News
News
X

మార్చి 13 to 19 వారఫలాలు: ఈ వారం ఈ రాశివారు మాటతీరు, ప్రవర్తనపై నియంత్రణ కలిగి ఉండాలి!

Weekly Horoscope (13-19 March 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

మార్చి 13 to 19 వారఫలాలు: మార్చి 13 సోమవారం నుంచి మార్చి 19 ఆదివారం వరకూ   ఈ ఆరు రాశులవారికి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి.  ఈ వారం రోజులు జాగ్రత్తగా ఉండడం మంచిది...

మిథున రాశి

ఈ రాశివారు వారం ప్రారంభంలో చాలా బిజీగా ఉంటారు. అదనపు పనిభారాన్ని మోస్తారు. దీని వల్ల మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. అలాంటి పరిస్థితిలో ఏదైనా పనిచేసేటప్పుడు సహనం పాటించడం మంచిది. మీరు మీ మాటతీరు, ప్రవర్తనపై నియంత్రణ కలిగి ఉండాలి మరియు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నిగ్రహాన్ని కోల్పోవద్దు..లేకపోతే చేసిన పని క్షీణించవచ్చు. మీ లక్ష్యం నుంచి మిమ్మల్ని మరల్చడానికి తరచుగా ప్రయత్నించే కార్యాలయంలోని వ్యక్తుల మాటలను విస్మరించండి. వ్యాపారులకు వారం మధ్యలో మరింత శుభం జరుగుతుంది. వ్యాపార సంబంధ ప్రయాణాలు శుభదాయకంగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో నిదానంగా, స్థిరంగా పురోగతి ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు దృఢంగా ఉంటాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 

కర్కాటక రాశి

వారం ప్రారంభంలో మీరు పనిలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.  దీర్ఘకాలిక వ్యాధి నుంచి బయటపడతారు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి, గాయాలయ్యే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులు వ్యాపారానికి సంబంధించిన పెద్ద నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. వారం మధ్యలో ఆర్థిక పరిస్థితి ఓ మోస్తరుగా ఉంటుంది. వారాంతంలో పిల్లలకోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.మీ ప్రేమ సంబంధంలో ఏదో ఒక విషయం గురించి అపార్ధం ఉండవచ్చు..దానిని అధిగమించడానికి వారితో వివాదం పెట్టుకోవడం కన్నా కూర్చుని మాట్లాడటమే మంచిది. జీవిత భాగస్వామి నుంచి పూర్తిస్థాయి మద్దతు ఉంటుంది. 

Also Read: ఈ ఉగాది నుంచి ఈ రాశివారికి శని కరుణించినా గురుబలం లేదు, కొన్ని రంగాలవారికి మాత్రం అద్భుతంగా ఉంది

వృశ్చిక రాశి

వారాంతంలో ప్రత్యర్థుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే సమయంలో, మీ లక్ష్యం నుంచి మిమ్మల్ని మరల్చడానికి తరచుగా ప్రయత్నించే వారి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ పనినైనా తొందరపడకుండా అవగాహనతో చేయడానికి ప్రయత్నించండి, లేకపోతే మీరు పెద్ద ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.కాలానుగుణ లేదా దీర్ఘకాలిక వ్యాధి మిమ్మల్ని శారీరకంగా, మానసకింగా కుంగదీస్తుంది. మీ జీవనశైలిని సరిగ్గా ఉంచండి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆఫీసులో అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సీనియర్లు, జూనియర్లతో మీ సంబంధాలు చెడిపోకూడదు. విద్యార్థులు ఆశించిన విజయాన్నిపొందాలంటే కృషి అవసరం. ప్రేమ బంధంలో ఎలాంటి అపార్థాలకు తావివ్వవద్దు. పాజిటివ్ థింకింగ్ తో ముందుకు సాగితేనే ప్రేమ బంధం బలపడుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి మనసు కాస్త ఆందోళన చెందుతుంది.

మకర రాశి 

వారం ప్రారంభంలో లాభనష్టాల గురించి ఆలోచించాలి. ఏదైనా పనిలో తొందరపాటు పనికిరాదు..చిన్న పొరపాటు చేసినా ఆ ప్రభావం మొత్తం పనిపై పడుతుంది.ఉద్యోగులు అదనంగా శ్రమిస్తేనే మంచి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపారులు ఆశించిన లాభాలు పొందుతారు. వ్యాపారం విస్తరించాలి అనుకుంటే ఇదే మంచి సమయం. ఆదాయంతో పాటూ ఖర్చులు కూడా పెరుగుతాయి. చిన్న చిన్న గిల్లికజ్జాలతో ఇంట్లో వాతావరణం కొద్దిసేపు గంభీరంగా, కొద్దిసేపు సంతోషంగా అలా నడుస్తుంది. వీకెండ్ లో మీ ప్రేమిుకల నుంచి గిఫ్ట్ పొందుతారు. వైవాహిక జీవితం బాగానే ఉంటుంది. 

కుంభ రాశి

వారం ప్రారంభంలో సోమరితనంగా ఉంటారు. ఏదైనా పనిని వాయిదా వేసే అలవాటు మీకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది, కాబట్టి మీ అన్ని పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అదే సమయంలో, ఇల్లు లేదా పనిప్రాంతంలో అందరితో కలసి ఉండేలా ప్లాన్ చేసుకోండి. భాగస్వామ్యం వ్యాపారం చేసేవారు తమ వ్యాపారాన్ని ఇతరులకు వదిలేయకూడదు. వారం మధ్యలో పెద్ద బాధ్యత పొందుతారు. అదనపు శ్రమ అవసరం. విద్యార్థులకు వారాంతంలో శుభవార్తలు అందుతాయి. మీ ఆరోగ్యంపై చాలా శ్రద్ధ వహించండి. ఈ సమయంలో, మీ ఇంటిలోని సీనియర్ సభ్యుల సలహాలు విస్మరించవద్దు. ప్రేమ బంధంలో అపార్థాలను వివాదాల ద్వారా కాకుండా సంభాషణల ద్వారా తొలగించండి. వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఉంచడానికి, మీ జీవిత భాగస్వామి కోసం సమయం కేటాయించండి.

Also Read: శోభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలవారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే శూన్య ఫలితం

మీన రాశి

వారం ప్రారంభంలో ఇతరుల పనిలో తలదూర్చకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. అదేవిధంగా, ఒక పనిని అసంపూర్తిగా వదిలేసి మరొక పనిని ప్రారంభించాలి అనుకోవద్దు. మీ పనిని మరొకరికి అప్పగించాలి అనుకోవద్దు. వారం మధ్యలో మీ ప్రత్యర్థులు మీపై వారి ప్రభావాన్ని చూపడానికి మీ లక్ష్యం నుంచి మిమ్మల్ని మరల్చడానికి ప్రయత్నించవచ్చు...ఈ సమయంలో మీరు మీ పనిని చాలా జాగ్రత్తగా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోవద్దు. వ్యాపారస్తులు మార్కెట్లో మందగమనాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. వారాంతంలో వ్యాపారానికి సంబంధించి దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ప్రేమ సంబంధాలు సాధారణంగానే ఉంటాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మీకు అండగా ఉంటారు. 

Published at : 13 Mar 2023 07:00 AM (IST) Tags: weekly horoscope in telugu 13th to 19th march 2023 Weekly Horoscope Gemini weekly horoscope in telugu Scorpio weekly horoscope in telugu Aquarius weekly horoscope in telugu Pisces weekly horoscope in telugu

సంబంధిత కథనాలు

2023 Panchangam in Telugu: ఈ రాశులవారికి సంపాదన కన్నా ఖర్చులెక్కువ

2023 Panchangam in Telugu: ఈ రాశులవారికి సంపాదన కన్నా ఖర్చులెక్కువ

Ramadan 2023: రంజాన్‌ ఉపవాస దీక్షలు ఎందుకంత కఠినంగా ఉంటాయి, దానివెనుకున్న ఆంతర్యం ఏంటి!

Ramadan 2023: రంజాన్‌ ఉపవాస దీక్షలు ఎందుకంత కఠినంగా ఉంటాయి, దానివెనుకున్న ఆంతర్యం ఏంటి!

మార్చి 24 రాశిఫలాలు, ఈ రాశివారికి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కొత్త అవకాశాలు లభిస్తాయి

మార్చి 24 రాశిఫలాలు, ఈ రాశివారికి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కొత్త అవకాశాలు లభిస్తాయి

Srirama Navami Special 2023: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది, రామాయణాన్ని నారాయణుడి కథగా కాదు నరుడి కథగా చదవాలంటారు ఎందుకు!

Srirama Navami Special 2023: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది, రామాయణాన్ని నారాయణుడి కథగా కాదు నరుడి కథగా చదవాలంటారు ఎందుకు!

Saturn Transit 2023: శని మూడు రకాలు, మీకున్నది ఏ శని -ఎన్నాళ్లుంటుంది- ప్రభావం ఎలా ఉంటుంది, పరిహారాలేంటి!

Saturn Transit 2023: శని మూడు రకాలు, మీకున్నది ఏ శని -ఎన్నాళ్లుంటుంది- ప్రభావం ఎలా ఉంటుంది, పరిహారాలేంటి!

టాప్ స్టోరీస్

YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

YSRCP Reverse :   దెబ్బ మీద దెబ్బ  - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

AP Cag Report :  13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ,  మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల