Daily horoscope 31st December 2024:ఏడాదిలో చివరి రోజు ఈ రాశులవారిలో విజయగర్వం తొణికిసలాడుతుంది!
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Daily horoscope 31st December 2024
మేష రాశి
ఇంటా బయటా మీకు గౌరవం పెరుగుతుంది. ఇంటికి అతిథుల రాకతో ఆనందంగా ఉంటారు. వ్యాపారంలో పెద్ద , సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలరు. మీరు డబ్బు లావాదేవీల నుంచి ప్రయోజనం పొందుతారు. మీపై ఉండే అంచనాలు నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు.
వృషభ రాశి
ఈ రోజు కుటుంబ పనుల్లో బిజీగా ఉంటారు. నూతన కార్యక్రమాలు ఈ రోజు ప్రారంభించవద్దు. ఈ రాశి ఉద్యోగులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. మతపరమైన కార్యకలాపాల పట్ల మీ ఆసక్తి తగ్గుతుంది. శారీరక మరియు మానసిక అలసట ఉండవచ్చు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
మిథున రాశి
ఈరోజు మీరు కుటుంబంతో కలిసి సంతోష సమయం స్పెండ్ చేస్తారు. కుటుంబంలో సామరస్య వాతావరణం ఉంటుంది. పిల్లల గురించి ఆందోళనలు ఉండవచ్చు. జ్ఞానవంతుల సహవాసం మీకు లాభదాయకంగా ఉంటుంది. మీరు కార్యాలయంలో చాలా బాగా పని చేస్తారు
Also Read: నూతన సంవత్సరం 2025 ఆరంభం ఈ రాశులవారికి బంగారంలా ఉంటుంది!
కర్కాటక రాశి
ఈ రోజు మీరు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలిగి ఉంటారు. ఉదార స్వభావిగా, పరోపకార వ్యక్తిగా ప్రజల్లో మీ ఇమేజ్ పెరుగుతుంది. క్లిష్ట పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారతాయి. దాంపత్య సంతోషం పెరుగుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ రోజు చాలా శుభప్రదమైనది,
సింహ రాశి
ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఒకరికి సలహా ఇవ్వడం వల్ల మీరు అవమానాలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఉద్యోగంలో అధికారుల సలహాలు తీసుకోవడం మేలు చేస్తుంది. అజాగ్రత్త కారణంగా నష్టపోతారు. మీ తీరు ప్రభావం పనిపై పడుతుంది.
కన్యా రాశి
ఈ రోజు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. కార్యాలయంలో కొత్త సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది. మీ ప్రియమైనవారితో కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు లాభపడతారు.
Also Read: మేషం to మీనం .. 2025 సంవత్సరం ఏ రాశివారి అదృష్టం ఎలా ఉంది!
తులా రాశి
ఈ రోజు మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేయడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పూర్వీకుల వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది. భార్యాభర్తలు ఒకరి భావాలను ఒకరు గౌరవించుకుంటారు. కుటుంబంలో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. మీరు మీ జీవిత భాగస్వామికి కొన్ని బహుమతులు ఇవ్వగలరు
వృశ్చిక రాశి
ఈ రాశివారు ఈ రోజు సంతోషంగా ఉంటారు. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు మీకు అనకూలంగా తీర్పు వస్తుంది. మీ తార్కిక శక్తిని అందరూ మెచ్చుకుంటారు. మీరు పాత సమస్యకు పరిష్కారాన్ని కనుగొనగలరు.
ధనుస్సు రాశి
ఈరోజు ఆర్థిక సంబంధిత సమస్యలు తీరుతాయి. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ఈ రోజు మంచింది. భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకునే సమయంలో స్నేహితులు , కుటుంబ సభ్యుల నుంచి సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం.
మకర రాశి
ఈ రోజు ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ప్రభుత్వోద్యోగాలు చేసేవారు ఉన్నత స్థానాలను పొందగలరు. అహంభావంతో ప్రవర్తిస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త.
కుంభ రాశి
ఈ రోజు కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. పిల్లలతో టైమ్ స్పెండ్ చేస్తారు. చాలా కాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతారు. పరిశోధన సంబంధింత ప్రాజెక్టులలో సక్సెస్ అవుతారు.
మీన రాశి
ఈ రోజు ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. అవసరమైన సమయంలో సన్నిహితుల నుంచి సహకారం అందుతుంది. మీ విజయాలపట్ల గర్వంగా ఉంటారు. ఈ రోజు చాలా ఈజీ అని మీరు భావించే పని పూర్తిచేయలేకపోతారు.
Note:ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.