Weekly Horoscope: గురుపూర్ణిమతో మొదలయ్యే ఈ వారం ఈ రాశులవారికి గుడ్ న్యూస్ తెస్తోంది!
Weekly Horoscope : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
Weekly horoscope, July 3-9, 2023: జూలై 3 గురుపూర్ణిమతో మొదలయ్యే వారం ఏ రాశులవారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.
మేష రాశి
ఈ వారంలో మీరు పని చేసే టైం, విశ్రాంతి తీసుకునే టైం రెండూ సమానంగా ఉంటాయి. మీ ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. ప్రణాళికాబద్ధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థుల దృష్టి చదువుపై ఉంటుంది. ఎప్పటి నుంచో కొనాలన్న వస్తువులను తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు ప్రతిరోజూ 27 సార్లు "ఓం భౌమాయ నమః" అని జపించండి.
వృషభ రాశి
ఈ వారం ఈ రాశివారు మీ సామర్థ్యానికి మించి పని చేయాల్సిన అవసరం వస్తుంది. తొందరగా అలసిపోతారు. విశ్రాంతికి ప్రాధాన్యతనివ్వండి. విద్యార్థులు పోటీ పరీక్షలు రాసేందుకు ఇదే సరైన సమయం. మీకు శుభ్రప్రదమైన సమయం. ఈ వారం ఆర్ధిక అభివృద్ధి పుష్కలంగా ఉంటుంది. మీ సృజనాత్మక ఆలోచనలు అభివృద్ధి చెందుతాయి, కానీ కుటుంబ వివాదాలు తలెత్తవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజూ లలితా సహస్రనామాన్ని జపించండి.
మిథున రాశి
ఈ రాశివారు ఈ వారం డ్రైవింగ్‌కు దూరంగా ఉండటం మంచిది. డబ్బు ఆదా చేసే అవకాశం ఉంది. అశాంతి ఎక్కువ అయ్యి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీ ప్రతికూల అలవాట్లు మిమ్మల్ని తప్పు దారిలో పయనించేలా చేస్తాయి. అయితే కొన్ని శుభవార్తలు అందే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారం వల్ల కొంత నష్టాలు రావచ్చు. ప్రతిరోజూ 21 సార్లు "ఓం బుధాయ నమః" అని జపించండి.
Also Read: మీరు నవంబరులో పుట్టారా, ఆ ఒక్క లక్షణం మార్చుకుంటే మీరే రాజు మీరే మంత్రి
కర్కాటక రాశి
ఈ రాశివారికి ఈ వారం ఒత్తిడి పెరగవచ్చు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. కొన్ని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, కుటుంబంలో మీ కీర్తి పెరుగుతుంది, ఈ విషయం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ కాలంలో మీకు కొంచెం అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సానుకూల శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఉంటుంది. ప్రతిరోజూ 11 సార్లు "ఓం దుర్గాయ నమః" అని జపించండి.
సింహ రాశి
యోగా, ధ్యానంలో మనసు నిమగ్నమవడం వల్ల శారీరక, మానసిక ప్రయోజనాలు చేకూరుతాయి. కొన్ని పథకాలలో పెట్టుబడి పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబంలో ఉద్రిక్త తావరణం ఉండవచ్చు..అనవసర వాదనలకు దారితీస్తుంది. సమర్థవంతమైన కమ్యూనికేషన్ ద్వారా మీరు ఈ వైరుధ్యాలను పరిష్కరించవచ్చు . అనవసర చర్చల్లో పాల్గొనవద్దు. "ఓం భాస్కరాయ నమః" అని ప్రతిరోజూ 19 సార్లు జపించండి.
కన్యా రాశి
కన్యా రాశిలో జన్మించిన కొందరు వ్యక్తులు ఈ వారం ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. భవిష్యత్తులో మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. మానసిక మార్పులు కూడా వచ్చే అవకాశం ఉంది. సానుకూల ఆలోచన వల్ల కుటుంబంలో కొత్త ఆనందం మీకు ప్రయోజనాలను తెస్తుంది. ప్రతిరోజూ 41 సార్లు "ఓం నమో నారాయణయ్" జపించండి.
తులా రాశి
ఈ రాశివారు చాలా కాలంగా పోరాడుతున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయంతో పాటూ ఖర్చులు పెరుగుతాయి. కానీ ఈ వారం శ్రద్ధతో కృషి చేస్తే విజయానికి ప్రత్యేక అవకాశం లభిస్తుంది. విద్యార్థులు తమ శ్రమకు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. మొత్తంమీద, ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అమ్మవారి శ్లోకాలు పఠించండి.
వృశ్చిక రాశి
చాలా కాలంగా మీరు కోరుకున్న, కోల్పోయిన విశ్వాసం ఈ వారం పునరుద్ధరించుకోవచ్చు. ఆర్థిక విషయాలు మీకు గణనీయమైన విజయాన్ని తెచ్చే అవకాశం ఉంది. మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ కాలం అనువైనది. విద్యార్థులు పరీక్షల సమయంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. అనుకోని అతిథులు మీ ఇంటికి రావచ్చు. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా జపించండి.
Also Read: ఈ నెలలో పుట్టిన వారు లవ్ లో ఫెయిల్ అవుతారు, వ్యక్తిగతంగా సక్సెస్ అవుతారు
ధనుస్సు రాశి
ఈ వారంలో మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోనే అవకాశం ఉంది. అయితే మీ సృజనాత్మక సామర్థ్యం పెరుగుతుంది. మీకు అనుకూలమైన అవకాశాల నుంచి ప్రయోజనం పొందుతారు. డబ్బు ఆదా చేసే అవకాశం ఉంది. విద్యా సంస్థలో జాయిన్ అవటానికి పరిగణించండి, ఎందుకంటే ఇది ఆశాజనకమైన సమయం. మీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతిరోజూ 21 సార్లు "ఓం గురవే నమః" అని జపించండి.
మకర రాశి
ఈ వారం మీకు అన్నీ అనుకూల ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యులకు సమయం కేటాయించండి. విహార యాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి ఫలితాలుంటాయి. నిర్ణయాలు తీసుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. నిరుద్యోగులకు మంచి అవకాశాలుంటాయి.
కుంభ రాశి
ఈ వారం కుంభ రాశివారు వ్యాపారాన్ని విస్తరించడానికి రుణం తీసుకోవలసి ఉంటుంది. అయితే ఈ సమయంలో మీ మనస్సు గందరగోళంగా అనిపించవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు కొత్త ఇల్లు కొనాలని ఆలోచన కొంతకాలం వాయిదా పడుతుంది. ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. మీకు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. శనివారం పేదలకు దానం చేయండి.
మీన రాశి
ఈ వారం ఈ రాశివారికి కుటుంబంలో మంచి సపోర్ట్ ఉంటుంది. మీ కెరీర్ అభివృద్ధి చెందుతుంది. ఈ వారం మీకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది. ఎట్టకేలకు మీరు కోరుకున్న సౌకర్యాలను పొంది ఆస్వాదిస్తారు. కుటుంబ సభ్యులతో మీ సంబంధం బలంగా ఉండి ప్రయోజనాలను అందిస్తుంది. గురువారం వృద్ధ బ్రాహ్మణులకు దానం చేయండి.