అన్వేషించండి

August Horoscope 2025: ఆగష్టు 2025 మీ రాశిఫలం, కర్కాటక రాశివారికి మంచి రోజులు, మీనం వారికి చికాకులు!

August Monthly Horoscope 2025 : మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల కెరీర్, ఆరోగ్యం, వైవాహిక జీవితం, ధనానికి సంబంధించి ఆగష్టు నెల ఎలా ఉంటుంది.

ఆగష్టు 2025 మాస ఫలాలు - Monthly August Horoscope 2025

మేష రాశి (Aries Monthly August Horoscope 2025) 

ఈ నెలలో మేష రాశివారికి మిశ్రమ ఫలితాలుంటాయి. అనుకోకుండా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. నూతన పరిచయాలు కలిసొస్తాయి. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
 
వృషభ రాశి (Taurus Monthly August Horoscope 2025)

వృషభ రాశి వారికి ఆగష్టు నెలలో మంచి ఫలితాలుంటాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. శత్రువులపై మీరు పైచేయి సాధిస్తారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు శుభవార్త వింటారు
 
మిథున రాశి (Gemini Monthly August Horoscope 2025) 

మిథున రాశివారికి ఆగష్టు నెల లాభదాయకంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారం, ఉద్యోగంలో మంచి ఫలితాలు పొందుతారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. వాహనసౌఖ్యం ఉంటుంది. భూ సంబంధిత వ్యవహారాల్లో లాభం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితులను కలుస్తారు. మీ గౌరవం పెరుగుతుంది.
 
కర్కాటక రాశి (Cancer Monthly August Horoscope 2025)  
 
ఆగష్టు నెల నుంచి కర్కాటక రాశివారికి మంచి రోజులు మొదలవుతాయి. మీరున్న రంగంలో అధ్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా అద్భుత ఫలితాలు సాధిస్తారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు.  కుటుంబంతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. నూతన పరిచయాలు మెరుగుపడతాయి.
 
సింహ రాశి (Leo Monthly August Horoscope 2025)

ఆగష్టు నెలలో సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. ప్రతికూల గ్రహ సంచారం వల్ల కోపం పెరుగుతుంది. అసహనంగా ఉంటారు. అనవసర వివాదాలకు దిగుతారు. ఆదాయాన్ని మించి ఖర్చులుంటాయి. వ్యసనాలబారిన పడతారు. చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. 

కన్యా రాశి  (Virgo Monthly August Horoscope 2025) 

ఈ నెలలో కన్యారాశివారికి అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ప్రతి రోజూ ఇబ్బందిగానే ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులుంటాయి. అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. సమయానికి డబ్బులు చేతికందవు. చేయని తప్పులకు నిందలు పడాల్సి వస్తుంది.
 
తులా రాశి (Libra Monthly August Horoscope 2025) 

ఈ నెలలో గ్రహాల అనుకూల సంచారం వల్ల అద్భుతంగా ఉంటుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. ప్రశాంతంగా ఉంటారు. ప్రతి విషయంలోనూ ఆధిక్యత సాధిస్తారు. అప్పులు తీరిపోతాయి. శత్రువులే మిత్రులవుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. 

వృశ్చిక రాశి (Scorpio Monthly August Horoscope 2025) 

వృశ్చిక రాశివారికి ఆగష్టు నెల అన్ని విధాలుగా బావుంటుంది. అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఏ విషయంలో అయినా ధైర్యంగా అడుగేస్తారు. నూతన వస్తులాభం ఉంటుంది. దైవసంబంధిత కార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు. 

ధనుస్సు రాశి  (Sagittarius Weekly Horoscope) 

ఈ నెలలోనూ ధనస్సు రాశివారికి మంచి ఫలితాలు ఉండవు. చీటికి మాటికి వివాదాలు, మాట పట్టింపులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. అనవసర కోపాన్ని ప్రదర్శిస్తారు. సంతానం కారణంగా ఇబ్బందిపడతారు. ఊహించని సంఘటనలు జరుగుతాయి. స్నేహితుల కారణంగా తీవ్రంగా నష్టపోతారు. ప్రారంభించిన పనులన్నీ మధ్యలోనే ఆగిపోతాయి.

మకర రాశి (Capricorn Monthly August Horoscope 2025)
 
మకర రాశివారికి ఆగష్టు నెలలో శుభఫలితాలుంటాయి. ఎలాంటి సమస్యను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. వాహనం కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. స్నేహితుల నుంచి సహాయం పొందుతారు. బంధుమిత్రులను కలుస్తారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు.  

కుంభ రాశి  (Aquarius Monthly August Horoscope 2025) 

కుంభ రాశివారికి ఆగష్టు నెలలో మంచి ఫలితాలుంటాయి. ఆదాయం పెరుగుతుంది. పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. అయితే అష్టమ స్థానంలో కుజుడి సంచారం అనారోగ్య సమస్యలుంటాయి. శారీరక శ్రమ ఉంటుంది..కోపంగా వ్యవహరిస్తుంటారు. అనుకున్న పనులకు అడ్డంకులు ఎదురవుతాయి.
 
మీన రాశి (Pisces Monthly August Horoscope 2025) 
 
ఆగష్టు నెలలో మీనరాశివారికి చికాకులు తప్పవు. మీ మాటకు గుర్తింపు ఉండదు. ఆర్థిక లావాదేవీల్లో చికాకులుంటాయి. మనోధైర్యం కోల్పోతారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుని తలనొప్పుల తెచ్చుకుంటారు. మాతృవర్గసూతకం ఉండొచ్చు. 

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana WEF 2026: టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రశంసలు! తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం! యువతకు నైపుణ్యాలపై శిక్షణ!  
టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రశంసలు! తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం! యువతకు నైపుణ్యాలపై శిక్షణ!  
మేడారం చుట్టుపక్కల 100 కిలోమీటర్ల లోపు సందర్శనీయ స్థలాలు ఇవి
మేడారం చుట్టుపక్కల 100 కిలోమీటర్ల లోపు సందర్శనీయ స్థలాలు ఇవి
Skin Care Tips : చర్మ సంరక్షణ చిట్కాలు.. నిద్రలోనే మీ చర్మాన్ని మెరిసేలా చేసే Skincare Secrets
చర్మ సంరక్షణ చిట్కాలు.. నిద్రలోనే మీ చర్మాన్ని మెరిసేలా చేసే Skincare Secrets
Mahashivratri 2026: మహాశివరాత్రి 15 లేదా 16 ఫిబ్రవరి ఎప్పుడు ? నాలుగు జాముల శివ పూజ ముహూర్తం తెలుసుకోండి!
2026 మహాశివరాత్రి 15 లేదా 16 ఫిబ్రవరి ఎప్పుడు ? నాలుగు జాముల శివ పూజ ముహూర్తం తెలుసుకోండి!

వీడియోలు

Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam
Medaram Jatara Day 1 Speciality | మేడారం జాతర మొదటి రోజు ప్రత్యేకత ఇదే | ABP Desam
MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana WEF 2026: టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రశంసలు! తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం! యువతకు నైపుణ్యాలపై శిక్షణ!  
టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రశంసలు! తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం! యువతకు నైపుణ్యాలపై శిక్షణ!  
మేడారం చుట్టుపక్కల 100 కిలోమీటర్ల లోపు సందర్శనీయ స్థలాలు ఇవి
మేడారం చుట్టుపక్కల 100 కిలోమీటర్ల లోపు సందర్శనీయ స్థలాలు ఇవి
Skin Care Tips : చర్మ సంరక్షణ చిట్కాలు.. నిద్రలోనే మీ చర్మాన్ని మెరిసేలా చేసే Skincare Secrets
చర్మ సంరక్షణ చిట్కాలు.. నిద్రలోనే మీ చర్మాన్ని మెరిసేలా చేసే Skincare Secrets
Mahashivratri 2026: మహాశివరాత్రి 15 లేదా 16 ఫిబ్రవరి ఎప్పుడు ? నాలుగు జాముల శివ పూజ ముహూర్తం తెలుసుకోండి!
2026 మహాశివరాత్రి 15 లేదా 16 ఫిబ్రవరి ఎప్పుడు ? నాలుగు జాముల శివ పూజ ముహూర్తం తెలుసుకోండి!
Republic Day 2026 : రిపబ్లిక్ డే ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? కుటుంబంతో తప్పక చూడాల్సిన చారిత్రాత్మక ప్రదేశాలు ఇవే
రిపబ్లిక్ డే ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? కుటుంబంతో తప్పక చూడాల్సిన చారిత్రాత్మక ప్రదేశాలు ఇవే
India vs New Zealand First T20: న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్‌లో భారత్ విజయం, 48 పరుగుల తేడాతో విక్టరీ!
న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్‌లో భారత్ విజయం, 48 పరుగుల తేడాతో విక్టరీ!
Pawan Kalyan: కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Embed widget