Astrology: ఈ రాశులవారి మనస్తత్వం చిన్నపిల్లల్లా ఉంటుంది!
Astrology: ఓ వ్యక్తి మనస్తత్వాన్ని వారి జన్మనక్షత్రం, రాశి ఆధారంగా కూడా నిర్ణయిస్తారు. అయితే ఒక్కో రాశివారిలో ఒక్కో ప్రత్యేకమైన లక్షణాలుంటాయి. ఈ 4 రాశులవారిది చిన్న పిల్లల మనస్తత్వంలా ఉంటుందంటారు
Most Childish Zodiac Signs: ప్రతి ఒక్కరిలోనూ మంచి లక్షణాలు ఉంటాయి చెడు లక్షణాలూ ఉంటాయి, కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. మంచి చెడు అన్నీ పెరిగిన వాతావరణం, చదివిన చదువు , నేర్చుకున్న సంస్కారంపై ఆధారపడి ఉంటాయి. అయితే కొన్ని లక్షణాలు మాత్రం మీరు జన్మించిన రాశి ఆధారంగా ఉంటాయి. ఈ 5 రాశులవారు ఎంత పెద్ద అయినా కానీ కొన్నీ విషయాల్లో మాత్రం చిన్నపిల్లల్లానే ఉంటారు. చిన్న పిల్లల్లా బిహేవ్ చేయొద్దనే మాట చాలామంది అంటుంటారు కదా...ఇలాంటివాళ్లకోసమే ఆ మాట... మరి చిన్న పిల్లల్లాంటి మనస్తత్వం మీకుందా...ఇందులో మీ రాశి ఉందా ఓసారి చెక్ చేసుకోండి....
మేష రాశి (Aries)
మేష రాశికి అంగారకుడు అధిపతి. శక్తికి, ఉత్సాహనానికి సూచన అంగారకుడు. జీవితంలో నూతన ఉత్సాహాన్ని నిపంతాడు. అందుకే మేష రాశిలో జన్మించిన వారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఏపని చేపట్టినా దూసుకెళ్లిపోతారు. చిన్న పిల్లల్లా వీళ్లకి కూడా అస్సలు భయం అంటే ఏంటో తెలియదు. సవాళ్లను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉంటారు.
Also Read: ఈ మూడు రాశుల వారు ఎదుటివారి మనసు చదవగలరట!
మిథున రాశి (Gemini)
మిథున రాశికి బుధుడు అధిపతి. వీళ్లు మహా మాటకారులు. ఎప్పుడూ సంతోషంగా ఉంటారు..తమచుట్టూ ఉండేవారిని సంతోషంగా ఉంచుతారు. ఆనందం, కోపం, బాధ ఏదైనా క్షణాల్లో ప్రదర్శించేస్తారు. చురుగ్గా ఉంటారు..చిన్న చిన్న విషయాలకే ఆనందపడిపోతారు. వీరి సంభాషణలో ఎదుటివారిపై ఉండే ప్రేమ, ఆప్యాయత, బాధ్యత అన్నీ కనిపిస్తాయి..అదే సమయంలో చిన్న పిల్లల మనస్తత్వాన్ని గుర్తుచేస్తుంటారు. కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు.
సింహ రాశి (Leo)
ఈ రాశివారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి. తమ వారికి అన్నీ తామే చేయాలనే ఆలోచనతో ఉండే సింహరాశివారు తమ ప్రియమైనవారికి అన్నీ సమకూర్చి వీరిలో వీరే సంబరపడుతుంటారు. సూర్యుడితో పాలించే ఈ రాశివారి వ్యక్తిత్వంలో సూర్యుడి కాంతిలాంటి వెచ్చదనం, ఆనందం కనిపిస్తాయి. చిన్న పిల్లల్లా ఎంత ఉత్సాహంగా ఉంటారో..అంతే తొందరగా హర్ట్ అయిపోతారు.
Also Read: వృషభ రాశిలోకి బుధుడు - ఈ రాశులవారికి ఆర్థికంగా అదృష్టమే కానీ వ్యక్తిగత జీవితంలో సమస్యలు తప్పవు!
ధనస్సు రాశి (Sagittarius)
కొత్త విషయాలపై చిన్నారులకు ఎంత ఉత్సాహం ఉంటుందో ధనస్సు రాశివారి తీరు అలానే ఉంటుంది. ఏది వద్దని చెబితే అదే చేతిలోంచి లాక్కునేందుకు పిల్లలు తాపత్రయపడుతుంటారు...ధనస్సు రాశివారు కూడా అంతే. నూతన విషయాల అన్వేషణని ఎంజాయ్ చేస్తారు. పిల్లలకు సహజంగా ఇంట్లో కన్నా బయట తిరగడమే ఎక్కువ ఆసక్తి. ధనస్సు రాశిలో జన్మించినవారంతా ఇలానే ఉంటారు...ప్రయాణాలను ఎంజాయ్ చేస్తారు. వీళ్లెక్కడున్నా చుట్టుపక్కన ఉండేవారు సంతోషంగా ఉంటారు.
Also Read: 2025 మే వరకూ మీన రాశిలోనే రాహువు - ఈ రాశులవారికి ప్రతిరోజూ పండుగే!
గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.