2022 Maruti Suzuki XL6: మారుతి కొత్త ఎక్స్ఎల్6 వచ్చేసింది - సూపర్ ఫీచర్లు - ఎలా ఉందో చూశారా?

మారుతి సుజుకి కొత్త ఎక్స్ఎల్6 మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.11.29 లక్షల నుంచి ప్రారంభం కానుంది.

FOLLOW US: 

మారుతి సుజుకి మనదేశంలో ఈ నెలలోనే కొత్త ఎర్టిగాను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎక్స్ఎల్6లో కూడా ఫేస్ లిఫ్ట్ వేరియంట్‌ను కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ధరను రూ.11.29 లక్షలుగా (ఎక్స్-షోరూం) నిర్ణయించారు. 2019లో లాంచ్ అయిన ఎక్స్ఎల్6లో ఇదే మొదటి ఫేస్ లిఫ్ట్ మోడల్. ఇందులో కొన్ని మెకానికల్, ఫంక్షనల్ ఛేంజెస్‌ను మారుతి చేసింది. కొత్త ఎర్టిగా తరహాలో ఎక్స్ఎల్6లో కూడా పూర్తిగా కొత్త పెట్రోల్ ఇంజిన్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంది.

ఇందులో కొత్త తరహా గ్యాడ్జెట్లను కూడా కంపెనీ అందించింది. ఈ కారు లుక్‌లో కూడా మారుతి పలు మార్పులు చేసింది. దీనికి సంబంధించిన బుకింగ్స్ మనదేశంలో గతవారమే ప్రారంభం అయ్యాయి. దీని డెలివరీలు కూడా త్వరలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

ఈ కారులో గ్రిల్‌ను కొత్తగా డిజైన్ చేశారు. 3డీ టెయిల్ లైట్స్ కూడా ఉన్నాయి. 16 అంగుళాల అలోయ్ వీల్స్ అందించారు. మూడు కొత్త కలర్ ఆప్షన్లు, ఆల్ఫా ప్లస్ టాప్ ఎండ్ వేరియంట్ కూడా ఉంది. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే... గతంలో ఉన్న మోడల్‌కు, ఈ మోడల్‌కు పెద్ద తేడా లేదు.

ఏడు అంగుళాల టచ్ స్క్రీన్, రిమోట్ ఏసీ స్టార్ట్, ఆన్ బోర్డ్ వాయిస్ అసిస్టెంట్, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఈ కారులో అందించారు. వీటితో పాటు క్రూజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఏసీ, రెండు, మూడో వరుసల కోసం ఎయిర్ కాన్ వెంట్స్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, కీలెస్ ఎంట్రీ, ఐడిల్ స్టాప్ స్టార్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

1.5 లీటర్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవీటీ ఇంజిన్ అందించారు. ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌తో పాటు ప్యాడిల్ షిఫ్టర్స్ ఉన్న సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లు ఇందులో ఉన్నాయి. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మోడల్ లీటరుకు 20.51 కిలోమీటర్ల మైలేజ్‌ను, ఆటోమేటిక్ గేర్ బాక్స్ మోడల్ లీటరుకు 20.3 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనుంది.

కొత్త మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ధర
⦿ ఈ కారు జెటా వేరియంట్లో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ ధర రూ.11.29 లక్షలుగానూ, ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.12.79 లక్షలుగానూ ఉంది.
⦿ ఆల్ఫా వేరియంట్ మాన్యువల్ మోడల్‌ను రూ.12.29 లక్షలకు, ఆటోమేటిక్ మోడల్‌ను రూ.13.79 లక్షలకు కొనుగోలు చేయవచ్చు.
⦿ ఆల్ఫా ప్లస్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.12.89 లక్షలు కాగా... ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.14.39 లక్షలుగా ఉంది.
⦿ ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన ఆల్ఫా ప్లస్ డ్యూయల్ టోన్ మాన్యువల్ ధరను రూ.13.05 లక్షలుగానూ... ఆటోమేటిక్ వేరియంట్ ధరను రూ.14.55 లక్షలుగానూ నిర్ణయించారు. (ఇవన్నీ ఎక్స్-షోరూం ధరలే.)

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

Published at : 24 Apr 2022 05:14 PM (IST) Tags: 2022 Maruti Suzuki XL6 Price in India 2022 Maruti Suzuki XL6 Launched 2022 Maruti Suzuki XL6 Features 2022 Maruti Suzuki XL6 New Maruti Suzuki XL6

సంబంధిత కథనాలు

World Costliest Car: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు - ఏకంగా రూ.1108 కోట్లు - దీని ప్రత్యేక ఏంటంటే?

World Costliest Car: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు - ఏకంగా రూ.1108 కోట్లు - దీని ప్రత్యేక ఏంటంటే?

Mahindra Scorpio N: కొత్త మహీంద్రా స్కార్పియో లాంచ్ అయ్యేది అప్పుడే - ప్రకటించిన కంపెనీ!

Mahindra Scorpio N: కొత్త మహీంద్రా స్కార్పియో లాంచ్ అయ్యేది అప్పుడే - ప్రకటించిన కంపెనీ!

Maruti Suzuki New Facility: కొత్త ప్లాంట్ పెడుతున్న మారుతి సుజుకి - రూ.20 వేల కోట్ల పెట్టుబడి, 13 వేల ఉద్యోగాలు - ఎక్కడో తెలుసా?

Maruti Suzuki New Facility: కొత్త ప్లాంట్ పెడుతున్న మారుతి సుజుకి - రూ.20 వేల కోట్ల పెట్టుబడి, 13 వేల ఉద్యోగాలు - ఎక్కడో తెలుసా?

Santro Stopped: ఆ బడ్జెట్ కారును ఆపేసిన హ్యుండాయ్ - ఉత్పత్తి నిలిపివేసిన కంపెనీ!

Santro Stopped: ఆ బడ్జెట్ కారును ఆపేసిన హ్యుండాయ్ - ఉత్పత్తి నిలిపివేసిన కంపెనీ!

Hyundai Santro: చిన్న కార్లు కొనే కస్టమర్లకు ‘హ్యుందాయ్’ బ్యాడ్ న్యూస్, ఆ హ్యాచ్‌బ్యాక్ కారు ఇక కనిపించదా?

Hyundai Santro: చిన్న కార్లు కొనే కస్టమర్లకు ‘హ్యుందాయ్’ బ్యాడ్ న్యూస్, ఆ హ్యాచ్‌బ్యాక్ కారు ఇక కనిపించదా?

టాప్ స్టోరీస్

CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!

Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!

Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?

Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?

Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా

Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా