అన్వేషించండి

Weekly Horoscope March 03 to 09: ఈ వారం (మార్చి 03 - 09) ఈ రాశులవారికి ప్రశంసలు అందుకునే సమయం

Weekly Horoscope : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ వారం రాశిఫలితాలు ఇక్కడ తెలుసుకోండి....

Weekly Horoscope  March 3rd  to march 9th : ఈ వారం మీ రాశిఫలితం...

మేష రాశి 

మేషరాశి వారికి ఈ వారం శుభ ఫలితాలున్నాయి. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. మీ ప్రయత్నాలు సఫలం అవుతాయి. చేపట్టిన పనిని మధ్యలో వదిలేయకుండా పూర్తిచేసేందుకు ప్రయత్నించాలి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఖర్చులు అదుపుచేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు..స్నేహితుల నుంచి సహకారం అందుతుంది. 

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ వారం కుటుంబంలో సంతోషకరమైన సమయం.   ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక సంబంధిత విషయాల్లో మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. గతంలో ఆగిపోయిన పనులు ఈ వారం పూర్తిచేస్తారు. నూతన ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగు, వ్యాపారులు, విద్యార్థులు మంచి ఫలితాలు పొందారు. 

Also Read: ఈ రాశివారి లైఫ్ లోకి ఓ ప్రత్యేకమైన వ్యక్తి వస్తారు, మార్చి 03 రాశిఫలాలు

మిథున రాశి

మిథున రాశివారికి ఈ వారం పనిలో పురోగతి ఉంటుంది. మీ లక్ష్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం సమయం వెచ్చించాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పట్టుదలతో ఏ పని ప్రారంభించినా అడ్డంకులు ఎదురైనా పూర్తిచేయగలుగుతారు. కొన్ని అపోహలు మీనుంచి తొలగిపోతాయి..దూరమైనవారు మళ్లీ దగ్గరవుతారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. 

కర్కాటక రాశి 

కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలను కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. ఈ వారం ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందికర సమస్యలు ఎదురవుతాయి. గ్రహబలం మీకు అనుకూలంగా లేదు..అందుకే ప్రయత్నంలో లోపం రానివ్వొద్దు. ఓ విషయంలో మాత్రం విజయం సాధిస్తారు.

Also Read: మార్చి నెలలో ఈ రాశులవారిని అష్టమ శని అష్టకష్టాలు పెడుతుంది!

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి  మరింత మెరుగుపడుతుంది. నూతన పెట్టుబడులపై శ్రద్ధ వహించాలి. ఈ వారం మీ కెరీర్‌లో పురోగతి సాధించే అవకాశం ఉంది. కుటుంబ సంబంధాలను దృఢంగా ఉంచుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సహనంతో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పక్కనే ఉండి ఇబ్బంది కలిగించేవారున్నారు.. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. 

కన్యా రాశి

ఈ రాశివారికి ఈ వారం విజయవంతమైన కాలం. విద్య , విజ్ఞాన రంగాలలో ఉండేవారు మంచి ఫలితాలు పొందుతారు. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. స్నేహితుల నుంచి అవసరమైన సహకారం అందుతుంది. నూతన సమాచారం అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆర్థిక పరిస్థితి మీరు ఊహించనంతగా మెరుగుపడుతుంది. 

Also Read: మార్చి నెలలో ఈ రాశులవారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు, ఆదాయం వృద్ధి!

తులా రాశి

తులా రాశి వారికి ఈ వారం సంతోష సమయం. కుటుంబానికి సమయం కేటాయించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి బావున్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు మెరుగుపర్చుకునేందుకు ఇదే మంచి సమయం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దలతో సంప్రదించాలి. పనులు వాయిదా వేయవద్దు. వ్యాపారం, ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలున్నాయి. 

వృశ్చిక రాశి 

వృశ్చికరాశి వారికి ఈ వారం వృత్తిపరమైన పురోగతికి అవకాశం ఉంది. మీరు మీ పనికి ప్రాధాన్యత ఇవ్వాలి లక్ష్యాల వైపు దృష్టి పెట్టాలి.  స్నేహితులు   కుటుంబ సభ్యులతో సమయాన్ని వెచ్చించండి. ఆర్థిక ప్రణాళికలను నిర్వహించాల్సి రావచ్చు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ లో మంచి విజయాన్నిస్తాయి. ప్రయత్నాల్లో స్పష్టత వస్తుంది. ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి.  వ్యాపారంలో లాభాలున్నాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడులు కలిసివస్తాయి.  

Also Read:  తాళి,మెట్టెలు తీసేయడం ఫ్యాషన్ అనుకుంటున్నారేమో - ఈ విషయాలు తెలుసా మరి!

ధనుస్సు రాశి

ఈ వారం ధనుస్సు రాశి వారు వృత్తి, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. కష్టపడి ప్రయత్నించిన తర్వాతే మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. అనుకున్న సమయానికే పనిని పర్తిచేయాలి. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది..ఖర్చులు అదుపుచేయాలి. ఉద్యోగులు పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. స్థిరాస్తులు, వాహనం కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 

మకర రాశి 

మకర రాశి వారికి కుటుంబంలో సంతోషకరమైన సమయం ఇది. వివాదాల్లో రాజీకి ప్రయత్నించడమే మేలు. ఆర్థికంగా కలిసొచ్చే సమయం ఇది.. ఖర్చులు అదుపుచేస్తే మరింత మంచి జరుగుతుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టేందుకు శుభసమయం. వ్యాపార భాగస్వాముల కారణంగా లాబపడతారు. ఉద్యోగులకు చిన్న చిన్న ఇబ్బందులున్నా వాటిని అధిగమిస్తారు. 

Also Read: పెళ్లిలో వధూవరులకు అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారో తెలుసా!

కుంభ రాశి 

ఈ వారం కుంభ రాశి వారికి విద్య , విజ్ఞాన రంగాలలో విజయవంతమైన కాలం. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి. విద్యార్థులు కష్టపడి చదివితే కానీ మంచి ఫలితాలు పొందలేరు. నూతన ప్రణాళికలు అమలు చేసేముందు సన్నిహితుల నుంచి సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది. మీ చుట్టూ ఉండేవారిలో మీకు హానిచేసేవారున్నారు గుర్తించండి..అప్రమత్తంగా వ్యవహరించండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి   క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. 

మీన రాశి 

మీన రాశివారుఈ వారం ఆర్థిక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. న్యాయ సంబంధిత వ్యవహారాల్లో ఫలితం మీకు అనుకూలంగా వస్తుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. నూతన బాధ్యతలు చేపట్టే వీలుంది. ఆత్మవిశ్వాసంతో ఉండండి. ప్రేమ సంబంధిత విషయాల్లో సంతోష సమయం. ఇద్దరి మధ్యా ఉండే చిన్న చిన్న వివాదాలను కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకోవాలి.

Also Read: ఈ ఏడాది ఉగాది ఎప్పుడు - చైత్ర పాడ్యమి రోజే ఎందుకు జరుపుకుంటారు!

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట  పెట్టిన రేవంత్ రెడ్డి
జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట పెట్టిన రేవంత్ రెడ్డి
AP Group 2 Exam: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
Chiranjeevi: మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ideas of India 2025 | సీక్రెట్ వెడ్డింగ్ గురించి మాట్లాడిన Taapsee Pannu | ABP DesamIdeas of India 2025 | Goa CM Pramod Sawant ఢిల్లీ రాజకీయాల వైపు వెళ్తారా.? | ABP DesamIdeas of India 2025 | మార్స్ లో జీవంపై NASA JPL సీనియర్ సైంటిస్ట్ Dr Goutam ChattopadhyayNennuru Namaala Kaluva | Tirumala శ్రీవారు స్నానం చేసి నామాలు ధరించిన పవిత్ర ప్రదేశం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట  పెట్టిన రేవంత్ రెడ్డి
జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట పెట్టిన రేవంత్ రెడ్డి
AP Group 2 Exam: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
Chiranjeevi: మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
Mahakumbh: ఈ ఐడియా అతనికెందుకు వచ్చిందని కాదు మనకెందుకు రాలేదని బాధపడాలి - కుంభమేళాలో డిజిటల్ స్నాన్‌కి రూ. 1100 చార్జ్ !
ఈ ఐడియా అతనికెందుకు వచ్చిందని కాదు మనకెందుకు రాలేదని బాధపడాలి - కుంభమేళాలో డిజిటల్ స్నాన్‌కి రూ. 1100 చార్జ్ !
ABP Network Ideas Of India 2025: గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
India vs Pakistan Champions Trophy 2025: పాక్‌తో మ్యాచ్.. పిచ్‌పై రోహిత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. దుబాయ్‌లో భార‌త్‌కే మొగ్గు..!
పాక్‌తో మ్యాచ్.. పిచ్‌పై రోహిత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. దుబాయ్‌లో భార‌త్‌కే మొగ్గు..!
Koneru Konappa: కాంగ్రెస్ కు షాక్ - ఇలా చేరి అలా గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే - బీఆర్ఎస్‌లోకేనా ?
కాంగ్రెస్ కు షాక్ - ఇలా చేరి అలా గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే - బీఆర్ఎస్‌లోకేనా ?
Embed widget