ, ఎస్, జీ, వీ మోడళ్లలో ఈ కారు కొనుగోలు చేయవచ్చు. వీటిలో టొయోటా గ్లాంజా ఈ-వేరియంట్ ధర రూ.6.39 లక్షలుగా ఉంది. ఇక టొయోటా గ్లాంజా ఎస్-వేరియంట్‌లో మాన్యువల్ మోడల్ ధర రూ.7.29 లక్షలు కాగా, ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.7.79 లక్షలుగా ఉంది.
టొయోటా గ్లాంజా జీ-వేరియంట్ మాన్యువల్ మోడల్ ధర రూ.8.24 లక్షలు కాగా... ఆటోమేటిక్ మోడల్ ధర రూ.8.74 లక్షలుగా ఉంది. టాప్ ఎండ్ అయిన టొయోటా గ్లాంజా వీ-వేరియంట్‌లో మాన్యువల్ మోడల్ ధరను రూ.9.19 లక్షలుగానూ, ఆటోమేటిక్ మోడల్ ధర రూ.9.69 లక్షలుగా నిర్ణయించారు.
ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్, క్లైమెట్ కంట్రోల్, 9 అంగుళాల టచ్ స్క్రీన్, 360 డిగ్రీల కెమెరాలు, వెనకవైపు ఏసీ వెంట్లు కూడా ఇందులో అందించారు. 90 బీహెచ్‌పీ సామర్థ్యం ఉన్న 1.2 లీటర్ డ్యూయల్ జెట్ ఇంజిన్‌ను ఇందులో అందించారు. ఇది అదనపు మైలేజ్‌ను కూడా అందించనుంది.
ఇందులో ఏఎంటీ వెర్షన్, మాన్యువల్ గేర్ బాక్స్ కూడా అందించారు. ప్రారంభ వేరియంట్ ధర రూ.6.39 లక్షలుగా ఉంది. ఫుల్లీ లోడెడ్ ఏఎంటీ వేరియంట్ ధర రూ.9.69 లక్షలుగా నిర్ణయించారు. ఏఎంటీ వెర్షన్ ఎస్ వేరియంట్ నుంచి అందుబాటులో ఉంది. ఈ కారు ఐ20, ఆల్ట్రోజ్, బలెనోలతో పోటీ పడనుంది.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?