Daily horoscope 30th December 2024: మార్గశిర అమావాస్య రోజు ఈ రాశులవారు ఆర్థిక సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి!
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Daily horoscope 30th December 2024
మేష రాశి
మీరు మీ సామాజిక ఇమేజ్ గురించి ఆందోళన చెందుతారు. పని పట్ల పెద్దగా ఆసక్తి ఉండదు. కానీ దూరదృష్టితో ఆలోచించడం వల్ల వ్యాపారంలో లాభం పొందుతారు. డబ్బు లావాదేవీలలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. మీరు అనవసరమైన ప్రయాణం చేయవలసి రావచ్చు.
వృషభ రాశి
ఈ రోజు మీ సన్నిహితులు మీ భావాలను గౌరవించరు. ఆర్థిక లావాదేవీలలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. వృత్తికి సంబంధించి కొన్ని చికాకులు ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి. మీ మొండి వైఖరి కారణంగా సమస్యలు పెంచుకోవద్దు
మిథున రాశి
ఈ రోజు మీ దినచర్య బావుంటుంది. కార్యాలయంలో పని సులభంగా చేసుకుంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. మీ ఆలోచనలను మీ ప్రేమికులతో పంచుకోవచ్చు. వ్యాపార సంక్లిష్టతల మధ్య లాభాలను ఆర్జించడంలో మీరు విజయం సాధిస్తారు.
Also Read: నూతన సంవత్సరం 2025 ఆరంభం ఈ రాశులవారికి బంగారంలా ఉంటుంది!
కర్కాటక రాశి
ఈ రోజు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునేవారికి మంచిది. మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి. వైవాహిక సంబంధాలలో మధురానుభూతి ఉంటుంది. పిల్లలు ఆన్‌లైన్ గేమ్‌లతో సమయం గడపవచ్చు. మనసులో కొత్త ఆలోచనలు మొదలవుతాయి. ఉద్యోగస్తులకు మంచి రోజు. పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది
సింహ రాశి
వ్యాపారంలో కొన్ని అడ్డంకులు ఏర్పడవచ్చు. మీరు రహస్య విషయాలను అధ్యయనం చేస్తారు. ఈ రోజు శుభవార్త వినే అవకాశం ఉంది. మీ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయండి. ఈ రోజు కొత్త పనులేవీ ప్రారంభించవద్దు.
కన్యా రాశి
ఈ రోజు కార్యాలయంలో ఒత్తిడికి గురవుతారు. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. సహాయం చేసేందుకు ప్రయత్నిస్తారు. ప్రేమ సంబంధాలలో తక్కువ ఉత్సాహం ఉంటుంది, సాంకేతిక రంగానికి సంబంధించిన వ్యక్తులకు సమయం చాలా మంచిది.
తులా రాశి
ఈ రోజు మీ పనిపై దృష్టి పెట్టండి. ప్రతికూలత దూరమవుతుంది. అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. మీరు ఏదైనా అంశంపై స్నేహితులతో చర్చించవచ్చు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. మీ సమర్థత కారణంగా వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు
Also Read: మేషం to మీనం .. 2025 సంవత్సరం ఏ రాశివారి అదృష్టం ఎలా ఉంది!
వృశ్చిక రాశి
ఈ రోజు మీరు పాత జ్ఞాపకాలలో మునిగిపోతారు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. మీరు సృజనాత్మక పనిపై ఆసక్తి చూపుతారు. ఆర్థిక సమస్యల కారణంగా ఇబ్బంది పడతారు. కార్యాలయంలో హెచ్చు తగ్గులు ఉంటాయి
ధనుస్సు రాశి
ఈ రోజు మీ మనసులో కొత్త ఆలోచనలు వస్తాయి. విద్యార్ధులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. మీరు కొత్త పనుల పట్ల ఉత్సాహంగా ఉంటారు. మీరు పెద్ద ప్రాజెక్ట్‌లో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. ఆరోగ్య సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి.
మకర రాశి
ఈ రోజు పెండింగ్‌లో ఉన్న పని కారణంగా ఒత్తిడికి గురవుతారు. మీరు మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవద్దు. అధిక బిజీ కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. మీ బంధువులతో సత్సంబంధాలు కొనసాగించండి.
కుంభ రాశి
ఈ రోజు మీరు పూర్తి అంకితభావంతో పని చేస్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. ఆరోగ్యం బావుంటుంది . ఆనందంగా ఉంటారు. కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ పూర్తవుతుంది. కుటుంబ సంబంధిత పనుల నిమిత్తం ప్రయాణం చేస్తారు.
Also Read: కొత్త ఏడాదిలో సంక్రాంతి, శివరాత్రి, ఉగాది, దసరా, దీపావళి ఎప్పుడొచ్చాయ్ - 2025 లో సెలవులు, పండుగల తేదీలివే!
మీన రాశి
ఈ రోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఇంట్లో సమస్యలు తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు. రాజకీయాల్లో ఉండేవారు తమ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ప్రభావవంతమైన వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి. చిన్న పిల్లలతో టైమ్ స్పెండ్ చేస్తారు.
Note:ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.